Omega-3 Fatty Acids: మనిషి ఆరోగ్యంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కీ రోల్.. ఇది ఏ ఆహారంలో లభిస్తుందో తెలుసా?
మన ఆరోగ్యానికి బలాన్ని ఇవ్వడానికి పోషకపదార్థాలు చాలా అవసరం. అలాంటి పోషకాలలో (Omega-3 Fatty Acids)ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్

These are the foods that are rich in omega-3 fatty acids.
Omega-3 Fatty Acids: మన ఆరోగ్యానికి బలాన్ని ఇవ్వడానికి పోషకపదార్థాలు చాలా అవసరం. అలాంటి పోషకాలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ (Omega-3 Fatty Acids) ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇవి శరీరంలోని అనేక ప్రధానమైన విధులను నియంత్రిస్తాయి. ముఖ్యంగా గుండె, మెదడు, కళ్ల ఆరోగ్యానికి ఇవి చాలా అవసరం. కాబట్టి, వాటిని మన రోజువారీ ఆహరంలో చేర్చుకోవడం చాలా అవసరం. కాబట్టి, ఈ పోషకాలు ఏ ఆహారంలో ఎక్కువగా లభిస్తాయి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
Butter vs Ghee: వెన్న vs నెయ్యి: దేనిలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది.. ఏది ఆరోగ్యానికి మంచిది?
ఒమేగా-3 అంటే ఏమిటి?
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ అనే ఆరోగ్యకరమైన కొవ్వుల వర్గానికి చెందినవే. వీటిని మన శరీరం తానే తయారు చేసుకోలేదు. కాబట్టి, వాటిని ఆహారంలో నుంచే తీసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా మూడు రకాల ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి:
- ఏఎల్ఏ(Alpha-Linolenic Acid): మొక్కల ఆహరంలో లభిస్తుంది.
- ఈపీఏ(Eicosapentaenoic Acid): చేపలలో లభిస్తుంది
- డేహెచ్ఏ(Docosahexaenoic Acid): ఇది చేపలలో, సముద్ర ఆహారాలలో లభిస్తుంది.
ఒమేగా-3 యొక్క ఆరోగ్య ప్రయోజనాలు:
1.గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
- రక్తంలో ట్రైగ్లిసరైడ్స్ ను తగ్గిస్తుంది
- రక్తపోటును నియంత్రిస్తుంది
- గుండె జబ్బులు రాకుండా చేస్తుంది
2.మెదడు ఆరోగ్యానికి మేలు:
- ముఖ్యంగా పిల్లలలో మెదడు అభివృద్ధికి DHA చాలా ముఖ్యమైనది
- మూడ్ డిసార్డర్స్, డిప్రెషన్ లాంటి మానసిక సమస్యల నివారణలో ఎంతగానో సహాయపడుతుంది
- వృద్ధాప్యంలో వచ్చే మెమొరీని మెరుగుపరచే అవకాశముంది
3.ఆకంటి ఆరోగ్యం:
- కంటి రేటినా కోసం DHA అవసరం
- వృద్ధాప్య దృష్టికోణంలో వచ్చే మెక్యులార్ డిజనరేషన్‌ను తగ్గిస్తుంది
4.శరీరంలో వాపులను తగ్గిస్తుంది:
- ఒమేగా-3 పోషకాలు యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి
- ఆర్థరైటిస్ వంటి వాపులకు ఉపశమనాన్ని ఇస్తుంది
ఒమేగా-3 ఎండుకలో ఎక్కువగా ఉంటుంది:
మాంసాహార వనరులు:
- సాల్మన్, సార్డీన్స్, మాకెరెల్ వంటి కొవ్వుతో కూడిన చేపలు
- ఫిష్ ఆయిల్, క్రిల్ ఆయిల్ సప్లిమెంట్స్
శాకాహార వనరులు:
- అల్లనె విత్తనాలు
- అవిసె గింజలు
- వాల్‌నట్స్
- సోయాబీన్స్
- కానోలా ఆయిల్