కరోనా దెబ్బకు కండోమ్స్ కొరత.. ఎగబడి కొనేశారు.. ఎక్కడా దొరకడం లేదట! గ్లోబల్ సార్టేజ్..

  • Publish Date - March 28, 2020 / 10:38 AM IST

కరోనా మహమ్మారి దెబ్బకు కండోమ్స్ కొరత వచ్చి పడింది. గ్లోబల్ స్టారేజీతో కండోమ్స్ దొరక కంజ్యూమర్లు తెగ ఇబ్బంది పడిపోతున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధిస్తున్నాయి. దాంతో ఇంట్లోనే ఐసోలేషన్ ఉండాల్సిన పరిస్థితి.

ఇంకేముంది.. ఎప్పుడు బిజీగా ఉండేవారందరికి కావాల్సినంత సమయం దొరికింది. ఒకవైపు కరోనా టెన్షన్.. ఈ టెన్షన్ నుంచి బయటపడాలంటే కాస్తాంత ఉత్తేజం ఉండాలి.. అందుకే చాలామంది రొమాన్స్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారంట. అందుకే మార్కెట్లో కండోమ్స్ కొనేస్తుండటంతో కొరత ఏర్పడింది.

ఆన్ లైన్లో కొందరు.. ఆఫ్ లైన్లో మరికొందరు ఇలా వరుసగా కండోమ్స్ కొనేయడంతో ఎక్కడా కూడా దొరకుండా పోయాయి. మరోవైపు కరోనా ప్రభావంతో కండోమ్స్ తయారీ కంపెనీలు కూడా మూతపడ్డాయి. కరోనా కారణంగా పదివేల సంఖ్యలో వ్యాపారం నిలిచిపోయింది.

కండోమ్ తయారీ ఫ్యాక్టరీలు మూతపడటంతో కండోమ్స్ స్టాక్ అయిపోయింది. మార్కెట్లో ఉన్న కండోమ్స్ అన్ని అమ్ముడుపోయాయి. కండోమ్స్ దొరికే పరిస్థితి లేదని వాపోతున్నారు.. ఇప్పటివరకూ తినడానికి పాస్తా లేదని బాధ ఉండేది.. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నా రొమాన్స్ (ఫ్యామిలీ ప్లానింగ్ ఉన్న వారికి)చేసే పరిస్థితి లేదు. 

గతవారంగా ప్రపంచంలోనే అతిపెద్ద కండోమ్ తయారీ సంస్థ Durex, మలేసియా కంపెనీ Karex Bhd గ్లోబల్ గా ప్రతి ఐదు కండోమ్స్ లో ఒకటి తయారు చేస్తోంది. కరోనా వ్యాప్తితో ప్రభుత్వం ఆదేశాల మేరకు వారానికి పైగా లాక్ డౌన్ విధించారు. దాంతో Karex Bhd మూడు ఫ్యాక్టరీలు కూడా మూతపడ్డాయి. దీని ప్రభావంతో కనీసం సింగిల్ కండోమ్ కూడా ఈ మూడు ఫ్యాక్టరీల నుంచి తయారు చేయలేని పరిస్థితి నెలకొంది.

ఇదివరకే 100 మిలియన్లకు పైగా కండోమ్స్ కొరత ఏర్పడింది. సాధారణంగా అంతర్జాతీయంగా మార్కెట్లో లభ్యమయ్యే కండోమ్స్ బ్రాండ్లలో Durex, రాష్ట్ర హెల్త్ కేర్ సిస్టమ్స్ లైన బ్రిటన్ NHS లేదా UN పాప్యులేషన్ ఫండ్ లాంటి సహాయ కార్యక్రమాలకు కండోమ్స్ సరఫరా చేస్తుంటుంది.

Covid-19 వైరస్ వ్యాప్తి రేటు వేగంగా విస్తరిస్తున్న తరుణంలో మలేసియాలో సౌత్ ఈస్ట్ ఏసియాలో 2,161 కేసులు నమోదు కాగా, ఇప్పటివరకూ 26 మంది మరణించారు. యూకేలో కూడా ప్రభుత్వం ఇదే స్థాయిలో లాక్ డౌన్ విధించింది. కానీ, కొన్ని చోట్ల కండోమ్స్ చెలామణీలో ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ మీకు స్థానిక ఫార్మసీ లేదా సూపర్ మార్కెట్లలో రోగనిరోధక ప్యాకెట్ గుర్తించినప్పటికీ ఇప్పుడు ఆ పరిస్థితి మారేలా కనిపిస్తోంది. ప్రపంచంలో ఇప్పటికే 100 మిలియన్లకు పైగా కండోమ్స్ కొరత ఏర్పడింది.

అయినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికో పరిష్కారం దొరికింది అంటున్నారు నిపుణులు.. Karex Bhd కంపెనీకి అధికారుల నుంచి అనుమతి లభించింది. ఈ శుక్రవారం నుంచే కీలకమైన కండోమ్ ఇండస్ట్రీలకు ప్రత్యేక మినహాయింపు లభించింది. కానీ, సాధారణం కంటే తక్కువ స్థాయిలో 50 శాతం మాత్రమే కండోమ్స్ తయారీ ఉండే పరిస్థితి కనిపిస్తోంది. అయినప్పటికీ ఇదొక సానుకూలమైన అంశంగా చెప్పవచ్చు.

ప్రస్తుత డిమాండ్ కు తగినట్టుగా కండోమ్స్ తయారు చేయాలంటే ఫ్యాక్టరీలకు మరింత సామర్థ్యంతో పాటు సమయం అవసరం ఉంటుందని చీఫ్ ఎగ్జిక్యూటీవ్ Goh Miah Kiat రాయిటర్స్ కు తెలిపారు. ప్రతిచోట కండోమ్స్ గ్లోబల్ సార్టేజీని చూస్తున్నామని ఆయన అన్నారు. ఈ సార్టేజీ కేవలం రెండు వారాలు లేదా నెల పాటు ఉండేది కాదన్నారు.ఇది మరిన్ని నెలల పాటు కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. భారతదేశంలో కరోనా లాక్ డౌన్ ఏప్రిల్ 14 వరకు కొనసాగనుంది. దేశంలో కరోనా వ్యాప్తి మరింత తీవ్రమైతే ఈ లాక్ డౌన్ మరింత పొడిగించే అవకాశం లేకపోలేదు.

చైనా కూడా కండోమ్స్ తయారీలో ప్రధానమైనది కూడా. అక్కడ కూడా కండోమ్స్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఆ తర్వాతే భారత్, థాయిలాండ్ దేశాల్లో మూతపడ్డాయి. కండోమ్స్ కు ఇంత స్థాయిలో డిమాండ్ ఉండటం కూడా మంచిదే అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఫ్యామిలీ ప్లానింగ్ అనుకునేవారు ఎవరైనా కండోమ్స్ లేకుండా రొమాన్స్ చేయకపోవడమే మంచిది అంటున్నారు సెక్సాలిజిస్టులు.. మరి.. రొమాన్స్ చేయకుండా ఉండేదెలా అంటే.. ఎల్లప్పుడూ హస్తప్రయోగం చేసుకోవడమే చాలా మంచి పని అంటున్నారు.