Bad Breath: నోటి దుర్వాసన, ప్రతీఒక్కరిలో సాధరణంగా ఉండే సమస్యనే. కానీ, ఇది మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. అందరిలోకి వచ్చి మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ సమస్యకు అనేక కారణాలు ఉన్నాయి. ఆహారం, ఆరోగ్య సంబంధిత సమస్యలు, కొన్నిసార్లు (Bad Breath)వాంఛనీయ అలవాట్లు కూడా కారణం అవ్వొచ్చు. కానీ, కొన్ని సులభమైన చిట్కాలు పాటించడం వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. మరి చిట్కాలు ఏంటి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
Health Tips: రోజు పప్పు తింటున్నారా? అయితే గ్యాస్ట్రిక్ సమస్యలు రావచ్చు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
1.పండ్లను శుభ్రం చేసుకోవడం:
నోటి దుర్వాసన కు ప్రధాన కారణం పండ్ల మధ్య ఉండే ప్లాక్, ఇరుక్కుపోయిన ఆహరం. ఈ ప్లాక్ అనేది బ్యాక్టీరియా పెరిగే అవకాశాన్ని కల్పిస్తుంది. దాంతో దుర్వాసన ఏర్పడుతుంది. కాబట్టి, ఉదయం, రాత్రి రోజుకు 2 సార్లు పండ్లను శుభ్రం చేసుకోవాలి.
2.మౌత్ వాష్:
మౌత్ వాష్ అనేది నోటి దుర్వాసనకు సమర్థవంతమైన సాధనం. ఇది నోటిలో బ్యాక్టీరియాను క్లీన్ చేయడంలో, నోటి తాజాతనాన్ని పెంచడంలో సహాయపడుతుంది. కొన్ని మౌత్ వాష్‌లలో టేట్రా ఫ్లోరిడ్స్, యాంటీబాక్టీరియల్ పదార్థాలు ఉంటాయి, ఇవి నోటి దుర్వాసన కారణమయ్యే బ్యాక్టీరియాను నశింపజేస్తాయి. కాబట్టి ప్రతిరోజూ నోటిని మౌత్ వాష్ తో కడగడం వల్ల మంచి ఫలితాలు అందుతాయి.
3.మధుమేహం/కిడ్నీ/గ్యాస్ట్రిక్ సమస్యలను పర్యవేక్షించడం:
ఒక వ్యక్తి యొక్క నోటి దుర్వాసనకు ఆరోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చు. మధుమేహం, కిడ్నీ, గ్యాస్ట్రిక్ సమస్యలు /ఇతర పేగు సంబంధిత వ్యాధులు శరీరంలో టాక్సిన్లను విడుదల చేస్తాయి. ఇవి నోటి దుర్వాసనకు కారణం అవుతాయి.
4.పానీయాలు/ నీరు ఎక్కువగా తాగడం:
నీరు నోటి లోపల శుభ్రతను కాపాడుతుంది. నీరు తాగడం వల్ల బ్యాక్టీరియా, వాంఛనీయ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. ముఖ్యంగా, డీహైడ్రేషన్, కారణంగా కూడా నోటి దుర్వాసన రావచ్చు. కాబట్టి, ఒక రోజు లో కనీసం 8 నుంచి10 గ్లాసుల నీరు తాగడం మంచిది.
5.పచ్చి ఆహారాలు తినడం:
కొన్ని ఆహార పదార్థాలు, ముఖ్యంగా పచ్చిపప్పులు, తాజా పండ్లలో నీటి పరిమాణం అధికంగా ఉంటుంది. ఇవి నోటి శుభ్రతను పెంచుతాయి. పచ్చి పండ్లు కూడా ఆహారం digest చేయడంలో సహాయపడతాయి. అలాగే దుర్వాసనను తగ్గించడానికి సహాయపడతాయి. కాబట్టి, రోజూ పచ్చిపండ్లు, తాజా కూరగాయలు తీసుకోవాలి.