లెబనాన్‌లో వాకీటాకీ పేలుళ్లు.. 32కి చేరిన మృతుల సంఖ్య.. పలువురి పరిస్థితి విషమం

లెబనాన్ లో పేజర్లను పేల్చి విధ్వంసం సృష్టించిన మరుసటి రోజే వాకీటాకీల పేలుళ్లు కలకలం రేపాయి. బుధవారం బీరుట్ తో పాటు పలు ప్రాంతాల్లో వాకీటాకీలను హ్యాక్ చేసి పేల్చేశారు.

లెబనాన్‌లో వాకీటాకీ పేలుళ్లు.. 32కి చేరిన మృతుల సంఖ్య.. పలువురి పరిస్థితి విషమం

hezbollah walkie talkies explode

Updated On : September 19, 2024 / 8:10 AM IST

Lebanon Hezbollah: లెబనాన్ లో పేజర్లను పేల్చి విధ్వంసం సృష్టించిన మరుసటి రోజే వాకీటాకీల పేలుళ్లు కలకలం రేపాయి. బుధవారం బీరుట్ తో పాటు పలు ప్రాంతాల్లో వాకీటాకీలను హ్యాక్ చేసి పేల్చేశారు. వీటితోపాటు సౌర పరికరాలనూ పేలుళ్లకు వినియోగించుకున్నారు. ఈ ఘటనల్లో మృతుల సంఖ్య 32కిచేరగా.. వందలాది మంది గాయపడ్డారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. బీరుట్, బెకా, నబాతిహ్, దక్షిణ లెబనాన్ లలో గంట వ్యవధిలో వందలాది మంది గాయపడ్డారు. ఇళ్లలో మొబైల్ ఫోన్లతో పాటు ఇతర ఉపకరణాలు కూడా పేలిపోయినట్లుగా స్థానికులు చెబుతున్నారు.

Also Read : Hezbollah Hit Again : లెబనాన్‌లో ఆగని దాడులు.. పేజర్ పేలుళ్ల తర్వాత పేలిన వాకీ‌టాకీలు.. 9 మంది మృతి, 300 మందికి పైగా గాయాలు!

ఈ పేలుళ్ల తర్వాత ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య వివాదం మరింత పెరిగింది. ఇజ్రాయెల్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు హిజ్బుల్లా క్షిపణులను ప్రయోగించింది. కిర్యాత్ ష్మోనా వద్ద లెబనాన్ నుంచి సుమారు 20 రాకెట్లు ప్రయోగించారని, కొన్ని రాకెట్లను అడ్డుకోవటం జరిగిందని ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్) తెలిపింది. ఎవరికీ గాయాలు అయినట్లు సమాచారం లేదు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ.. ఇజ్రాయెల్ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు హిజ్బుల్లా ప్రకటించింది. నిజానికి పేజర్ పేలుడు తరువాత హిజ్బుల్లా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. లెబనాన్ సరిహద్దుల్లో ఇజ్రాయెల్ 20వేల మంది సైనికులను మోహరించింది.

 

తాజా పేలుళ్లు, వాటి వల్ల జరిగిన విధ్వంసం చూసి ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. ఈ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్‌ని చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఈ పేజర్ పేలుళ్ల వెనుక ఎవరున్నారు..? లెబనాన్, హిజ్బుల్లా నేరుగా ఇజ్రాయెల్ ను దీనికి కారణమని ఆరోపించాయి. పేలిన పేజర్లను ఇటీవల హిజ్బుల్లా వారి సభ్యులకు ఉపయోగంకోసం ఇచ్చినట్లు చెబుతున్నారు. గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పుడు హిజ్బుల్లా తన సభ్యులను మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం విధించారు. పరిచయం కోసం పేజర్లు వినియోగించారు. కానీ, ఇజ్రాయెల్ ఈ పేజర్లను హిజ్బుల్లా యోదుల మరణంగా మార్చింది. దీని తరువాత లెబనీస్ ప్రభుత్వం పేజర్ల వినియోగాన్ని నిషేధించింది.