High Cholesterol Diet food
ఈమధ్య కాలంలో చాలా మంది గుండెపోటుతో చనిపోతున్నారు. దానికి కారణం శరీరంలో పెరిగిపోతున్న కొలెస్ట్రాల్. ఇది రక్తనాళాల్లో అడ్డుగా ఏర్పడి గుండె జబ్బులకు కారణం అవుతుంది. అయితే, ఇలా శరీరంలో అధికంగా కొలెస్ట్రాల్ పెరిగిపోవడానికి కారణం మనం తింటున్న ఆహరం. మనిషి జీవనవిధానం కూడా ఇందుకు కారణం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఒంట్లో పెరిగిపోతున్న కొలెస్టాల్ ను తగ్గించడానికి కొన్ని ఆహారపదార్థాలు ఉన్నాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గిపోయి గుండె సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. మరి ఆ ఆహారపదార్థాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.Also Read: సీసీఎఫ్ టీ.. జీర్ణ సమస్యలకు అద్భుత ఔషధం.. ఒకసారి ట్రై చేయండి
కిడ్నీ బీన్స్ (రాజ్మా), నల్ల శనగలు, బ్లాక్ బీన్స్, కాబూలీ శనగలు, పప్పు దినుసులు వంటి పదార్థాలను మనం రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి ఎల్‌డీఎల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. దాంతో గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది. పప్పు దినుసుల్లో పెసలను బాగా తీసుకోవాలి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్ అదుపులో ఉంచడంలో మెరుగ్గా పనిచేస్తాయి. నెల రోజుల పాటు పెసలను తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. వీటిని ఉడకబెట్టి లేదా మొలకల రూపంలో తినడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. యాపిల్, స్ట్రాబెర్రీలు, ఆరంజ్ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిస్తాయి. దాంతో ఎల్‌డీఎల్ అదుపులో ఉంటుంది.
ప్రతీరోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, పూరీ, దోశలకు బదులుగా ఓట్స్ తీసుకోవడం చాలా మంచిది. దీనిలో ఫైబర్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వును తగ్గించి ఎల్‌డీఎల్‌ను అదుపులో ఉంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఓట్స్‌ను పాలలో వేసి కలిపి, ఓట్స్ ఉప్మా, ఓట్ మీల్ లాంటివి చేసుకొని కూడా తినవచ్చు. రుచిగా ఉండే ఈ ఓట్స్ ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. బార్లీ గింజలు మరిగించిన నీటిని రోజుకు ఒక గ్లాస్ తాగడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిపోతాయి.Also Read:కాకరకాయ, పెరుగు, పాలు.. వీటిని అస్సలు కలపకండి.. చాలా డేంజర్
మోనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉన్న ఆహరం తినడం వల్ల ఎల్‌డీఎల్‌ను అదుపు ఉంటుంది. అలాగే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సైతం ఎల్‌డీఎల్‌ను తగ్గిస్తాయి. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులతోపాటు ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఎల్‌డీఎల్‌ను తగ్గిస్తుంది. బాదంపప్పు, పిస్తా, వాల్ నట్స్, పల్లీలను నానబెట్టి తినడం వల్ల శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు అందుతాయి. ఇవి ఎల్‌డీఎల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. ముఖ్యంగా వంటల్లో ఆలివ్ ఆయిల్‌ను చేర్చుకోవడం చాలా మంచిది. దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎల్‌డీఎల్‌ను తగ్గించి హెచ్‌డీఎల్‌ను పెంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.