Obesity Problem : బొజ్జ సమస్య బాధిస్తుందా? తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉంటే ఈ చిట్కాలు పాటించటం మేలు!
బరువు తగ్గాలి అనగానే ఆహారము తీసుకోవడము మానేస్తారు. దీని వల్ల పొట్టతగ్గటం సంగతి పక్కన పెట్టి పలు అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. లావు తగ్గాలన్నా , పొట్ట కరగాలన్నా మూడు పూటలా ఆహారము తీసుకోవాలి.
obesity problem
Obesity Problem : జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, శారీరక శ్రమలేకపోవటం తదితర కారణాల వల్ల చాలా మంది బానపొట్టలతో ఇబ్బందిపడుతున్నారు. మహిళలతోపాటు, పురుషులలో ఈ బొజ్జ పెరుగుదల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. బొజ్జాలో పేరుకున్న అధిక కొవ్వు వల్ల కలిగే అనేక అనర్ధాలు కలుగుతుండటం వారిని ఆందోళనకు గురిచేస్తుంది. బొజ్జ మూలంగా గుండె జబ్బులు, రొమ్ము క్యాన్సర్, మధుమేహం, జీవక్రియల అస్తవ్యస్తం, పిత్తాశయ సమస్యలు, అధిక రక్తపోటు, పెద్దపేగు క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
బొజ్జతో బాధపడుతున్న వారు పాటించాల్సిన చిట్కాలు :
అల్పా హారము తప్పనిసరి : ప్రతి రోజూ ఉదయము అల్పాహారము తప్పనిసరిగా తీసుకోవాలి. ఉదయము ఆహారం తీసుకోక పోవటం వల్ల సాయంత్రవరకు శరీరానికి కావాల్సిన శక్తి అందకుండా పోతుంది. ఉదయం అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవటం వల్ల శరీరము బరువు , ఆకృతి అదుపులో ఉంటాయి.
తినే ఆహారంలో ఉప్పు తగ్గించాలి : రోజువారిగా తీసుకునే ఆహారాల్లో ఉప్పు తక్కువగా తీసుకునే వారు అధిక బరువు సమస్యకు లోనుకారు. ఉప్పు అధికంగా తీసుకునే వారు అధిక బరువు సమస్యతో బాధపడుతుంటారు. ఉప్పుకు శరీరములో నీటిని , కొవ్వును నిల్వ చేసే గుణము ఉంటుంది. దీని పలితం గా బరువు పెరుగుతారు. రోజుకు 6 గ్రాములకు మించి ఉప్పు వాడకుండా ఉంటే పొట్ట తగ్గుతుంది.
మూడు పూటలా ఆహారం : బరువు తగ్గాలి అనగానే ఆహారము తీసుకోవడము మానేస్తారు. దీని వల్ల పొట్టతగ్గటం సంగతి పక్కన పెట్టి పలు అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. లావు తగ్గాలన్నా , పొట్ట కరగాలన్నా మూడు పూటలా ఆహారము తీసుకోవాలి. తినే ఆహారము విషయములో జాగ్రత్తలు పాటించాలి. శరీరానికి అవసరమైన పోషక పదార్ధాలు సమపాళ్ళలో లభించేలా ఆహారము తీసుకోవాలి. పరిమితమైన ఆహారము తీసుకోవాలి.
నిత్య వ్యాయామాలు : నడక, పరుగు వంటి వ్యాయామాలు రోజు వారిగా కొనసాగించాలి. రోజుకు 3 కిలో మీటర్లు నడవటం వల్ల మంచి ఫ్రయోజనం ఉంటుంది. ఎముకలు బలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి నడక వల్ల మేలు కలుగుతుంది. కొవ్వు కరిగేందుకు దోహదపడుతుంది .
వేపుళ్ళ వంటి నూనె పదార్ధాలకు దూరం : రుచికి బాగుంటాయని ఎక్కువమంది వేపుడు కూరలు తింటారు. అయితే ఆరోగ్యరీత్యా వేపుడు కూరలు మంచివి కావు. ఉడికించిన కూరలు తినటం ఉత్తమం. కాబట్టి కూరగాయలను ఉడికించి తర్వాత కొద్దిగా వేయించి తినడం ద్వారా రుచి, ఆరోగ్యము రెండూ లభిస్తాయి.
సాయంకాల సమయంలో పస్తులు ఉండటం మంచిది కాదు : బరువు తగ్గాలన్న కోరికతో చాలా మంది సాయంత్రం సమయంలో తిండి మానేస్తుంటారు. అయితే సాయంకాలము ఏదో ఒకటి తినాలి . ఆకలి తో ఉండకూడదు. ఎండిన పళ్ళు, కొవ్వులేని ఆహారపదార్ధములు, తాజా పండ్లు తినాలి.
రోజు మొత్తంలో నీరు బాగా త్రాగాలి : నీరు మన దాహానికి తగ్గట్టుగా తాగుతూ ఉండాలి. నీరు తాగడము వలన ఆహారము తీసుకోవడము తగ్గుతుంది. జీవ పక్రియ మెరుగవుతుంది. నీరు
శరీరానికి చాలా అవసరము .
ఒత్తిడికి దూరంగా ఉండటం ; నిరంతరం టెన్సన్ మంచిది కాదు. ఒత్తిడితో ఉన్నవారు ఆహారము అధికంగా తీసుకుంటారు. దీని వల్ల హార్మోనులు సమతుల్యము తప్పుతాయి. సరియైన సమయానికి అవసరమైన పని చేస్తూ మిగతా సమయాల్లో విశ్రాంతి తీసుకోవాలి.
బొజ్జ సమస్యతో బాధపడుతున్నవారు జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోని పై సూచనలు పాటించటం ద్వారా దాని నుండి సులభంగా బయటపడవచ్చు.
