Vivo V30 Pro Series : కొత్త ఫోన్ కొంటున్నారా? అద్భుతమైన కెమెరాలతో వివో V30 సిరీస్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?

Vivo V30 Pro Series : వివో నుంచి భారత మార్కెట్లోకి వివో V30 సిరీస్ ఫోన్లు వచ్చేశాయి. వివో V30, వివో V30 ప్రో మార్చి 7న భారత్‌‌లో లాంచ్ అయ్యాయి. ఈ రెండు భారతీయ వేరియంట్‌లు గ్లోబల్ కౌంటర్‌పార్ట్‌గా అదే ఫీచర్లతో వచ్చాయి.

Vivo V30 Pro Series : కొత్త ఫోన్ కొంటున్నారా? అద్భుతమైన కెమెరాలతో వివో V30 సిరీస్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?

Vivo V30, V30 Pro With 50-Megapixel Front Cameras Launched

Vivo V30 Pro Series : కొత్త ఫోన్ కొంటున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో నుంచి భారత మార్కెట్లోకి వివో V30 సిరీస్ ఫోన్లు వచ్చేశాయి. వివో V30, వివో V30 ప్రో మార్చి 7న భారత్‌‌లో లాంచ్ అయ్యాయి. ఈ రెండు ఫోన్‌లు ఇటీవల ఇండోనేషియాలో లాంచ్ కాగా.. భారతీయ వేరియంట్‌లు గ్లోబల్ కౌంటర్‌పార్ట్‌గా అదే ఫీచర్లతో వచ్చాయి.

Read Also : Realme 12 Series Launch : రియల్‌మి నుంచి రెండు సరికొత్త ఫోన్లు.. భారత్‌లో ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!

ఈ ఫోన్‌లలో 50ఎంపీ ఫ్రంట్ కెమెరాలు, 1.5కె కర్వ్డ్ డిస్‌ప్లేలతో వస్తాయి. 80డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తాయి. ఆండ్రాయిడ్ 14-ఆధారిత యూఐతో రన్ అవుతాయి. ఈ రెండు వివో V30 మోడల్‌లు ఈ నెలాఖరులో దేశంలో విక్రయానికి అందుబాటులోకి రానున్నాయి.

భారత్‌లో వివో వి30 సిరీస్ ధర ఎంతంటే? :
వివో వి30 ప్రో భారత మార్కెట్లో అండమాన్ బ్లూ, క్లాసిక్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ వివో ఫోన్ 8జీబీ + 256జీబీ ఆప్షన్ ప్రారంభ ధర రూ. 41,999 ఉంటుంది. అయితే, 12జీబీ+ 512జీబీ వేరియంట్ ధర రూ. 46,999 ఉంటుంది. వివో వి30 మోడల్ అండమాన్ బ్లూ, క్లాసిక్ బ్లాక్, అదనపు పీకాక్ గ్రీన్ షేడ్‌లో వస్తుంది. ఈ ఫోన్ మొత్తం 3 కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది.

అందులో 8జీబీ+ 128జీబీ రూ. 33,999, 8జీబీ+ 256జీబీ రూ. 35,999, 12జీబీ+ 512జీబీ రూ. 37,999 ధరకు పొందవచ్చు. వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ ఇండియా, ఇ-స్టోర్, ఇతర ఆఫ్‌లైన్ రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా మార్చి 14 నుంచి వివో V30 సిరీస్ ఫోన్‌లను కొనుగోలు చేయొచ్చు. ఈ కొత్త మోడల్స్ కోసం ప్రీ-బుకింగ్ మార్చి 7 నుంచి ప్రారంభమవుతుంది.

ఆన్‌లైన్ కస్టమర్‌లు ఎస్‌బీఐ లేదా హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్‌లపై ఫ్లాట్ 10 శాతం తగ్గింపు పొందవచ్చు. 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ పొందవచ్చు. అదనంగా రూ. 4,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. మెయిన్‌లైన్ స్టోర్‌ల నుంచి కొనుగోలు చేస్తే.. 10 శాతం ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, 8 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ, వివో వి-షీల్డ్ ప్లాన్‌పై 40 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.

వివో వి30 సిరీస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు 6.78-అంగుళాల కర్వడ్ 1.5కె (2,800 x 1,260 పిక్సెల్‌లు) అమోల్డ్ డిస్‌ప్లేలను 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 300హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2,800నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ స్థాయిని కలిగి ఉన్నాయి. బేస్ వివో వి30 స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 ఎస్ఓసీతో వస్తుంది. అయితే, వివో ప్రో మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లు గరిష్టంగా 12జీబీ ర్యామ్ 512జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌కు సపోర్ట్ చేస్తాయి. ఈ ఫోన్‌లు ఆండ్రాయిడ్ 14-ఆధారిత ఫన్‌టచ్‌ఓఎస్ 14తో కూడా పనిచేస్తాయి.

కెమెరా విషయానికి వస్తే.. వివో వి30 ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, ఆరా లైట్ ఫ్లాష్ యూనిట్‌, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో రెండో 50ఎంపీ సెన్సార్లతో వస్తుంది. అదనంగా 50ఎంపీ పోర్ట్రెయిట్ కెమెరాను కలిగి ఉంటుంది. రెండు మోడల్స్ 50ఎంపీ సెల్ఫీ కెమెరాను కలిగి ఉన్నాయి.

వివో యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌ల ద్వారా 80డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వివో వి30, వి30 ప్రో రెండింటిలోనూ 5,000ఎంఎహెచ్ బ్యాటరీలను అందిస్తుంది. సెక్యూరిటీ విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లలో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌లు ఉంటాయి. బేస్ వేరియంట్ బ్లూటూత్ 5.4కి సపోర్టు ఇస్తుంది. వివో ప్రో మోడల్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీని అందిస్తుంది.

Read Also : Indian Filter Coffee : ‘ప్రపంచంలో టాప్ 38 కాఫీలు’ జాబితాలో మన ‘ఫిల్టర్ కాఫీ’కి రెండో ర్యాంకు..!