high blood pressure
High Blood Pressure : అధిక శాతం మందిని అనారోగ్యంపాలు చేస్తున్న సమస్యల్లో హైబీపీ ఒకటి. హై బ్లడ్ ప్రెజర్‌ను వైద్య పరిభాషలో హైపర్‌టెన్షన్ అని కూడా అంటారు. గుండె సంబంధ వ్యాధులకు హై బ్లడ్ ప్రెజర్ కూడా కారణమవుతుంది. రక్తపోటు రావటానికి అనేక కారణాలు ఉంటాయి. సాధారణంగా బ్లడ్ ప్రెజర్ 120/80 mg Hg కంటే దిగువన ఉంటే దాన్ని నార్మల్‌గా పరిగణిస్తారు. దాని కంటే ఎక్కువ ఉంటే అది హై బ్లడ్ ప్రెజర్‌కు సంకేతం. హై బ్లడ్ ప్రెజర్ అనేది ఒక సైలెంట్ కిల్లర్‌గా చెప్పవచ్చు.
రక్తనాళాల గోడలపై రక్తం తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంటుంది. ఈ పరిణామాన్నే హైబీపీగా చెప్పవచ్చు. రక్తపోటును ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా గుండె జబ్బులు, స్ట్రోక్స్ కు దారితీసే అవకాశాలు హెచ్చుగా ఉంటాయి. కొన్ని లక్షణాల ద్వారా రక్తపోటు కలిగిఉన్నట్లు గుర్తించవచ్చు. అయితే కొందరు గుర్తించటానికి ఎలాంటి లక్షణాలు కనిపించవు. లక్షణాలు కనిపించిన వెంటనే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా చికిత్స పొందితే సమస్యను అదుపులో ఉంచవచ్చు.
హైబీపి సమస్య ఉందని తెలిపే కొన్ని లక్షణాలకు సంబంధించి ;
హైబీపీ ఉన్నవారిలో కంగారు, ఆందోళన, అలసట, నిద్రలేమి సమస్యలు కనిపిస్తాయి ఈ లక్షణాలు ఉంటే హైబీపీగా అనుమానించాలి. మైకం కమ్మినట్లు , మత్తుగా ఉంటారు. నిద్ర బాగా పోయినా సరే. మత్తుగా ఉంటే హైబీపీగా అనుమానించాలి. ఛాతిలో నొప్పి వస్తుంటే దాన్ని హైబీపీగా అనుమానించాలి. హైపీబీ ఉంటే ముఖమంతా కొన్ని సార్లు ఉబ్బినట్లు కనిపిస్తుంది. ముఖం ఎర్రగా మారుతుంది. ముఖంలో ఉండే రక్తనాళాలు వెడల్పుగా మారి రక్తం ఎక్కువగా ప్రసరిస్తుంది. దీంతో ముఖం ఎర్రగా కనిపిస్తుంది.
హైబీపీ మరీ ఎక్కువైతే కొందరికి మూర్ఛ కూడా వస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కూడా వస్తాయి. కడుపులో వికారంగా అనిపిస్తుంది. మూత్రం తక్కువగా వస్తుంది. చేతులు, పాదాలు, ఇతర భాగాల్లో స్పర్శ కోల్పోయి మొద్దు బారినట్లు అనిపిస్తుంది. కొన్ని సార్లు బీపీ అధికమై ముక్కులోంచి రక్తం పడుతుంది. తలనొప్పి తీవ్రంగా ఉంటుంది.
అయితే కొందరిలో హైబీపికి సంబంధించి నిర్ధిష్టమైన లక్షణాలు ఏమి ఉండవు. సరైన పద్ధతుల్లో పరీక్షిస్తే తప్ప హై బీపీని గుర్తించటం సాధ్యం కాదు. శారీరక శ్రమ ద్వారా బ్లడ్ ప్రెజర్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. ఆరోగ్యకరమైన బరువు కలిగి ఉండటం బ్లడ్ ప్రెజర్ లెవల్స్ తగ్గించడంతో పాటు గుండె వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది.