Pfizer’s Covid Vaccine : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిని నివారించేందుకు వందలాది వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయి. ఇప్పటికే కొన్ని క్లినికల్, హ్యుమన్ ట్రయల్స్ దిశగా కొనసాగుతున్నాయి. పలు ఫార్మా కంపెనీలు తమ వ్యాక్సిన్ ట్రయల్స్ లో సానుకూల ఫలితాలు వచ్చినట్టు వెల్లడించాయి.
ఇందులో Pfizer, BioNTech అనేవి మొదటి డ్రగ్ మేకర్లుగా ముందు వరుసలో ఉన్నాయి. వాస్తవానికి Pfizer కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, సక్సెస్ వెనుక దంపతులతో కూడిన పరిశోధక బృందం విశేష కృషి ఉంది. దంపతులిద్దరూ కేన్సర్ ను నిరోధించే యాంటీబాడీల అభివృద్ధికి తమ జీవితాన్ని అంకితం చేశారు.
Pfizer రూపొందించిన ప్రయోగాత్మక వ్యాక్సిన్ కరోనాను నిరోధించడంలో 90శాతానికి పైగా సమర్థవంతంగా పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ రెండు సంస్థలు భారీ స్థాయిలో కరోనా వ్యాక్సిన్లపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాయి.
దీనికి సంబంధించి డేటాను కూడా వెల్లడించాయి. ఇప్పటివరకూ తమ వ్యాక్సిన్ ట్రయల్స్ లో ఎలాంటి హానికర దుష్ప్రభవాలను లేవని కంపెనీ చెబుతోంది. అంతేకాదు.. ఈ నెలాఖరులో వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఆమోదాన్ని కోరే అవకాశం ఉందని అభిప్రాయపడింది.
https://10tv.in/covid-vaccines-rolling-off-the-pfizer-production-line-in-thousands-of-tiny-bottles/
దంపతుల్లో ఒకరైన BioNTech చీఫ్ ఎగ్జిక్యూటివ్ Ugur Sahin (55), బోర్డు మెంబర్‌గా ఆయన భార్య Oezlem Tuereci (53) ప్రయోగాత్మక వ్యాక్సిన్ అభివృద్ధి కీలక పాత్ర పోషించారు.
వెంచర్ కేపటిల్ సంస్థ MIG AG బోర్డు సభులైన Matthias Kromayer 2008 నుంచి BioNTech సంస్థకు నిధులను అందించారు. చిన్నతనం నుంచే మెడిషిన్ అభివృద్ధిపై అనేక అధ్యయనాలు చేయడమే తన కలగా పేర్కొన్నారు.
కొలెగ్నెలో ఆస్పత్రుల్లోనూ పనిచేశాడు. తన విద్యాజీవితం కొనసాగుతున్న క్రమంలోనే సాహిన్‌కు Tuereciతో పరిచయం ఏర్పడింది. మెడికల్ రీసెర్చ్, అంకాలజీపై ఇద్దరికి ఆసక్తి ఉండేది. అదే వారిద్దరిని మరింత దగ్గర చేసింది.
జర్మీనికి వలసవెళ్లిన టర్కీ ఫిజిషియన్ కుమార్తె Tuereci.. ఒకరోజున ఇరువురు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరువురు కలిసి కేన్సర్ వ్యాధిపై వ్యాధినిరోధక వ్యవస్థను పెంచే యాంటీబాడీలను కనుగొనడంలో అనేక అధ్యయనాలు చేశారు.
2001లో పారిశ్రామికవేత్తలుగా తమ జీవితాన్ని ఆరంభించారు. Ganymed Pharmaceuticals కంపెనీని స్థాపించి కేన్సర్ నిరోధక యాంటీబాడీలను అభివృద్ధి చేశారు.
ఫిజపర్ కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో MIGకు చెందిన క్రోమేయర్, Tuereci, Sahin దంపతులు కలిసి డ్రీమ్ టీమ్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశారు. తాము అభివృద్ధి చేసిన యాంటీ కేన్సర్ mRNA డ్రగ్స్ నుంచి mRNA ఆధారిత వైరల్ వ్యాక్సిన్లను అభివృద్ధి చేశారు.