Health Benefits of Okra : గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కూరగాయ ఒక్కటి చాలు !

బెండకాయలో ఫాలీఫెనాల్స్‌ అధికంగా ఉంటాయి. వీటిలోని యాంటీఆక్సిడెంట్‌ గుణాలు రక్తపోటు, కొలెస్ట్రాల్‌, వాపు ప్రక్రియ తగ్గటానికి సహాయపడతాయి. రక్తంలో గ్లూకోజు మోతాదులు స్థిరంగా ఉండేందుకు బెండ తోడ్పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.

Health Benefits of Okra : గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కూరగాయ ఒక్కటి చాలు !

Health Benefits of Okra

Health Benefits of Okra : బెండకాయ దీనినే లేడీస్ ఫింగర్ గా పిలుస్తారు. సహజంగా బెండ రెండు రంగులలో అందుబాటులో ఉంటుంది. ఒకటి ఎరుపు, రెండోది ఆకుపచ్చ వర్ణం. ఈ రెండు రకాలు ఒకే రకమైన రుచిని కలిగి ఉంటాయి. ఎరుపు రంగులో ఉన్న బెండను వండినప్పుడు ఆకుపచ్చగా మారుతుంది. బెండ సాధారణంగా వంటలో కూరగాయల ఉపయోగిస్తున్నారు.

READ ALSO : Happy Diwali 2023 Wishes : వాట్సాప్‌లో దీపావళి కస్టమ్ స్టిక్కర్లు క్రియేట్ చేసి ఎలా పంపాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్!

బెండలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అనుకునే వారికి ఆహారంలో బెండకాయను చేర్చుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. బెండ తినటం వల్ల కొలెస్ట్రాల్‌ తగ్గటానికి తోడ్పడుతుంది. ఇదే విషయం జంతువులపై చేసిన పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అదే సమయంలో మనుషుల్లోనూ బెండకాయ ఇటువంటి ప్రభావమే చూపుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రాథమిక ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి.

READ ALSO : Anand Mahindra : ఆనంద్ మహీంద్రాకి నోరూరించిన బ్రేక్ ఫాస్ట్ మెనూ.. అందులో ఏమున్నాయంటే?

బెండకాయలో ఫాలీఫెనాల్స్‌ అధికంగా ఉంటాయి. వీటిలోని యాంటీఆక్సిడెంట్‌ గుణాలు రక్తపోటు, కొలెస్ట్రాల్‌, వాపు ప్రక్రియ తగ్గటానికి సహాయపడతాయి. రక్తంలో గ్లూకోజు మోతాదులు స్థిరంగా ఉండేందుకు బెండ తోడ్పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. రక్తంలో గ్లూకోజు త్వరగా కలవకుండా చేస్తుంది. దీనిలో ఉండే పీచూ పరోక్షంగా గుండెకు మేలు చేస్తుంది.

READ ALSO : Pumpkin Health Benefits : రక్తంలో చక్కెరస్ధాయిలను నియంత్రించటంలో సూపర్ ఫుడ్ గా.. గుమ్మడికాయ !

బెండలో విటమిన్లు C, K1 కు అద్భుతమైన మూలం. విటమిన్ సి అనేది నీటిలో కరిగే పోషకం. ఇది రోగనిరోధక పనితీరుకు దోహదపడుతుంది. అయితే విటమిన్ K1 అనేది కొవ్వులో కరిగే విటమిన్. ఇది రక్తం గడ్డకట్టడంలో ప్రసిద్ధి చెందింది. బెండ లో కేలరీలు . పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. కొంత ప్రోటీన్, ఫైబర్ ఉంటాయి. తగినంత ప్రోటీన్ తినడం బరువు నిర్వహణ, రక్తంలో చక్కెర నియంత్రణ, ఎముక నిర్మాణం , కండర ద్రవ్యరాశి కోసం బెండను తీసుకోవటం వల్ల ప్రయోజనాలు పొందవచ్చు.