Colour blindness
Colour blindness : కొంతమందిలో నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్ని గుర్తించడంలో ఇబ్బంది ఎదురౌతుంది. కొందరు ఎటువంటి రంగుల్ని గుర్తించలేని సందర్భాలు కూడా ఉంటాయి. ఈ సిండ్రోమ్‌ను ‘వర్ణాంధత్వం’ (Colour blindness) అంటారు.
1798 లో జాన్ డాల్టన్ అనే రసాయన శాస్త్రవేత్త కలర్ బ్లైండ్ నెస్‌ను కనుగొన్నాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన కనుగొనే సమయంలో వర్ణాంధత్వంతో బాఢపడుతున్నాడట. తన స్వీయ అనుభవం ఆధారంగా వర్ణాంధత్వం గురించి వ్యాసం రాశాడు. కల్ బ్లైండ్ నెస్‌ను ‘డాల్టోనిజం’ అని కూడా పిలుస్తారు. దీనికి ఆవిష్కర్త జాన్ డాల్టో పేరునే పెట్టారు.
వర్ణాధత్వం రెండు రకాలుగా ఉంటుంది. మోనోక్రోమసీ.. ఇది రెండు లేదా మూడు కోన్ పిగ్మెంట్లు దెబ్బతిన్నప్పుడు ఈ సిండ్రోమ్ సంభవిస్తుందట. ఇది మొత్తం రంగుల్ని గుర్తించలేని పరిస్థితికి దారి తీస్తుందట. రెండవది డైక్రోమసీ.. పిగ్మెంట్లలో ఒకటి మాత్రమే దెబ్బ తిన్నప్పుడు ఈ సిండ్రోమ్ సంభవిస్తుందట. దీనివల్ల వర్ణాంధత్వం పాక్షికంగా ఉంటుందట. మన కంటి రెటీనా రాడ్, కోన్ అనే రెండు సెన్సెటివ్ కణాలను కలిగి ఉంటుంది. రాడ్ కణాలు తక్కువ కాంతి కోసం.. కోన్ కణాలు చాలా బ్రైట్‌గా ఉంటే కాంతి కోసం పనిచేస్తాయి. అయితే ఈ రెండు సెన్సెటివ్ కణాలు తమ పనులు నిర్వర్తించడంలో ఫెయిలైనపుడు కలర్ బ్లైండ్ నెస్ వస్తుందట.
Health with family : సోషల్ మీడియాతో కాదు.. ఫ్యామిలీతో సమయం గడపండి.. ఆరోగ్యంగా ఉండండి
ఇక వర్ణాంధత్వానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. కొన్ని జన్యుపరంగా ఉండటం.. మెదడు, లేదా కంటి నరాలకు సంబంధించిన కణాలు దెబ్బ తినడం, ఏదైనా ఔషధాలు వాడినపుడు అవి ఎఫెక్ట్ అవ్వడం, పొగాకు, మద్యం అలవాట్ల వల్ల కూడా కలర్ బ్లైండ్ నెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయట. దీని బారిన పడిన వారు కంటిని వేగంగా కదుపుతారు. ఎక్కువ వెలుగును చూడలేరు. బ్రైట్‌గా ఉండే రంగుల్ని చూడలేరు.. రంగుల్ని గుర్తించలేరు. ఈ వ్యాధి నిర్ధారణకు కొన్ని పరీక్షలు చేస్తారు. ‘ఇషిహరా ప్లేట్ టెస్ట్’ ద్వారా వైద్యులు వర్ణాంధత్వాన్ని చాలా సులభంగా గుర్తిస్తారట.
వర్ణాంధత్వానికి చికిత్స లేదు. రంగుల మధ్య తేడాను గుర్తించడానికి పోటోగ్రాఫిక్ ఫ్రేమ్‌లు, ఫిల్టర్లు, కాంటాక్ట్ లెన్స్‌లు, కళ్లద్దాలు కొంతవరకూ ఉపయోగపడతాయి. ఈ సిండ్రోమ్ బారిన పడే వారు నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఫ్రెష్‌గా ఉండే వెజిటబుల్స్, పండ్లు, పువ్వులు, పప్పులు వేరు చేయడం, కారు నడపడం, బట్టలు సెలక్ట్ చేసుకోవడం వంటి పనులు ఇలాంటి వారికి సమస్య అవుతాయి. ఇక ఈ సిండ్రోమ్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవడానికి సమతుల్య ఆహారాన్ని తినాలి.
Monsoon Tips : వర్షాకాలంలో పిల్లలు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండటానికి చిట్కాలు !