Bone and Joint Health Tips : శీతాకాలంలో ఎముకలు, కీళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి

శీతాకాలంలో ఎముకలు, కీళ్ల నొప్పులు మొదలవుతాయి. ఈ సమయంలో తగిన వ్యాయామం లేకపోతే ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. ఈ సమస్య నుండి బయటపడాలంటే కొన్ని పాటించాలి.

Bone and Joint Health Tips : శీతాకాలంలో ఎముకలు, కీళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి

Bone and Joint Health Tips

Bone and Joint Health Tips : చలికాలం అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మరింత ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా ఎముకలు, కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. చల్లని వాతావరణంలో కండరాలు, కీళ్లు బిగుసుకుపోతుంటాయి. ఈ సీజన్‌లో ఈ సమస్యను అధిగమించాలంటే తగిన వ్యాయామంతో పాటు పోషకాహారం అవసరం.

Healthy Lifestyle in Winter : వింటర్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ బ్రేక్ చేయాల్సిందే !

ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం ఖచ్చితంగా అవసరం. రోజులో కనీసం 30 నిముషాలు వ్యాయామం చేయాలి. రన్నింగ్, వాకింగ్, జాగింగ్, డ్యాన్స్ , మెట్లు ఎక్కడం వీటిలో ఏదో ఒకటి లక్ష్యంగా పెట్టుకుని వ్యాయామం చేయాలి. కొందరికి బరువులు మోయడం ఇబ్బందికరంగా ఉంటే స్విమ్మింగ్, వాటర్ ఏరోబిక్స్ వంటికి కూడా ఉపయోగకరంగా ఉంటాయి. చలికి తట్టుకోలేని వారు ఇంట్లోనే యోగా, డ్యాన్స్ వంటి ఇండోర్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయవచ్చు.

ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే తినే ఆహారంలో ఖచ్చితంగా కాల్షియం, విటమిన్ డి ఉండేలా చూసుకోవాలి. కాల్ఫియం ఎక్కువగా ఉండే పాలు, ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ డి కోసం ఖచ్చితంగా రోజులో కొద్దిసేపైనా ఎండలో గడపాలి. ఈ సీజన్‌లో విటమిన్ డి సప్లిమెంట్ ఖచ్చితంగా అవసరం. ఎముకల ఆరోగ్యానికి పండ్లు, కూరగాయలు, గింజలు తీసుకోవాలి. వీటిలో మెగ్నీషియం, విటమిన్ కె, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.

Health Benefits of Okra : గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కూరగాయ ఒక్కటి చాలు !

ఎముకలు, లేదా కీళ్లలో నొప్పి ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకూడదు. అలాంటి సమయంలో ఒత్తిడితో వ్యాయామం చేయకూడదు. తగిన విశ్రాంతి తీసుకుని వ్యాయామం కొనసాగించాలి. బోలు ఎముకల వ్యాధి లేదా ఇతర ఎముకలకు సంబంధించిన సమస్యలు వంశపారం పర్యంగా ఉంటే ఖచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించాలి.  ఈ వ్యాధి స్త్రీలలో 65, పురుషులలో 70 ఏళ్లు పైబడిన వారిలో బయటపడుతుంది. ఇలా ఎముకలు, కీళ్ల ఆరోగ్యం విషయంలో ఈ చిట్కాలు పాటిస్తే శీతాకాలంలో కూడా ఆరోగ్యంగా ఉండచ్చు.