Breast Cancer Saliva Test : నోటి లాలాజలం చుక్క వేస్తే చాలు.. ఐదు సెకన్లలో బ్రెస్ట్ క్యాన్సర్‌ను పసిగట్టేస్తుందట..!

Breast Cancer Saliva Test : నోటి లాలాజలంతో ఐదు సెకన్లలోనే బ్రెస్ట్ క్యాన్సర్ పసిగట్ట గల అత్యాధునిక డివైజ్ రాబోతోంది. ఇప్పటికే ట్రయల్స్ ఫలితాలు విజయవంతంగా కాగా.. అతి త్వరలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

Breast Cancer Saliva Test : ప్రస్తుత రోజుల్లో రొమ్ము క్యాన్సర్ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను సరైన సమయంలో గుర్తించకపోవడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ఇలాంటివి ముందుగానే గుర్తించి అందుకు తగినవిధంగా చికిత్స తీసుకోవడం ద్వారా జీవితకాలాన్ని పొడిగించుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఇటీవల రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఆయా పరిశోధనల్లో ఫలితాలు కూడా ఆశజనకంగా కనిపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితమే రొమ్ము క్యాన్సర్‌ను రక్తం చుక్క ద్వారా నిర్ధారించే బయోమార్కర్లను హైదరాబాద్ సిసిఎంబి అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే.

Read Also : Health insurance: హెల్త్ ఇన్సురెన్స్ ఉందా? ఇకపై అన్ని ఆస్పత్రుల్లో పూర్తిగా ‘క్యాష్‌లెస్’ చికిత్స

ఐదు సెకన్లలోనే క్యాన్సర్ కణాలను గుర్తించగలదు :
అదే మాదిరిగా ముందస్తుగా రొమ్ము క్యాన్సర్ గుర్తించే కొత్త డివైజ్ అందుబాటులోకి రానుంది. ఈ డివైజ్‌పై చుక్క నోటి లాలాజలాన్ని వేయడం ద్వారా కేవలం ఐదు సెకన్ల వ్యవధిలోనే రొమ్ము క్యాన్సర్ నిర్ధారించవచ్చు. ఫ్లోరిడా యూనివర్శిటీ, తైవాన్‌లోని నేషనల్ యాంగ్ మింగ్ చియావో తుంగ్ యూనివర్శిటీ పరిశోధకులు ఈ హ్యాండ్‌హెల్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ డివైజ్ అభివృద్ధి చేశారు. ఈ పరిశోధనకు వివరాలను సంబంధించి జర్నల్ ఆఫ్ వాక్యూమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బీలో ప్రచురించారు. ఇందులోని బయోసెన్సర్ గ్లూకోజ్ టెస్టింగ్ స్ట్రిప్స్, ఆర్డునో ప్లాట్‌ఫారమ్ వంటి సాధారణ భాగాలను ఉపయోగిస్తుంది. రొమ్ము క్యాన్సర్ బయోమార్కర్లను (HER2, CA 15-3) చిన్న లాలాజల నమూనా నుంచి ఐదు సెకన్లలోపు గుర్తించగలదు.

ఈజీగా క్యారీ చేయొచ్చు.. ఎన్నిసార్లు అయినా వాడొచ్చు :
అరచేతి పరిమాణంలో ఉండే ఈ డివైజ్ పోర్టబుల్‌గా ఎక్కడికైనా తీసుకెళ్లేలా ఉంటుంది. అంతేకాదు.. ఈ డివైజ్ ఎన్నిసార్లు అయినా ఉపయోగించవచ్చు. పరీక్ష ఫలితాలను కూడా సమర్థవంతంగా అందిస్తుంది. HER2, CA 15-3 వంటి రొమ్ము క్యాన్సర్ కణాలు అభివృద్ధిచెందుతాయి. ఇలాంటి క్యాన్సర్ కణాలకు చికిత్స చేయడం చాలా కష్టం. సాంప్రదాయ రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పద్ధతులకు వనరులు లేని ప్రాంతాల్లో ఈ టెక్నాలజీ అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

డివైజ్ ధర కేవలం రూ. 415 మాత్రమే :
ఈ ప్రక్రియలో నిర్దిష్ట యాంటీబాడీస్‌తో చికిత్స చేసిన పేపర్ టెస్ట్ స్ట్రిప్‌లు టార్గెటెడ్ క్యాన్సర్ బయోమార్కర్‌లతో పరీక్షిస్తారు. అనంతరం ఫలితాలను ఈ డివైజ్ డిజిటల్‌గా అందిస్తుంది. ప్రస్తుతం ఉన్న మామోగ్రామ్‌లు, అల్ట్రాసౌండ్‌లు, ఎంఆర్ఐలు వంటి సాంప్రదాయ పద్ధతులతో పోలిస్తే.. బయోసెన్సర్ డిజైన్ చాలా విప్లవాత్మకమైనది. ఈ సంప్రదాయ పద్ధతులు ఖర్చుతో కూడుకున్నవి. ఇవి హానికరం మాత్రమే కాకుండా ప్రత్యేక డివైజ్‌లు కూడా అవసరమవుతాయి. పైగా రేడియేషన్‌ కూడా. తరచుగా ఇలాంటి పరీక్ష ఫలితాల కోసం సుదీర్ఘ సమయం వేచి ఉండాల్సి వస్తుంది. అయితే, ఈ హ్యాండ్‌హెల్డ్ బయోసెన్సర్ తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటుంది. టెస్ట్ స్ట్రిప్, రీయూజ్ సర్క్యూట్ బోర్డ్ ధర కేవలం 5 డాలర్లు (రూ. 415) మాత్రమే.

అతి త్వరలో మార్కెట్లోకి.. :
ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎంఆర్ఐ వంటి అధునాతన సాంకేతికతలు అందుబాటులో ఉండకపోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అదే.. బయోసెన్సర్‌కు కేవలం ఒక చుక్క లాలాజలం అవసరం పడుతుంది. ఒక మిల్లీలీటర్‌కు క్యాన్సర్ బయోమార్కర్ ఒక ఫెమ్‌టోగ్రామ్ మైనస్‌క్యూల్ గాఢతతో కూడా కచ్చితమైన ఫలితాలను అందిస్తుంది. ప్రస్తుతానికి ఈ డివైజ్ మార్కెట్లోకి అందుబాటులోకి రాలేదు. పూర్తిస్థాయిలో ట్రయల్స్ నిర్వహించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ డివైజ్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అదేగాని జరిగితే మరెంతో మంది బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధి బారి నుంచి తొందరగా బయటపడే అవకాశం ఉంటుంది.

Read Also : Kiwis Health Benefits : కివీస్ పండ్లను తీసుకోవడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలివే!

ట్రెండింగ్ వార్తలు