లాక్‌డౌన్ ఇండియన్లను ఎక్కువ కాలం బతికేలా చేస్తుందా..

  • Publish Date - April 29, 2020 / 10:09 AM IST

చావుకు బ్రేకులు వేశామా.. ఇండియాలో కరోనా మృతులు 1000కి చేరింది. COVID 19 కారణంగా ఇండియాలో 1000కి చేరేలా ఉన్నాయి మృతుల సంఖ్య. ఇదే సమయంలో ఇతర వ్యాధుల కారణంగా మరణించేవారి సంఖ్య గతేడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గిపోయింది. హాస్పిటళ్లు, అంత్యక్రియల డేటా ఆధారంగా ఓ ఇంగ్లీష్ మీడియా సర్వే నిర్వహించింది. 

మార్చి 25 నాటికి COVID-19 కాకుండా ఇతర వ్యాధుల కారణంగా మరణించిన వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ముంబైలో ఈ ఏడాది 21శాతం తగ్గిపోయాయట. అహ్మదాబాద్ లో 67శాతం మృతులు తగ్గిపోయాయి. కేరళ హాస్పిటల్స్ డేటా ఆధారంగా చూస్తే హార్డ్ అటాక్ కారణంగా చనిపోయే 30-50శాతం పేషెంట్లు తగ్గిపోయారు. 

 

మృతులు తగ్గిపోయాయ్:
వ్యాధుల కారణంగా చనిపోయే వారిని పక్కకుబెడితే రోడ్, ట్రైన్ యాక్సిడెంట్ల కారణంగా నమోదయ్యే కేసుల్లోనూ భారీ తగ్గుదల కనిపించింది. 2018 డేటాను పరిశీలిస్తే గంటలకు 17మంది యాక్సిడెంట్ల కారణంగా చనిపోయే వారే ఉన్నారు. ఇంకా వీరి వల్ల గంటకు లక్షా 51వెయ్యి 417కేసులు నమోదయ్యేవి. లాక్‌డౌన్ పుణ్యమా అని వెహికల్ ట్రాఫిక్ తగ్గడమే కాకుండా జీరో రోడ్ యాక్సిడెంట్లు నమోదవుతున్నాయి. 

2020లో వీటి సంఖ్య దాదాపు 15శాతానికి పడిపోయింది. ప్రతి రోజూ యూపీలోని గంగా నది దగ్గర బూడిద కలిపే వాటిలో కనీసం 10 రోడ్ యాక్సిడెంట్లు ఉండేవి. 30 అంత్రక్రియలు జరిగేవి. ఇప్పుడు రోజుకు అవి ఒకటి లేదా రెండు మాత్రమే. మార్చి 22 నుంచి 43 అంత్యక్రియలు మాత్రమే జరిగాయి. 

ఆల్కహాల్, డ్రగ్ అలవాట్ల కారణంగా మరణించే వారి సంఖ్య తగ్గిపోయింది. పంజాబ్‌లో డ్రగ్ డీ అడిక్షన్ కేసులు 26వేలకు పెరిగాయి. ట్రాఫిక్ జాంలు లేకపోవడంతో హార్ట్ అటాక్ వంటి సమస్యలు వచ్చినప్పుడు సకాలంలో హాస్పిటల్ కు తీసుకెళ్లగలుగుతున్నారు. ఫలితంగా ప్రాణాలు కాపాడుకుంటున్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఈ సంఖ్య కచ్చితంగా పెరుగుతుంది.  

భారతదేశ వ్యాప్తంగా గాలి, నీరులో కాలుష్య స్థాయిలు బాగా పడిపోయాయి. ప్రత్యేకించి ఉత్తరభారతంలో ఎక్కువ మార్పులు కనిపిస్తున్నాయి. 20ఏళ్ల క్రితం ఉన్న కాలుష్య స్థాయికి వెళ్లిపోయాయి. గంగా, యమునా నదులు స్వచ్ఛంగా మారిపోయాయి. లాక్‌డౌన్ నుంచి పరిశ్రమలన్నీ మూసేయడమే దానికి కారణం.