Happy chocolate day 2024_ Can eating dark chocolate help reduce hypertension risk
Happy Chocolate Day 2024 : అసలే.. వాలెంటైన్స్ డే వీక్ నడుస్తోంది.. అంతలోనే చాక్లెట్ డే కూడా వచ్చేసింది. చాక్లెట్ కేవలం ప్రేమకు సంకేతం మాత్రమే కాదు.. ఆరోగ్యపరంగా కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుందని అనేక పరిశోధనల్లో రుజువైంది. రక్తపోటు లేదా అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో సాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కూడా మరింత మెరుగుపరుస్తుంది. డార్క్ చాక్లెట్ అధిక రక్తపోటు ప్రమాదాన్ని ఎలా తగ్గించగలదో ఇప్పుడు తెలుసుకుందాం.
Read Also : Health Tips : ఈ 5 రకాల పండ్లను ఫ్రిజ్‌లో పెట్టొద్దు ? ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
డార్క్ చాక్లెట్ ఎందుకు ఆరోగ్యానికి మంచిదంటే.. :
ప్రతి ఏడాదిలా 2024 ఫిబ్రవరి 9న కూడా చాక్లెట్ డే (Happy chocolate day 2024) జరుపుకుంటారు. వాలెంటైన్స్ డే ప్రత్యేక రోజుల్లో చాక్లెట్ అనేది ప్రేమకు సంకేతం అయితే.. ఈ తియ్యనైన చాక్లెట్ మొత్తం ఆరోగ్యాన్ని పెంచడంలోనూ సాయపడుతుంది. డార్క్ చాక్లెట్ ఎందుకు ఆరోగ్యానికి మంచిదంటే.. ఇందులో కోకో కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇతర మిల్క్ చాక్లెట్లు చక్కెరతో మాత్రమే నిండి ఉంటాయి. కానీ, డార్క్ చాక్లెట్ తినడం వల్ల రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చునని పరిశోధనలో తేలింది.
హైపర్‌టెన్షన్ లేదా అధిక రక్తపోటు గుండెపోటుకు ప్రధాన ప్రమాద కారకాల్లో ఒకటి. అన్ని వయసుల వారిలోనూ రక్తపోటు పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు, రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలి. నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురించిన అధ్యయనంలో తగినంత మొత్తంలో కోకో రిచ్ డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల హైపర్‌టెన్షన్ లేదా అధిక రక్తపోటు వచ్చే అవకాశాలను తగ్గించవచ్చునని పరిశోధకులు కనుగొన్నారు.
Happy chocolate day 2024
రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించగలదా? :
డార్క్ చాక్లెట్‌లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రక్తపోటు స్థాయిలను నిర్వహించే గుణాలు ఇందులో ఉన్నాయి. అనేక ఔషధ ప్రయోజనాలను కలిగిన ఫ్లేవనోల్స్‌ను కలిగి ఉంటుంది. ఈ ప్రయోజనాల్లో యాంటీక్యాన్సర్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయి. న్యూరోప్రొటెక్టివ్, కార్డియో-ప్రొటెక్టివ్ ప్రభావాలను కూడా కలిగి ఉన్నాయని పరిశోధనలో తేలింది.
డార్క్ చాక్లెట్.. ఆరోగ్య ప్రయోజనాలివే :
డార్క్ చాక్లెట్ తినడం వల్ల అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా హైపర్‌టెన్షన్ రిస్క్ తగ్గించడంతో పాటు గుండెను రక్షించడంలో సాయపడుతుంది. మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. శరీరంలో మంటను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. శారీరక ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా డార్క్ చాక్లెట్ మానసిక స్థితిని పెంచడంలో సాయపడుతుంది. మెదడులో మంచి హార్మోన్లను విడుదల చేయడంలో సాయపడుతుంది.
Read Also : Gut Health Tips : చలికాలంలో మలబద్ధకాన్ని నివారించే అద్భుతమైన 8 ఆహారాలివే.. తప్పక తెలుసుకోండి !