Paneer Quality Check: మీరు ఇంట్లో తింటున్న పనీర్ అసలైనదేనా? నకిలీదా? చిటికెలో ఇలా చెక్ చేయండి

Paneer Quality Check: తయారీదారులు పనీర్ ను కల్తీ చేస్తున్నారు. అలాంటి పనీర్ తినడం వల్ల అనేకరకాల కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఇంట్లోనే సులభంగా పనీర్ నాణ్యతను చెక్ చేసుకోవచ్చు.

Paneer Quality Check: మీరు ఇంట్లో తింటున్న పనీర్ అసలైనదేనా? నకిలీదా? చిటికెలో ఇలా చెక్ చేయండి

Paneer Quality Checking Tips At Home

Updated On : June 23, 2025 / 2:42 PM IST

పనీర్.. ఈ పదార్థం ఇష్టం లేని వాళ్లంటూ ఎవరు ఉండదు. కాస్త మసాలా వేసి వండితే లొట్టలేసుకుంటూ తింటారు. ఎంతో మృదువుగా, రుచికరంగా ఉండే పనీర్ ని చాలా రకాల వంటకాల్లో వాడుతున్నారు. ముఖ్యంగా శాఖాహారులకు పనీర్ బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. పనీర్ లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే మార్కెట్ లో దీని డిమాండ్ చాలా పెరిగింగి. ఈ విషయాన్నీ గ్రహించిన తయారీదారులు పనీర్ ను కల్తీ చేస్తున్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా పనీర్ కల్తీకి సంబందించిన వీడియోలు వైరల్ అయ్యాయి. అలాంటి పనీర్ తినడం వల్ల అనేకరకాల కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఇక అప్పటినుండి పనీర్ నాణ్యతను తెలుసుకోవడానికి, తాము తింటున్న పనీర్ సహజమైనదా.. కాదా.. అని తెలుసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళు ఇంట్లోనే సులభంగా పనీర్ నాణ్యతను చెక్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

నకిలీ పనీర్ తినడం వల్ల కలిగే సమస్యలు:

డిటర్జెంట్: బట్టలు శుభ్రం చేసుకోవడం కోసం ఉపయోగించే డిటర్జెంట్, పంట పొలాల్లో వాడే యూరియా లాంటి పదార్థాలను పాలతో కలిపి పనీర్ తయారు చేస్తున్నారు. అలాంటి కల్తీ పనీర్ తినడం వల్ల వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, అవయవాలు దెబ్బతినడం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

పాల పొడి: ఇటీవల జరిగిన తనీకలల్లో బయటపడ్డ విషయం ఏంటంటే? పనీర్ తయారీలో పాలకు బదులుగా పాల పొడిని, కండెన్స్‌డ్ మిల్క్ ను వాడుతున్నారు. ఇలాంటి పనీర్ లో సహజ లక్షణాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి, మనం తినే పనీర్ రుచుకరంగా మాత్రమే ఉంటే సరిపోదు సురక్షితమైనది కేసుల ఉండాలి.

మైదా: ఈ మధ్య కాలంలో చాలా మంది పనీర్ లో మైదాను కలిపి తయారుచేస్తున్నారు. అలా చేయడం వల్ల పనీర్ బరువు పెరుగుతుంది. అంతేకాదు సహజంగా పనీర్ లో ఉండే పోషక విలువలు కూడా తగ్గుతాయి. దీని వల్ల జీర్ణ సమస్యలు రావచ్చు.

ఫార్మాలిన్: పనీర్ ఎక్కువ కాలం నిలువ ఉండటానికి అందులో ఫార్మాలిన్ వంటి రసాయనాలు కలుపుతున్నారు. ఈ పనీర్ తినడం వల్ల క్యాన్సర్, కాలేయం, అలెర్జీలు సమస్యలు వస్తాయి.

నకిలీ పనీర్‌ను ఇలా గుర్తించండి:

  • స్వచ్ఛమైన పనీర్ ను వేలితో కాస్త బలంగా నొక్కినప్పుడు అది దాని ఆకారాన్ని నిలుపుకుంటుంది. కానీ, నకిలీ పనీర్ చిన్నగా నొక్కగానే విరిగిపోతుంది.
  • నీటిలో మరిగించి, చాల్లార్చిన పనీర్ ను కంది పప్పు పొడితో బాగా కలిపి పక్కన పెట్టాలి. కాసేపయ్యాక అది ఎరుపు రంగులోకి మారిందంటే ఆ పనీర్ నాణ్యమైనది కాదు. డిటర్జెంట్ లేదా యూరియాతో తయారు చేసినట్లు అర్ధం.
  • మరిగించి చల్లబరిచిన పనీర్‌ ను సోయాబీన్ పొడితో కలపాలి. కాసేపయ్యాక అది రంగు మారితే అది ప్రమాదం అని అర్థం. అది రసాయనాలతో చేసిన పనీర్ అని గుర్తించండి.
  • ఓపెన్‌ కౌంటర్లలో అమ్మే పనీర్ ను రుచి, వాసనతో కూడా నాణ్యతను చెక్ చేయొచ్చు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఫేక్‌ ఆహారాన్ని తిని సమస్యలు కొనితెచ్చుకోవడం కంటే సర్టిఫైడ్, బ్రాండెడ్ పనీర్ కొనుగోలు చేయడం మంచిది. ఎందుకంటే, ఆ ప్యాక్‌పై తయారీ తేదీ, స్వచ్ఛత ధృవీకరణ, ఆహార లైసెన్స్ నంబర్ వంటి వివరాలు ఉంటాయి. కాబట్టి, పనీర్ తినే విషయంలో అసలు నిర్లక్ష్యం చేయకండి. పైన తెలిపిన విధంగా చెక్ చేసి మరీ తినండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.