Health insurance: హెల్త్ ఇన్సురెన్స్ ఉందా? ఇకపై అన్ని ఆస్పత్రుల్లో పూర్తిగా ‘క్యాష్‌లెస్’ చికిత్స

మిగతా ఆస్పత్రుల్లో చేరితే ముందస్తుగా పేషెంట్లు బిల్లు మొత్తం చెల్లించి, ఆ తర్వాత బీమా కంపెనీ నుంచి క్లెయిమ్ చేసుకోవాల్సి వచ్చేది.

Health insurance: హెల్త్ ఇన్సురెన్స్ ఉందా? ఇకపై అన్ని ఆస్పత్రుల్లో పూర్తిగా ‘క్యాష్‌లెస్’ చికిత్స

health insurance policy

హెల్త్ ఇన్సురెన్స్ ఉన్నవారికి ది జనరల్ ఇన్స్యూరెన్స్ కౌన్సిల్ గుడ్‌న్యూస్ చెప్పింది. పాలసీదారులు ఇబ్బందులు ఎదురుకోకుండా అన్ని ఆస్పత్రుల్లో 100 శాతం నగదు రహితంగా చికిత్సలు అందించడానికి బీమా సంస్థలు అంగీకరించాయి. ఆయా సంస్థలకు భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ చేసిన ప్రతిపాదనలు చేసింది.

దీంతో బీమా సంస్థలు ఇందుకు ఒప్పుకున్నాయి. నిన్నటి నుంచే (జనవరి 25) భారత్‌ వ్యాప్తంగా ఈ నగదు రహిత సేవలు అందుబాటులో ఉంటాయని ఇప్పటికే ది జనరల్ ఇన్స్యూరెన్స్ కౌన్సిల్ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో హెల్త్ ఇన్సురెన్స్ ఉన్నవారు ఆసుపత్రిలో చేరితే వారి నుంచి ముందస్తు డబ్బు (బిల్) తీసుకోకుండానే ఆస్పత్రులు చికిత్స చేయాల్సి ఉంటుంది.

పేషెంటుకి ఇన్సురెన్స్ గరిష్ఠ పరిమితి ఎంత ఉందో అంతవరకు కంపెనీలే భరించాల్సి ఉంటుంది. ఆ పరిధి మించితే మిగతా మొత్తాన్ని ఇన్సురెన్స్ పాలసీదారుల నుంచి ఆస్పత్రులు వసూలు చేసుకోవచ్చు. మొన్నటి వరకు ఇటువంటి సౌకర్యాలు ఆయా బీమా సంస్థలో ఒప్పందం ఉన్న నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

మిగతా ఆస్పత్రుల్లో చేరితే ముందస్తుగా పేషెంట్లు బిల్లు మొత్తం చెల్లించి, ఆ తర్వాత బీమా కంపెనీ నుంచి క్లెయిమ్ చేసుకోవాల్సి వచ్చేది. ఈ ప్రక్రియలో పేషెంట్లకు ఇబ్బందులు ఎదురయ్యేవి. కొన్ని బీమా సంస్థలు తక్కువ మొత్తాన్ని ఇచ్చేవి. తాజాగా నిబంధనల ప్రకారం.. బీమా సంస్థలో ఒప్పందం ఉన్న నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో కాని ఆస్పత్రుల్లో నగదు రహిత చికిత్సలు చేయించుకోవాలనుకునేవారు.

ఆస్పత్రుల్లో చేరడానికి 48 గంటల ముందు బీమా సంస్థకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, ఒకవేళ ఎమర్జెన్సీ కేసులైతే ఆస్పత్రిలో చేరిన 48 గంటల్లో బీమా కంపెనీకి సమాచారం ఇవ్వాలి. బీమా ఉన్న వారు పొందే చికిత్సకు ఇన్సురెన్స్ వర్తిస్తేనే ఆస్పత్రుల్లో నగదురహిత సేవలు అందుతాయి.

బీమా సంస్థలో ఒప్పందం ఉన్న నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో అయినా సరే పేషెంట్ చేసుకున్న పాలసీ ప్రకారం అతడి/ఆమె చికిత్సకు ఇన్సురెన్స్ వర్తిస్తేనే నగదురహిత సేవలు పొందవచ్చు. పలు బీమా సంస్థలకు అనేక ప్రాంతాల్లో నెట్‌వర్క్ ఆస్పత్రులు లేవు. ఇప్పుడు ఆ బీమా కంపెనీ పరిధిలోకి వచ్చే నెట్‌వర్క్ ఆస్పత్రులు కాని ఆస్పత్రుల్లోనూ పేషెంట్లు నగదురహిత సేవలు పొందవచ్చు.

Viral Video : ఇదేం పిచ్చిరా బాబూ! సోషల్ మీడియాలో ఫేమస్ కావాల‌ని ఈ యువకుడు ఏం చేశాడో తెలుసా?