Nurse Weight Loss Tricks : బరువు తగ్గడం ఇంత ఈజీనా.. ఈ సింపుల్ డైట్ ట్రిక్స్‌తో 45కిలోలు తగ్గిన నర్సు..!

Nurse Weight Loss Tricks : ఆస్ట్రేలియన్‌కు చెందిన నర్సు సమంతా అబ్రూ తన డైట్‌లో చిన్న మార్పుతో సులభమైన వ్యాయామాలను చేస్తూ ఏడాదిలోనే దాదాపు 45 కిలోల బరువు తగ్గింది.

Nurse Weight Loss Tricks : ఈ రోజుల్లో బరువు తగ్గడం అంటే అంత ఈజీ కాదు.. అది మహిళలు అయినా పురుషులైనా? కావొచ్చు. ఒకసారి అధిక బరువు పెరిగారంటే శరీరాన్ని కరిగించుకోవడం కత్తిమీద సాములాంటిదనే చెప్పాలి. కొంతమంది ఏమి తినకపోయినా అదేపనిగా బరువు పెరిగిపోతుంటారు. మరికొంతమంది చిన్నప్పటి నుంచి ఏదో ఒక అనారోగ్యం కారణంగా భారీగా బరువు పెరిగిపోతుంటారు. ఇలాంటి సమస్యలను ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఎదుర్కొంటునే ఉన్నారు. శరీర బరువును తగ్గించుకోవడానికి జిమ్‌లలో గంటలకొద్ది ఎక్సరసైజులు తెగ చేసేస్తుంటారు. ఎన్ని వర్కౌట్లు చేసినా, ఎంత డైట్ ప్లాన్ ఫాలో అయినా కొంతమంది బరువు ఏమాత్రం తగ్గరు. పైగా ఇంకా పెరిగిపోతునే ఉంటారు.

Read Also : Asia Best Restaurants List : 2024లో ఆసియాలోని టాప్ 100 రెస్టారెంట్ల జాబితా.. 5 భారతీయ రెస్టారెంట్లకు చోటు!

ఇలాంటి అధిక బరువు సమస్యను ఆస్ట్రేలియాకు చెందిన నర్సు అత్యంత సునాయసంగా పరిష్కరించుకుంది. మెల్ బోర్న్‌కు చెందిన సమంతా అబ్రా (25) దాదాపు 115 కిలోల బరువు ఉంటుంది. అయితే, చిన్నప్పటి నుంచి ఆమె అధిక బరువు సమస్యతో పోరాడుతోంది. ఈ సమస్య నుంచి ఎలాంటి బయటపడాలో తెలియక చాలా ఇబ్బందిపడేది. చివరికి ఈ బరువు సమస్యకు ఒక పరిష్కారాన్ని సాధించింది. ఆమె చేసిందిల్లా.. కేవలం తన డైట్ రొటీన్‌లో చిన్న సాధారణ మార్పు మాత్రమే.. అంతేకాదు.. బరువు తగ్గడానికి సులభమైన వ్యాయామాన్ని కూడా చేస్తూ వచ్చింది. ఇలా ఒక ఏడాదిలోనే దాదాపు 45 కిలోల బరువు తగ్గింది. రోజువారీ నడక ద్వారా తన ఆరోగ్యాన్ని మార్చుకుంది. ఆహారంలో కూడా భారీ మార్పులు చేసింది. ప్రధానంగా ఫుడ్ కంట్రోల్ చేసింది.

కోవిడ్-19 లాక్‌డౌన్ కీలక మలుపు :
మిర్రర్ నివేదిక ప్రకారం.. సమంతాకు బాగా తినే అలవాటు ఉంది. రాత్రి భోజనం తర్వాత తృణధాన్యాలు, టోస్ట్ వంటివి అదేపనిగా తినేసింది. ఈ అధిక బరువు కారణంగా తీవ్ర అలసటగా అనిపించేది. పని చేసే సమయంలో 10 గంటల షిఫ్టులను పూర్తి చేసేందుకు కూడా చాలా కష్టపడతానని ఆమె తెలిపింది. కోవిడ్‌-19 లాక్‌డౌన్‌ సమయంలో ఆమె జీవితం కీలక మలుపు తిరిగింది. నడవలేని కొందరు వృద్ధ రోగులను ఆసుపత్రిలో చూసి బాధపడిన సమంత.. తన మానసిక ఆరోగ్యం కోసం ప్రతిరోజూ వాకింగ్‌కు వెళ్లడం ప్రారంభించింది. అప్పుడే ఆమెకు నడక అనేది ఒక వరమని భావించింది. నెమ్మదిగా పోర్షన్ కంట్రోల్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించింది. తినే ఆహారం పరిమాణాన్ని కూడా తగ్గించింది. సరిగ్గా ఏడాదిలో దాదాపు 45 కిలోల బరువు తగ్గింది.

Australian nurse 45 kg weight loss

డైట్‌లో ఈ చిన్న మార్పుతోనే.. :
ఈ సందర్భంగా సమంతా స్విన్స్ (SWNS.com) సైటుతో మాట్లాడుతూ.. ‘నేను ఇప్పుడు ఆహారాన్ని ఇంధనంగా చూస్తున్నాను’ అని చెప్పింది. తన డైట్‌లో చిన్న మార్పు ద్వారా సమంతా ఆహారాన్ని తగ్గించుకుంది. ఉదాహరణకు.. పిజ్జాకు బదులుగా ఆమె ఆరోగ్యకరమైన వెర్షన్‌గా ర్యాప్ పిజ్జాను తినడం మొదలుపెట్టింది. నేచరుల్‌గా బరువు తగ్గడం, డైట్ ప్లాన్ గురించి ఆమె తన టిక్‌టాక్‌లో జర్నీని షేర్ చేసింది. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. ఇతరులు తనను తమలో చూసుకుని వారి డైట్‌లో మార్పులు చేసుకుంటారని ఆశిస్తున్నానని, అంతే తనకు కావాలి అంటూ పేర్కొంది.

ముందు : 115 కిలోల బరువు
బ్రేక్ ఫాస్ట్ : గిన్నెలో తృణధాన్యాలు/టోస్ట్
లంచ్ : శాండ్‌విచ్/డిన్నర్ అదేపనిగా తినేది
డిన్నర్ : రోస్ట్ అధికం
స్నాక్స్ : తృణధాన్యాలు, టోస్ట్, ఫాస్ట్ ఫుడ్

ఇప్పుడు : 68 కిలోల బరువు
బ్రేక్ ఫాస్ట్ : ఓట్స్ విత్ ఫ్రూట్
లంచ్ : గ్రీక్ చికెన్ పాస్తా
డిన్నర్ : చికెన్ ర్యాప్ పిజ్జా

సమంతా అబ్రూ.. ఇప్పుడు ప్రతిరోజూ 10వేల అడుగులు నడుస్తుంది. ఆమె దినచర్యలో 5కిలోమీటర్ల పరుగులతో వారానికి 4 సార్లు జిమ్‌లో వ్యాయామాలను చేస్తుంది. అదే డైట్ ప్లాన్ సాయంతో సమంతా తన శరీరాన్ని భారీగా తగ్గించుకున్నట్టు వెల్లడించింది.

Read Also : Hyderabad Hospital : హైదరాబాద్ వైద్యుల అరుదైన ఘనత.. 60ఏళ్ల వ్యక్తి కిడ్నీలో 418 రాళ్లను తొలగించారు..!

ట్రెండింగ్ వార్తలు