Health benefits of doing a brisk walking day
Brisk Walking: నడక ఆరోగ్యానికి ఎన్నిరకాల ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. గుండె, మెదడు, కాలేయం, ఊపిరితిత్తులు ఇలా ప్రతీ అవయవం యొక్క ఆరోగ్యానికి నడక అనేది చాలా ప్రయోజనాలను అందిస్తుంది. అయితే ఎప్పుడు సాధారణ నడక మాత్రమే కాదు బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల ఇంకా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అసలు బ్రిస్క్ వాకింగ్ అంటే ఏమిటంటే.. ఒక స్థిరమైన, చురుకైన వేగంతో నిమిషానికి సుమారు 100 అడుగులు వేయడం. ఇలా చేయడం వల్ల సాధారణ నడక కన్నా ఎక్కువగా లాభాలకు శరీరానికి అందుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది గుండెపై(Brisk Walking) ఎలాంటి ప్రభావం పడకుండా శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచుతుంది. ఇంకా రకాల లాభాలే ఉన్నాయి. మరి ఆ లాభాలు ఏంటి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
Colon Cleansing: పేగుల్లో మలం.. కోలన్ క్లీనింగ్ తో మాయం.. ఇంకా ఎన్ని లాభాలో తెలుసా?
1.గుండె ఆరోగ్యం మెరుగవుతుంది:
సాధారణ నడక కన్నా బ్రిస్క్ వాకింగ్ ద్వారా హృదయానికి మరింత ఆక్సిజన్ అందుతుంది. ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది, హృదయ స్పందన సక్రమంగా ఉంచేలా చేస్తుంది. అలాగే, హై బీపీ, కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతుంది. తద్వారా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి సమస్యల వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
2.బరువు తగ్గించడంలో సహాయపడుతుంది:
బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల క్యాలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. ఇది మటాబాలిజాన్ని (Metabolism) పెంచుతుంది, కొవ్వు ఎక్కువగా కరుగుతుంది. కాబట్టి, దీనిని రోజూ 30 నిమిషాలపాటు చేయడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. అలాగే, స్థూలకాయం తగ్గుతుంది.
3.మెదడు ఆరోగ్యం మెరుగవుతుంది:
బ్రిస్క్ వాకింగ్ చేసే సమయంలో మెదడులో బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. అలాగే, ఫీల్ గుడ్ హార్మోన్లు (సెరోటొనిన్, ఎండోర్ఫిన్) విడుదలవుతాయి. అలాగే, ఒత్తిడి, డిప్రెషన్ తగ్గుతాయి. కాబట్టి, దీని వల్ల మానసిక ఉల్లాసం, ఏకాగ్రత, మెమొరీ మెరుగవుతాయి.
4.షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి:
బ్రిస్క్ వాకింగ్ అనేది బ్లడ్ గ్లూకోజ్ ని శరీరం బాగా వినియోగించేలా చేస్తుంది. అంతేకాకుండా.. ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెరిగేలా చేస్తుంది. టైప్ 2 డయాబెటిస్ తగ్గిపోయేలా చేస్తుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికే కాదు, డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవాలనుకునే వారికీ అద్భుతంగా పనిచేస్తుంది.
5.ముసలితనం నెమ్మదిస్తుంది:
బ్రిస్క్ వాకింగ్ ద్వారా కీళ్ళకు సరైన పనితీరు కలుగుతుంది. ఇలా చేయడం వల్ల ఎముకలు బలపడతాయి, మాయోమాస్ (Muscle Mass) తగ్గకుండా ఉంటుంది. కాబట్టి, ఇది వయస్సు పెరిగే కొద్దీ శరీరం కుంగిపోకుండా, యాక్టీవ్ గా ఉండేలా చేస్తుంది.
బ్రిస్క్ వేకింగ్ ఎప్పుడు, ఎలా చేయాలి?