Jaggery
Jaggery : బెల్లంలో రోగ నిరోధక శక్తిని పెంచే అనేక పోషకాలు ఉంటాయి. శీతాకాలంలో మీరు తీసుకునే ఆహారంలో బెల్లం జోడించడం ఎంతో అవసరం. దీని వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో చదవండి.
Bone and Joint Health Tips : శీతాకాలంలో ఎముకలు, కీళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి
చాలామంది టీలో బెల్లం వాడతారు. అలాగే కూరలు, పానీయాలలో కూడా బెల్లం వాడతారు. బెల్లంలో ఉండే వేడి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అయితే చాలామందికి చలికాలంలో బెల్లం ఎందుకు ప్రత్యేకంగా తీసుకోవాలి అనే డౌట్ రావచ్చు. శరీరం చలిని తట్టుకోవాలంటే పుష్కలమైన పోషకాహారం తీసుకోవాలి. బెల్లంలో అనేక పోషకాలు ఉండటంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇంకా మరిన్ని కారణాలున్నాయి.
Healthy Lifestyle in Winter : వింటర్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ బ్రేక్ చేయాల్సిందే !
బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శీతాకాలంలో శరీరానికి సరైన రక్తప్రసరణను అందించడంతో పాటు కండరాల పనితీరును నిర్వహించడానికి సాయపడతాయి. బెల్లంలో రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసే యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు ఉంటాయి. సాధారణమైన జలుబు, ఫ్లూ నుండి రక్షించడానికి శీతాకాలంలో బలమైన రోగ నిరోధక వ్యవస్థ ఎంతో కీలకం. బెల్లం జీర్ణక్రియలో సహాయపడుతుంది. శీతాకాలంలో శారీరక శ్రమ తగ్గడం తగ్గుతుంది దాంతో మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. నేచురల్ స్వీటెనర్ అయిన బెల్లాన్ని శీతాకాలంలో వంటకాల్లో ఉపయోగించడం వల్ల రక్తంలోని చక్కెర స్ధాయిలు కంట్రోల్‌లో ఉంటాయి. సో.. శీతాకాలంలో వీలైనంత మటుకు మీ ఆహారంలో బెల్లం చేర్చుకోండి.