Diabetes Diet Tips : డయాబెటిస్‌తో బాధపడేవారు పండ్లను తీసుకోవచ్చా? ఒకవేళ తీసుకుంటే ఎంత మొత్తంలో తీసుకోవాలి? ఏయే పండ్లను తింటే షుగర్ లెవల్స్ పెరగకుండా నియంత్రించవచ్చు అనేవి చాలామందిలో సందేహాలు ఉంటాయి. కానీ, సాధారణంగా పండ్లు అత్యంత పోషక విలువలను కలిగి ఉంటాయి. బరువు తగ్గించడంలో పండ్లు కూడా అద్భుతంగా సాయపడతాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటాయి. సాధారణంగా రోజంతా సీజనల్ సమయంలో దొరికే పండ్లను ఎక్కువగా తీసుకోవాలని పోషక నిపుణులు సూచిస్తుంటారు. అందులో సేర్విన్గ్స్ పండ్లను ఎక్కువగా తినమని సలహా ఇస్తారు.
Read Also : Bone and Joint Health Tips : శీతాకాలంలో ఎముకలు, కీళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి
అయినప్పటికీ, మధుమేహం ఉన్నవారు తరచుగా పండ్లు తినడానికి భయపడతారు. ఎందుకంటే పండ్లలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. పండ్లు సహజ చక్కెరను కలిగి ఉంటాయి. కానీ అవసరమైన విటమిన్లు,ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. అందువల్ల, మధుమేహ వ్యాధిగ్రస్తులకు సమతుల్య ఆహారంలో ఫైబర్, అవసరమైన పోషకాలతో నిండిన తాజా పండ్లను తీసుకోవాలని చెబుతారు. మీరు కూడా డయాబెటిస్‌తో బాధపడుతున్న వారిలో ఒకరైతే పండ్లను తీసుకోవాలా? లేదా అని ఆలోచిస్తున్నట్లయితే ఈ ఆరోగ్య చిట్కాలు మీకోసమే.. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మధుమేహులు పండ్లు ఎలా తీసుకోవాలి? :
మధుమేహం ఉన్నవారు పండ్లను తినవచ్చు. కానీ, ఎలా తినాలి? ఎంత తినాలో గుర్తుంచుకోవాలి. తక్కువ జీఐ స్కోర్, అధిక ఫైబర్ కంటెంట్ ఉన్న పండ్లను ఎంచుకోవడం చాలా కీలకం. తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండాలి. అధిక ఫైబర్ కంటెంట్ ఉన్న పండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచవు. మీ ఆహారంలో పండ్లను చేర్చుకోవడం వల్ల చక్కెర స్థాయిలను కూడా నియంత్రించవచ్చు. చక్కెర కలిగిన ఆహారాలను తీసుకునే బదులు పండ్లను తీసుకున్నా తక్కువ పరిమాణంలో ఉండాలని గుర్తుంచుకోవాలి. మీరు పండ్లను తీసుకునే ముందు మీ వైద్యనిపుణుడుని సంప్రదించండి. ప్రస్తుత మీ ఆరోగ్య స్థితికి అనుగుణంగా ఎంత పరిమాణంలో పండ్లను తీసుకోవాలని సలహాలు, సూచనలు తీసుకోవచ్చు.
తినకుండా నివారించాల్సిన పండ్లు ఇవే :
అన్ని పండ్లు, పండ్ల రూపాలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు తగినవి కావని గమనించడం ముఖ్యం. చక్కెర శాతం ఎక్కువ, జీఐ (గ్లైసమిక్ ఇండెక్స్) స్కోర్ ఎక్కువగా ఉన్నవి, పీచు పదార్థాలు తక్కువగా ఉండే పండ్లకు వీలైనంత దూరంగా ఉండాలి. అందులో కొన్ని ఈ కింది విధంగా ఉన్నాయి.
- అతిగా పండిన అరటి
- అనాస పండు
- మామిడి
- పుచ్చకాయ
- ద్రాక్ష
- ఎండుద్రాక్ష, ఆప్రికాట్లు, పండ్ల రసాలు వంటి డ్రై ఫ్రూట్‌లను నివారించండి.
- తినదగిన పండ్లలో ఆపిల్, సిట్రస్ పండ్లు, బేరి, బెర్రీలు, చెర్రీస్ కివి పండ్లు ఆరోగ్యకరమైనవి.
పండ్లను తినేటప్పుడు పాటించాల్సిన మరికొన్ని చిట్కాలు :
- తాజాగా ఉండే సీజన్‌లో దొరికే పండ్లను ఎంచుకోండి.
- ఫ్రిజ్‌లో స్టోర్ చేసినా లేదా జ్యూస్ తీసిన పండ్లకు దూరంగా ఉండండి.
- పోషక పదార్ధాలను నిలుపుకోవటానికి పండ్లను కత్తిరించి స్టోర్ చేయవద్దు
- తినే ముందు పండ్ల గ్లైసెమిక్ ఇండెక్స్ ఎలా ఉందో చెక్ చేయండి
- అతిగా పండ్లను తీసుకోవద్దు.
- బాగా పండినవి కాకుండా కొద్దిగా పచ్చి పండ్లను తీసుకోవచ్చు.
Read Also : Kiwis Health Benefits : కివీస్ పండ్లను తీసుకోవడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలివే!