AI Software Engineer Devin : ప్రపంచంలోనే ఫస్ట్ ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ‘డెవిన్’ వచ్చేసింది.. సింగిల్ ప్రాంప్ట్‌తో క్షణాల్లో అన్నిపనులు చేసేస్తుంది!

AI Software Engineer Devin : ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ డెవిన్ కొత్త టూల్ వచ్చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటిది.. టెక్ కంపెనీ కాగ్నిషన్ ఈ డెవిన్‌ను రూపొందించింది. కేవలం సింగిల్ ప్రాంఫ్ట్‌తో కోడింగ్ రాసేయగలదు. కొత్త వెబ్‌సైట్ క్రియేట్ చేయగలదు.

AI Software Engineer Devin : ప్రపంచంలోనే ఫస్ట్ ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ‘డెవిన్’ వచ్చేసింది.. సింగిల్ ప్రాంప్ట్‌తో క్షణాల్లో అన్నిపనులు చేసేస్తుంది!

World’s first AI software engineer Devin announced, it can write, code, create using single prompt

AI Software Engineer Devin : ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతోంది. ఏఐ రేసులో పోటీపడేందుకు పలు టెక్ కంపెనీలు కొత్త టూల్స్ ప్రవేశపెడుతున్నాయి. లేటెస్టుగా ప్రముఖ టెక్ కంపెనీ కాగ్నిషన్ ప్రపంచంలోని మొట్టమొదటి ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ‘డెవిన్‌’ టూల్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఏఐ టూల్ హ్యుమన్ ఇంజనీర్‌లతో కలిసి పనిచేయడానికి కంపెనీ రూపొందించింది. కేవలం సింగిల్ ప్రాంప్ట్ ద్వారా వెబ్‌సైట్‌లు, సాఫ్ట్‌వేర్‌లను కోడింగ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

ఒకే ప్రాంప్ట్‌తో కోడింగ్, వెబ్‌సైట్‌లు, సాఫ్ట్‌వేర్‌లను క్రియేట్ చేయగలదు : 
ఈ కొత్త ఏఐ టూల్ చాలా స్మార్ట్‌గా పనిచేస్తుంది. కేవలం ఒకే ప్రాంప్ట్‌తో కోడ్‌ను రాసేయగలదు. వెబ్‌సైట్‌లను సాఫ్ట్‌వేర్‌లను సృష్టించగలదు. మీరు అడిగే ప్రతిదాన్ని చాలా చక్కగా పూర్తి చేయగలదు. మనుషులతో పనిలేదా? సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల స్థానంలో ఈ ఏఐ డెవిన్ వచ్చిందా? అంటే.. అసలు ఆ ఉద్దేశ్యమే లేదంటోంది కాగ్నిషన్ కంపెనీ. ఈ ఏఐ డెవిన్ కేవలం మనుషులతో కలిసి పని చేయడానికి రూపొందించినట్టు వెల్లడించింది. మనుషులకు బదులుగా పనిచేసేందుకు ఈ ఏఐ టూల్ తీసుకురాలేదని స్పష్టంచేసింది.

Read Also : Samsung Galaxy M15 5G : భారీ బ్యాటరీతో శాంసంగ్ గెలాక్సీ M15 5జీ కొత్త ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదానే..!

‘మొదటి ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ డెవిన్‌ని ప్రవేశపెట్టినందుకు సంతోషంగా ఉంది. బెంచ్ కోడింగ్ (SWE) బెంచ్‌మార్క్‌లో డెవిన్ టూల్ అత్యాధునికమైనది. ప్రముఖ ఏఐ కంపెనీల నుంచి ప్రాక్టికల్ ఇంజనీరింగ్ ఇంటర్వ్యూలను విజయవంతంగా పూర్తి చేసింది. (Upwork.Devin)లో రియల్ జాబ్స్, సొంత షెల్, కోడ్ ఎడిటర్, వెబ్ బ్రౌజర్‌ని ఉపయోగించి ఇంజినీరింగ్ పనులను పరిష్కరించే స్వయంప్రతిపత్త ఏజెంట్’ అని కాగ్నిషన్ ఎక్స్ వేదికగా పేర్కొంది.

