Energy Drinks to Drink During Exercise for Overall Health
Energy Drinks: మన శరీరానికి రోజంతా చేసే పనులకోసం ఆహరం అవసరం. అందులోనే ఉదయం తీసుకునే ఆహరం మన శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి, ఉదయం తీసుకునే ఆహరం చాలా ప్రదానం. అందులోనే పరగడుపున తీసుకునే ఆహరం, పానీయాలి శరీరాన్ని డిటాక్స్ చేయడంలో, మానసిక ఉత్తేజం ఇచ్చే శక్తిని అందించడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా, మెదడు కార్యకలాపాలను కూడా ఉత్సాహపరుస్తాయి. కాబట్టి, రోజంతా ఉల్లాసంగా, శక్తివంతంగా ఉండేందుకు పరగడుపున తీసుకోవాల్సిన కొన్ని పానీయాల(Energy Drinks) గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Cumin Water Benefits: కీళ్ల నొప్పుల ఖేల్ ఖతం.. ఈ రసం చేసే మాయాజాలం.. లేచి పరిగెడతారు చూడు
1.గోధుమ గింజల నీరు:
1 టీస్పూన్ గోధుమ గింజల పొడిని 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో కలపాలి పరగడుపున తాగాలి. దీని వల్ల శరీరం డిటాక్స్ అవుతుంది. హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది.
2.నిమ్మకాయ, తేనె నీరు:
1 గ్లాసు గోరువెచ్చని నీటిలో ½ నిమ్మకాయ రసం, 1 టీస్పూన్ తేనె కలపాలి పరగడుపున తాగాలి. ఇలా తాగటం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది. కొవ్వు కరిగిపోతుంది. చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. మానసిక ఉత్సాహం పెరుగుతుంది.
3.అల్లం, తులసి నీరు:
కొన్ని తులసి ఆకులు, ½ టీస్పూన్ తురిమిన అల్లం 1 గ్లాసు నీటిలో మరిగించి తాగాలి. ఈ డ్రింక్ పరగడుపున తాగడం వల్ల ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. ఒత్తిడి తగ్గి మంచి నిద్ర పడుతుంది.
4.జీలకర్ర నీరు:
1 టీస్పూన్ జీలకర్రను రాత్రి నీటిలో నానబెట్టి, ఉదయం ఆ నీటిని మరిగించి కాస్త చల్లార్చి పరగడుపున తాగాలి. ఈ నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. శరీర తడులను సమతుల్యం చేస్తుంది. మానసిక అలసటను తగ్గిస్తుంది. శక్తిని ఇస్తుంది.
5.ఆలవనికాయ, తేనె నీరు:
1 టీస్పూన్ ఆమ్లా జ్యూస్‌కి 1 టీస్పూన్ తేనె, ½ గ్లాసు నీరు కలిపి పరగడుపున తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి విటమిన్ C అధికంగా లభిస్తుంది. జీర్ణశక్తి మెరుగవుతుంది. మెదడు పనితీరు పెరుగుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది.
ముఖ్యమైన సూచనలు: