Samsung Galaxy M15 5G : భారీ బ్యాటరీతో శాంసంగ్ గెలాక్సీ M15 5జీ కొత్త ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదానే..!

Samsung Galaxy M15 5G : కొత్త ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ నుంచి సరికొత్త 5జీ ఫోన్ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ ధర, ఫీచర్ల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Samsung Galaxy M15 5G : భారీ బ్యాటరీతో శాంసంగ్ గెలాక్సీ M15 5జీ కొత్త ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదానే..!

Samsung Galaxy M15 5G With 50-Megapixel Rear Camera

Samsung Galaxy M15 5G Launch : శాంసంగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. గ్లోబల్ మార్కెట్లోకి సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి సరికొత్త 5జీ ఫోన్ వచ్చేసింది. ప్రత్యేకించి ఎంపిక చేసిన మార్కెట్లలో సైలంట్‌గా లాంచ్ చేసింది. ఈ కొత్త గెలాక్సీ ఎమ్-సిరీస్ ఫోన్ ఆక్టా-కోర్ చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, హెడ్‌లైన్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది.

Read Also : Vivo V30 Pro Series : కొత్త ఫోన్ కొంటున్నారా? అద్భుతమైన కెమెరాలతో వివో V30 సిరీస్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?

శాంసంగ్ గెలాక్సీ M15 5జీ ఫోన్ మొత్తం 3 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది. ఇందులో వాటర్-డ్రాప్-స్టయిల్ డిస్‌ప్లే డిజైన్‌ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.25డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ గెలాక్సీ 5జీ గత ఏడాది డిసెంబర్‌లో భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయిన గెలాక్సీ A15 5జీ ఫోన్‌కు రీబ్రాండెడ్ వెర్షన్ అని చెప్పవచ్చు.

భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ధర ఎంతంటే? :
శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ఫోన్ ధర వివరాలను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించలేదు. ఈ శాంసంగ్ 5జీ ఫోన్ గ్రే, డార్క్ బ్లూ, లైట్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. గత ఏడాదిలో లాంచ్ అయిన గెలాక్సీ ఎ15 ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజీ బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 19,499గా నిర్ణయించింది. అలాగే, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 22,499గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ఫోన్ ధర కూడా ఇదే రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో)కి సపోర్టు ఇస్తుంది. ఆండ్రాయిడ్ 13లో రన్ అవుతుంది. 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,080×2,340 పిక్సెల్‌లు) సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. గరిష్టంగా 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ బ్రైట్‌నెస్, విజన్ బూస్టర్‌ను అందిస్తుంది. హుడ్ కింద ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ను కూడా కలిగి ఉంది. 4జీబీ ర్యామ్, 128జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో పాటు మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ చిప్‌సెట్ కూడా అమర్చారు.

శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 5ఎంపీ సెకండరీ సెన్సార్, 2ఎంపీ షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో చాట్‌లకు 13ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీలోని కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, జీపీఎస్, గ్లోనాస్, బీడౌ, గెలీలియో, QZSS, వై-ఫై, 802.11ఎ/బీ/జీ/ఎన్/ఏసీ, బ్లూటూత్ 5.3, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, గైరో సెన్సార్, జియోమాగ్నెటిక్ సెన్సార్, లైట్ సెన్సార్, వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 21 గంటల వీడియో ప్లేబ్యాక్ టైమ్ :
అథెంటికేషన్ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. గెలాక్సీ ఎం15 5జీ ఫోన్ 25డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. శాంసంగ్ ఫోన్ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 21 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది. అంతేకాదు.. 128 గంటల వరకు ఆడియో ప్లేబ్యాక్ టైమ్ కూడా అందిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం 15 ఫోన్ పరిమాణం 160.1×76.8×9.3mm ఉండగా, హ్యాండ్‌సెట్ 217 బరువు ఉంటుంది.

Read Also : iPhone 16 Pro Leak : కొత్త డిజైన్‌, క్యాప్చర్ బటన్‌‌తో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?