CCF Tea Benefits: సీసీఎఫ్ టీ.. జీర్ణ సమస్యలకు అద్భుత ఔషధం.. ఒకసారి ట్రై చేయండి
CCF Tea Benefits: సీసీఎఫ్ టీ జీర్ణ వ్యవస్తను మెరుగుపరుస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థలోని ఎంజైమ్‌లను ప్రేరేపించి, ఆహారాన్ని మరింత సులభంగా, సమర్థవంతంగా జీర్ణ అయ్యేలా చేస్తుంది.

Health benefits of CCF Tea
ప్రస్తుత కాలంలో ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వచ్చిందంటే చాలు వెంటనే టాబ్లెట్ వేసుకుంటారు. కానీ, ఇలా ప్రతీదానికి టాబ్లెట్స్ వాడటం వల్ల దీర్ఘకాలంలో చాలా రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే చిన్న చిన్న సమస్యలకు ఇంట్లోనే ఔషధాలను తయారుచేసుకునే వీలు కలిపించారు మన పూర్వీకులు. ఒకరకంగా చెప్పాలంటే మన వంటగది మెడికల్ షాప్ లాంటిది. ఇక్కడ చాలా సమస్యలకు ఉపశమనం కలిగించే ఔషదాలు ఉన్నాయి.
అలా మన ఇంట్లో థాయచేసుకునే మరో ఔషధమే సీసీఎఫ్ టీ. ఈ టీ తాగడం వల్ల జీర్ణ సంబంధమైన చాలా సమస్యలకు చెక్ పెట్టొచ్చు. మరి ఈ సీసీఎఫ్ టీ ఎలా తాయారు చేస్తారు? దీని ప్రత్యేకతలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. జీలకర్ర (Cumin), ధనియాలు (Coriander), సోంపు (Fennel).. ఈ మూడింటి కలయికనే సీసీఎఫ్ టీ. ఇది శరీరంలోని మలినాలను బయటకు పంపించి జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ టీ తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.Read Also:Bitter Gourd Side Effects: కాకరకాయ, పెరుగు, పాలు.. వీటిని అస్సలు కలపకండి.. చాలా డేంజర్
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
సీసీఎఫ్ టీ జీర్ణ వ్యవస్తను మెరుగుపరుస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థలోని ఎంజైమ్‌లను ప్రేరేపించి, ఆహారాన్ని మరింత సులభంగా, సమర్థవంతంగా జీర్ణ అయ్యేలా చేస్తుంది. ఇలా చేయడం వల్ల జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి తగ్గి దాని పనితీరు మెరుగుపడుతుంది.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది:
సీసీఎఫ్ టీ సహజంగా బరువు తగ్గడానికి సాయపడుతుంది. జీర్ణక్రియ, మెటబాలిజంను మెరుగుపరుస్తుంది కాబట్టి ఆహరం త్వరగా జీర్ణం అయ్యి బరువు తగ్గడాన్ని ప్రేరేపిస్తుంది.
కడుపు ఉబ్బరం, గ్యాస్‌ను తగ్గిస్తుంది:
చాలామంది కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. సీసీఎఫ్ టీలోని జీలకర్ర, ధనియాలు, సోంపు కలయిక కడుపు ఉబ్బరం, గ్యాస్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
మెటబాలిజంను పెంచుతుంది:
శక్తి, బరువు సమతుల్యాన్ని ఆరోగ్యకరమైన మెటబాలిజం చాలా అవసరం. సీసీఎఫ్ టీ రోజు తాగడం వల్ల మెటబాలిజం చాలా వరకు పెరుగుతుంది. ఇది కేలరీలను బర్న్ చేయడానికి, రోజంతా శక్తివంతంగా ఉండటానికి ఉపయోగపడుతుంది.Also Read;Paneer Quality Check: మీరు ఇంట్లో తింటున్న పనీర్ అసలైనదేనా? నకిలీదా? చిటికెలో ఇలా చెక్ చేయండి
ఋతుక్రమ సమస్యల నుంచి ఉపశమనం:
చాలామంది మహిళలు ఋతుక్రమ సమయంలో తీవ్ర ఇబ్బంది ఫీలవుతారు. సీసీఎఫ్ టీలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి పీరియడ్స్ క్రాంప్స్ తగ్గించి, పీఎంఎస్ సమస్యలకు పరిష్కారం చూపుతాయి.
సీసీఎఫ్ టీ ఏ సమయంలో తాగాలి?
సీసీఎఫ్ టీని కనీసం 8 వారాల పాటు తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. భోజనం తర్వాత, ఖాళీ కడుపు, సాయంత్రం పూట తాగడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.