Eye Health: Watery eyes are the cause of this health problem.
Eye Health: మానవ శరీరంలో కళ్ల ప్రత్యేకత గురించి వివరంగా చెప్పాల్సిన పనిలేదు. మన పెద్దలు కూడా అదే మాట చెప్పారు సర్వేంద్రియానామ్ నయనం ప్రధానం అని. అందుకే, కళ్ళ ఆరోగ్యం అనేది చాలా అవసరం. కానీ, ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కంటి సమస్య(Eye Health)లతో బాధపడుతున్నారు. దానికి కారణాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే, కొంతమందిలో కంటి నుండి నీరు కారడం అనేది సమస్య కనిపిస్తూ ఉంటుంది. ఇది సాధారణ సమస్యగానే కనిపించినా.. కొన్ని పరిస్థితులలో మాత్రం ఇది కళ్ళపై తీవ్ర ప్రభావాన్ని చూపవచ్చు. ఇతర ఆరోగ్య సమస్యకు కూడా కారణం కావచ్చు. మరి ఆ సమస్యలు ఏంటి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
కంటినుండి నీరు కారడానికి ప్రధాన కారణాలు:
1.ఎలర్జీ:
గాలి కాలుష్యం, దుమ్ము, పుప్పొడి, పెంపుడు జంతువుల రోమాలు మొదలైన వాటి వల్ల వచ్చే అలెర్జీలు వంటి సమస్యల వల్ల కంటి నుండి నీరు కరవచ్చు. దీనివల్ల కంటి బొమ్మల్లో ఉబ్బసం, చెరపాటు, నీరు కారడం వంటివి కలుగుతాయి. దీనివల్ల ఎక్కువగా దురదపెట్టడం, కన్ను ఎర్రబడ్డడం వంటివి కూడా కలగవచ్చు.
2.ఇన్‌ఫెక్షన్:
వైరల్ లేదా బాక్టీరియా కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్ కూడా ఒక ముఖ్య లక్షణం కావచ్చు. దీనివల్ల కూడా కంటినుండి నీరు కారడం. కొన్నిసార్లు గంజి లాంటి పదార్థం కంట్లో పేరుకుపోతుంది జరుగుతుంది.
3.కళ్ళు తడారిపోవడం:
ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు. కానీ, కంటి పొడి కారణంగా కూడా కంటి నుండి నీరు రావచ్చు. కంటి ఉపరితలాన్ని తడిగా ఉంచేందుకు శరీరం అధిక మోతాదులో నీరు ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల కళ్ళు తడిగా మారే అవకాశం ఉంటుంది.
4.డాక్రియోస్టెనోసిస్:
కొన్ని సందర్భాలలో కన్నీటి కాలువలు బ్లాక్ అవ్వడం వల్ల నీరు కంటినుండి బయటకు కారడం జరుగుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇది పుట్టుకతోనే ఉండొచ్చు.
5.ఇతర కారణాలు:
Sperm Count: స్పెర్మ్ కౌంట్ తగ్గుతోందా.. అయితే ఈ గింజలు రోజూ తినండి.. పుష్కలంగా పెరుగుతుంది
తరచూ నీరు కారడం వల్ల ఎదురయ్యే సమస్యలు:
ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి?
నివారణకు చిట్కాలు:
తరచూ కంటినుండి నీరు కారడం ఒక సాధారణ సమస్యగా అనిపించినా, దీని వెనుక కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలు దాగి ఉండవచ్చు. అలెర్జీ నుండి ప్రారంభమై, కన్జంక్టివైటిస్, డ్రై ఐ, కన్నీటి కాలువల్లో బ్లాకేజి వరకు ఎన్నో కారణాలు ఉండొచ్చు. కాబట్టి దీన్ని అలసత్వంగా తీసుకోకుండా, అవసరమైతే డాక్టర్‌ను సంప్రదించడం ముఖ్యం.