Health Tips : ఈ 5 రకాల పండ్లను ఫ్రిజ్‌లో పెట్టొద్దు ? ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

వేసవిలో పుచ్చకాయను ఎక్కువగా తింటారు. ఈ పండు చాలా పెద్దది కాబట్టి ఒక్కసారిగా తినడం కష్టం. అటువంటి పరిస్థితిలో, చాలా మంది పుచ్చకాయ ముక్కలను రిఫ్రిజిరేటర్‌లో భద్రపరుస్తారు. ఇలా చేయటం చాలా తప్పు. పుచ్చకాయను ముక్కులగా కోసి రిఫ్రిజిరేటర్‌లో పెట్టకూడదు.

Health Tips : ఈ 5 రకాల పండ్లను ఫ్రిజ్‌లో పెట్టొద్దు ? ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Refrigerators

Updated On : November 18, 2023 / 9:58 AM IST

Health Tips : ఇటీవలి కాలంలో రిఫ్రిజిరేటర్ అనేది ఒక ముఖ్యమైన గృహ ఉపకరణంగా మారిపోయింది. ఆహారపదార్దాలు చెడి పోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకునేందుకు చాలా మంది రిఫ్రిజిరేటర్‌ ను ఉపయోగిస్తుంటారు. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఆహారం , పానీయాలను నిల్వ చేయడానికి ఇది ఉపకరిస్తుంది. మాంసం, పాల ఉత్పత్తులు, పండ్లు , కూరగాయలు వంటి పాడైపోయే ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు పాడవకుండా ఉండేందుకు తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయటం వల్ల తాజాదనం కోల్పోకుండా ఉంటాయి. అంతేకాకుండా చెడిపోకుండా ఉంటాయి. రిఫ్రిజిరేటర్ లోని తక్కువ ఉష్ణోగ్రతలు ఆహారాన్ని చెడిపోయేలా చేసే ఇతర సూక్ష్మజీవుల పెరుగుదలను నిలువరిస్తాయి. తద్వారా ఆహారాన్ని తాజాగా ఎక్కువ కాలం తినడానికి ఉపయోగకరంగా ఉంటుంది.

READ ALSO : Best Fruits For Diabetes : మధుమేహ వ్యాధిగ్రస్తులు పండ్లు తినటం మంచిదేనా ? తినాల్సిన 10 ఉత్తమ పండ్ల రకాలు ఇవే !

కొన్ని రకాల పండ్ల విషయంలో ;

కొన్నిరకాల పండ్లను మాత్రమే ఫ్రిజ్‌లో ఉంచాలి. పండ్లను రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల చాలా వరకు పండ్లు పాడైపోతాయి. అంతేకాకుండా విషపూరితంగా కూడా మారే ప్రమాదం ఉంటుంది. కొన్ని రకాల పండ్లను రిఫ్రిజిరేటర్‌లో ఉంచకపోవటమే బెటర్. ఫ్రిజ్‌లో పండ్లను ఉంచడం వల్ల ప్రయోజనాలకు బదులుగా హాని కలిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఫ్రిజ్‌లో ఏ పండ్లను ఉంచకూడదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అరటిపండు;

అరటిపండు ఫ్రిజ్‌లో ఎప్పుడూ పెట్టకూడదు. అరటిపండును రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే చాలా త్వరగా నల్లగా మారుతుంది. అరటిపండ్ల నుండి ఇథిలీన్ వాయువు బయటకు వస్తుంది. దీనివల్ల ఫ్రిజ్ లో ఉంచిన ఇతర పండ్లను త్వరగా పక్వానికి వచ్చేలా చేస్తుంది, కాబట్టి అరటిపండ్లను ఎప్పుడూ ఫ్రిజ్‌లో లేదా ఇతర పండ్లతో ఉంచరాదు.

READ ALSO : Fruits vs Fruit Juices : పండ్లు vs పండ్ల రసాలు.. వీటిలో ఏవి ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయో తెలుసా ?

పుచ్చకాయ ;

వేసవిలో పుచ్చకాయను ఎక్కువగా తింటారు. ఈ పండు చాలా పెద్దది కాబట్టి ఒక్కసారిగా తినడం కష్టం. అటువంటి పరిస్థితిలో, చాలా మంది పుచ్చకాయ ముక్కలను రిఫ్రిజిరేటర్‌లో భద్రపరుస్తారు. ఇలా చేయటం చాలా తప్పు. పుచ్చకాయను ముక్కులగా కోసి రిఫ్రిజిరేటర్‌లో పెట్టకూడదు. ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి యాంటీ ఆక్సిడెంట్లు పాడైపోతాయి. తినడానికి ముందు కొంత సమయం వరకు వాటిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచటం వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు.

యాపిల్ ;

యాపిల్‌లను రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే అవి త్వరగా పండిపోతాయి. యాపిల్‌లో ఉండే క్రియాశీల ఎంజైమ్‌లు కారణంగా ఆపిల్ త్వరగా పండుతుంది. అందువల్ల యాపిల్స్‌ను ఫ్రిజ్‌లో ఉంచరాదు. ఎక్కువ కాలం యాపిల్స్ నిల్వ చేయాలనుకుంటే వాటిని కాగితంలో చుట్టి ఉంచటం మంచిది. రేగు, చెర్రీస్ వంటి విత్తనాలు ఉన్న పండ్లను కూడా రిఫ్రిజిరేటర్‌లో ఉంచకూడదు.

READ ALSO : Eating Fruits : బరువు ఎక్కువ ఉన్నవాళ్లు పండ్లు తినొచ్చా…?

మామిడి ;

మామిడిని రిఫ్రిజిరేటర్‌లో కూడదు. దీని వల్ల మామిడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తగ్గుతాయి. అంతేకాకుండా మామిడిలోని పోషకాలు కూడా నశిస్తాయి. మామిడి పండ్లను కార్బైడ్‌తో పండిస్తారు. కాట్టి వాటిని నీటిలో తడిపితే త్వరగా పాడవుతుంది.

లిచ్చిపండ్లు ;

వేసవిలో రుచిగా ఉండే లిచీని ఫ్రిజ్‌లో ఉంచకూడదు. లిచీని రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల పైభాగం బాగానే ఉన్నా గుజ్జు లోపలి బాగం చెడిపోతుంది.

READ ALSO : Stomach Health : పొట్ట ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు ఇవే!

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్నవారు వైద్యులను సూచనలు, సలహాలు తీసుకోవటం మంచిది.