Health benefits of eating fenugreek flowers for pregnant women
Fenugreek Flowers: మునగకాయ, మునగ ఆకు.. ఈ రెండు మనిషి ఆరోగ్యానికి ఎన్ని రకాల ప్రయోజనాలను అందిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మునగాకు మగవారిలో సంతానోత్పత్తిని పెంచడంలో విశేషంగా పని చేస్తుంది. అయితే, తాజాగా అధ్యాయనాల ప్రకారం కేవలం మునగకాయ, మునగ ఆకు మాత్రమే కాదు మునగ పువ్వు వల్ల కూడా అనేకరకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. మరీ ముఖ్యంగా(Fenugreek Flowers) గర్భిణీ స్త్రీలకు ఇది ఒక వరంగా చెప్తున్నారు నిపుణులు. మరి ఆ ప్రయోజనాలు ఏంటి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
గర్భిణీలు మునగ పువ్వు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1.ఇమ్మ్యూనిటీని బలపరుస్తుంది:
గర్భధారణ సమయంలో మహిళలకు ఇమ్మ్యూనిటీ అనేది చాలా అవసరం. కానీ, ఆ సమయంలో ఇమ్యూనిటీ వ్యవస్థ బలహీనంగా మారే అవకాశముంది. మునగ పువ్వులో ఉండే విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. తరుచుగా జలుబు, వైరల్ ఫీవర్ వంటి చిన్న సమస్యక నుంచి రక్షణ ఇస్తుంది.
2.రక్తహీనత నివారణ:
గర్భిణీలలో సాధారణంగా ఐరన్ లోపం వల్ల రక్తహీనత (Anemia) ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, మునగ పువ్వు తినడం వల్ల ఐరన్, ఇతర ఖనిజాలలు శరీరానికి సమృద్ధిగా అందుతాయి. అలాగే, హీమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది తల్లి శరీరానికి శక్తిని ఇస్తుంది, భవిష్యత్తులో ప్రసవ సమయంలో వచ్చే రిస్క్ ను తగ్గిస్తుంది.
3.జీర్ణవ్యవస్థకు సహాయం:
గర్భధారణ సమయంలో జీర్ణ సమస్యలు అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం లాంటివి రావడం సహజమే. మునగ పువ్వులో ఫైబర్ అనేది సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ
మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఇది మలబద్ధకాన్ని తగ్గించడమే కాక, జీర్ణాశయంలో తేలికను కలిగింపజేస్తుంది.
4.ఎముకలు బలపడటం:
గర్భిణీ స్త్రీ శరీరంలో శిశువు ఎదుగుదల కోసం అధిక కాల్షియం చాలా అవసరం. ఇది మునగ పువ్వులో అధికంగా ఉండటం వల్ల తల్లి ఎముకలు బలంగా తయారవుతాయి. అలాగే, ఇది శిశువు ఎముకల అభివృద్ధికీ అద్భుతంగా పని చేస్తుంది.
5.శరీరంలో వేడిని తగ్గిస్తుంది:
మునగ పువ్వులో ఉండే సహజ పోషకాలు శరీరాలోని వేడిని తగ్గిస్తాయి. తల్లి శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తుంది. అలాగే అలసటను తగ్గించి, మానసికంగా ఉత్తేజాన్ని కలిగిస్తుంది.