ఏఐ డెవిన్‌ ప్రత్యేకత ఏమిటంటే..
డెవిన్ టూల్ స్సెషాలిటీ విషయానికి వస్తే.. ముందుగా ఆలోచించడం, సంక్లిష్టమైన పనులను ప్లాన్ చేయడంలో అద్భుతమైన సామర్థ్యం కలిగి ఉంది. ఒకేసమయంలో వేలాది నిర్ణయాలను తీసుకోగలదు. తప్పుల నుంచి నేర్చుకోగలదు. అదనంగా, మన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు అవసరమైన కోడ్ ఎడిటర్, బ్రౌజర్ వంటి అన్ని టూల్స్ డిజిటల్ చేతివేళ్లతోనే అందించగలదు.

ముఖ్యంగా, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ సమస్యలను పరీక్షించినప్పుడు ఇతర పరిష్కారాలతో పోలిస్తే.. బాగా పనిచేసింది. అగ్రశ్రేణి కృత్రిమ మేధస్సు కంపెనీలు నిర్వహించిన ప్రాక్టికల్ ఇంజనీరింగ్ ఇంటర్వ్యూలలో ఏఐ టూల్ అద్భుతంగా పనిచేసింది. ఈ ఇంటర్వ్యూలు ఏఐ, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ రంగానికి సంబంధించిన పనులు, సవాళ్లను కలిగి ఉంటాయి. ఏఐ అసిస్టెంట్ అంచనాలను కూడా అందుకుంది.

World’s first AI software engineer Devin announced, it can write, code, create using single prompt

AI software engineer Devin

సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో డెవిన్ గేమ్ ఛేంజర్ :
కానీ, డెవిన్ కేవలం సోలో యాక్ట్ కాదని చెప్పవచ్చు. హ్యుమన్ ఇంజనీర్‌లతో కలిసి పని చేయడానికి, రియల్ టైమ్ అప్‌డేట్స్ అందించడానికి, డిజైన్ ఆప్షన్ల కోసం రూపొందించారు. ఇంకా డెవిన్ ఏమి చేయగలడంటే.. కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడం, యాప్‌లను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రూపొందించడం, అమలు చేయడం లేదా కోడ్‌లో ఇబ్బందికరమైన బగ్‌లను గుర్తించడం, ఆపై పరిష్కరించడం వంటివి డెవిన్‌ పూర్తి చేయగలదు.

డెవిన్ కేవలం మాట్లాడటమే కాదు.. పాత ఏఐ మోడల్స్‌ను అధిగమించింది :
ఇందులోని సొంత ఏఐ మోడల్‌లకు ట్రైనింగ్ కూడా ఇవ్వగలదు. ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్‌లలో సమస్యలను పరిష్కరించగలదు. డెవిన్ కేవలం మాట్లాడడమే కాదు.. అద్భుతంగా అన్ని టాస్కులను పూర్తి చేయగలదు. రియల్-వరల్డ్ సవాళ్లపై పరీక్షించిన డెవిన్ గత ఏఐ మోడల్‌లను సైతం అధిగమించింది. గత ఏఐ మోడల్స్ పూర్తిచేసిన  కేవలం 2 శాతం కన్నా తక్కువ సమస్యలను దాదాపు 14 శాతం పరిష్కరించింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ప్రపంచంలో ఇది గేమ్ ఛేంజర్ అని చెప్పవచ్చు.

డెవిన్ ల్యాబ్ పరీక్షలకే పరిమితం కాలేదు. ఇప్పటికే అప్‌వర్క్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో పనిచేయగలదు. కంప్యూటర్ విజన్ మోడల్‌లను డీబగ్గింగ్ చేయడం నుంచి వివరణాత్మక రిపోర్టులను కంపైల్ చేయడం వరకు వాస్తవ-ప్రపంచ కోడింగ్ పనులను సులభంగా పరిష్కరించింది. ఏఐ టెక్నాలజీలో డెవిన్ మరో పురోగతిని సూచిస్తుంది. రొటీన్ టాస్క్‌లను ఆటోమేట్ చేయడం ద్వారా మరింత క్లిష్టమైన సమస్యలపై దృష్టి పెట్టడానికి ఇంజనీర్‌లను శక్తివంతం చేయగలదు. అంతేకాదు.. రాబోయే రోజుల్లో డెవిన్ ఏఐ టూల్.. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో ఆవిష్కరణలతో కొత్త శకానికి మార్గం సుగమం చేస్తుంది.

Read Also : iPhone 16 Pro Leak : కొత్త డిజైన్‌, క్యాప్చర్ బటన్‌‌తో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?