Phool Makhana: పూల్ మఖనాలు ఫుల్ ఆరోగ్యం.. షుగర్ మొత్తం కంట్రోల్ అవుతుంది.. గుండె జబ్బులు రావు

పూల్ మఖనాలు /లోటస్ సీడ్స్.. భారతీయ సంప్రదాయంలో శతాబ్దాలుగా ఆయుర్వేద ఔషధంగా,(Phool Makhana) ఉపాహారంగా ఉపయోగించబడుతున్న

Health benefits of eating Pool Makhana every day

Phool Makhana: పూల్ మఖనాలు /లోటస్ సీడ్స్.. భారతీయ సంప్రదాయంలో శతాబ్దాలుగా ఆయుర్వేద ఔషధంగా, ఉపాహారంగా ఉపయోగించబడుతున్న పదార్థం. ఇవి ముఖ్యంగా ఉత్తర భారతదేశం, చైనాలో విస్తృతంగా వాడకంలో ఉన్నాయి. తక్కువ కొవ్వు, తక్కువ కాలరీలు, అధిక ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉండటంతో ఇవి ఆరోగ్యవంతమైన జీవనశైలికి తోడ్పడతాయి. అందుకే ఈ పదార్థాన్ని తినడానికి చాలా మంది ఇష్టపడతారు. మరి ఈ పూల్ మఖనాలు(Phool Makhana) తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

Walking vs Jogging: వాకింగ్ v/s జాగింగ్: ఉదయం పూట ఏది చేయడం ఆరోగ్యానికి మంచిది

పుష్కలమైన పోషక విలువలు:

  • కాలరీలు
  • ప్రోటీన్
  • కార్బోహైడ్రేట్స్
  • ఫైబర్
  • కొవ్వు
  • మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, కాల్షియం, పొటాషియం లాంటి ఖనిజాలు ఉంటాయి.

పూల్ మఖనాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

1,జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది
వీటిలో ఫైబర్‌లో సమృద్ధిగా ఉంటుంది. దీని వలన పేగుల పనితీరు మెరుగవుతుంది, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

2,గుండె ఆరోగ్యానికి మేలు:
పూల్ మఖనాలలో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇవి రక్తపోటు నియంత్రణలో మెరుగ్గా పనిచేస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

3,బరువు తగ్గించుకోవడానికి అనుకూలం:
పూల్ మఖానాలలో తక్కువ కాలరీలు, అధిక ఫైబర్ ఉంటుంది. ఇవి ఆకలిని తగ్గిస్తాయి. తద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

4,రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించగలదు:
మఖనాలలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది మధుమేహం ఉన్నవారికి చక్కటి ఆహార ఎంపికగా చెప్పుకోవచ్చు.

5,మెదడు ఆరోగ్యానికి మేలు:
వీటిలో ఉండే మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు మెదడు ఆరోగ్యానికి తోడ్పడతాయి. అలాగే మఖనాలు మానసిక స్థిరతకు తోడ్పడతాయి.