Asia Best Restaurants List : 2024లో ఆసియాలోని టాప్ 100 రెస్టారెంట్ల జాబితా.. 5 భారతీయ రెస్టారెంట్లకు చోటు!
Asia Best Restaurants 2024 : ఆసియాలోని 50 బెస్ట్ రెస్టారెంట్‌లను ఇటీవలే ప్రకటించగా.. లేటెస్టుగా 2024కు సంబంధించి 51 నుంచి 100 వరకు రెస్టారెంట్ల జాబితాను విస్తరించింది. ఇందులో అనేక భారతీయ రెస్టారెంట్‌లు చోటు దక్కించుకున్నాయి.

5 Indian Restaurants Featured On List Of Asia's Best Restaurants Ranked 51-100 For 2024
Asia Best Restaurants 2024 : ప్రపంచంలోని టాప్ 50 రెస్టారెంట్‌ల జాబితాలో భారతీయ వంటకాలను అందించే రెస్టారెంట్లు ప్రత్యేకంగా నిలిచాయి. ప్రముఖ యూకే ఆధారిత విలియం రీడ్ బిజినెస్ మీడియా 50 బెస్ట్ ర్యాంకింగ్‌లను అందిస్తోంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలోని బెస్ట్ రెస్టారెంట్‌లకు సంబంధించిన జాబితాను ప్రకటించింది.
గత ఫిబ్రవరిలో మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికాకు సంబంధించి వార్షిక 50 బెస్ట్ లిస్ట్ ఎంట్రీలను ప్రకటించింది. లేటెస్టుగా, 2024లో 51 నుంచి 100 వరకు ఉన్న ఆసియాలోని రెస్టారెంట్‌ల జాబితాను కూడా ఆవిష్కరించింది. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో 5 భారతీయ సంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఈ ఏడాదికి సంబంధించిన టాప్ 50 రెస్టారెంట్లు ఈ నెలాఖరులో వెల్లడి కానున్నాయి.
51-100 జాబితాలో 3 ముంబై రెస్టారెంట్లు :
2024లో ఆసియాలోని బెస్ట్ రెస్టారెంట్‌ల జాబితాలో 51 నుంచి 100 వరకు 3 ముంబై రెస్టారెంట్లు ఉన్నాయి. అందులో అమెరికానో (61వ ర్యాంక్), ది బాంబే క్యాంటీన్ (70వ ర్యాంక్), ఎకా (98వ ర్యాంక్) ఉన్నాయి. మిగిలిన రెండు రెస్టారెంట్లు ఢిల్లీలోని ఎన్‌సీఆర్‌లో ఉన్నాయి. గురుగ్రామ్‌లోని కొమోరిన్ 79వ స్థానంలో ఉండగా, న్యూఢిల్లీలోని దమ్ పుఖ్త్ 87వ స్థానంలో ఉంది.
దేశం వెలుపల రెస్టారెంట్లలో బ్యాంకాక్‌లో ‘గా’ అనే రెస్టారెంట్ ఉంది. భారతీయ చెఫ్ గరిమా అరోరా హెల్మ్ దీన్ని రన్ చేస్తున్నారు. ఇక ఈ రెస్టారెంట్‌కు 2023లో రెండవ మిచెలిన్ స్టార్ అవార్డు కూడా లభించింది. ప్రముఖ చెఫ్ గగ్గన్ ఆనంద్‌తో కూడిన బ్యాంకాక్‌లోని మెక్సికన్-ఇండియన్ రెస్టారెంట్ మరియా అండ్ మిస్టర్ సింగ్ 54వ ర్యాంకును దక్కించుకుంది.
ఈ నెల 26న 50 బెస్ట్ రెస్టారెంట్ల జాబితా ప్రకటన :
విస్తరించిన జాబితాలో టోక్యోకు చెందిన (L’Effervescence) రెస్టారెంట్ అగ్రస్థానంలో ఉంది. 51 నుంచి 100 జాబితాలో ఆసియాలోని 16 నగరాల నుంచి పలు రెస్టారెంట్లు ఉన్నాయి. అందులో సింగపూర్, టోక్యో ముందంజలో ఉన్నాయి అందులో ఒక్కొక్కటి 8 రెస్టారెంట్లు చొప్పున ఉన్నాయి.
View this post on Instagram
గత ఏడాదిలో పొడిగించిన జాబితాలో ఢిల్లీలోని ఐటీసీ మౌర్యలో బుఖారా, ముంబైలోని ది టేబుల్ ఉన్నాయి. 2023లో అమెరికానో 66వ స్థానం, ఎకా (ekaa) 93వ స్థానాన్ని ఆక్రమించింది. మార్చి 26, 2024న దక్షిణ కొరియాలోని సియోల్‌లో జరిగే అవార్డుల కార్యక్రమంలో ఆసియాలోని 50 బెస్ట్ రెస్టారెంట్ల 2024 జాబితా ప్రకటించనుంది.
Read Also : Elon Musk AI : 2029 నాటికి మనుషుల కన్నా ఏఐ చాలా తెలివైనదిగా మారుతుంది : ఎలన్ మస్క్!