Walking vs Jogging: వాకింగ్ v/s జాగింగ్: ఉదయం పూట ఏది చేయడం ఆరోగ్యానికి మంచిది
ఈ మధ్య కాలంలో చాలా మంది ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు(Walking vs Jogging). అందుకోసం చాలా మంది చేసే మొదటి

Walking vs Jogging: Which is better for health in the morning?
Walking vs Jogging: ఈ మధ్య కాలంలో చాలా మంది ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకోసం చాలా మంది చేసే మొదటి పని ఉదయం జాగింగ్ లేదా వాకింగ్ చేయడం. ఎలాంటి వారైనా చాలా సులభంగా చేసే పని కాబట్టి ఇవి రెండు చేయడానికి చాలా మంది ఇంట్రెస్ట్ గా ఉంటారు. నిజానికి ఈ రెండు ఉదయం పూట చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, కొంతమందిలో ఉండే సందేహం ఏంటంటే? ఉదయం పూటా జాగింగ్ చేయడమా లేదా వాకింగ్ (Walking vs Jogging)చేయడం ఉత్తమమా అని. అయితే, ఇప్పుడు ఈ రెండిటిలో ఆరోగ్యానికి ఏది మంచిది అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
Junk Food: జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా? ఆరోగ్యాన్ని పనంగా పెట్టినట్టే.. ఈ తిప్పలు తప్పవు
వాకింగ్ (నెమ్మదిగా కానీ స్థిరమైన ప్రయాణంలో):
వాకింగ్ లో వేగం తక్కువగా ఉంటుంది. కాబట్టి, ఏ వయసు వారైనా దీనికి సులభంగా చేయవచ్చు. వృద్ధులు కూడా సులభంగా చేయగలరు. కాబట్టి, ఉదయం పూట వాకింగ్ చేయడం వల్ల హృదయ ఆరోగ్యం, రక్తపోటు, మధుమేహం నియంత్రణలో ఉంటాయి. అలాగే మనశ్శాంతి ఏర్పడుతుంది, మెదడు పనితీరుకు మెరుగవుతుంది.
ఎవరు చేయడానికి అనువైనది?
- ప్రారంభ స్థాయి వ్యాయామం చేయాలనుకునే వారికి ఇది ఉత్తమమైనది.
- గర్భిణీలు, వృద్ధులు
- మోకాళ్ళు, వెన్నెముక సమస్యలతో బాధపడేవారు
- మెల్లిగా బరువు తగ్గాలనుకునేవారు
జాగింగ్ (వేగంగా శక్తిని ఖర్చుచేసే వ్యాయామం)
జాగింగ్ చేయడంలో వేగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శరీరంలో కాలరీ వేగంగా ఖర్చు అవుతాయి. కాబట్టి, అంతే వేగంగా బరువు కూడా తగ్గుతారు. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శరీరం మరింత శక్తివంతంగా మారుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఎవరు చేయాలి?
- అధిక శ్రమ అలవాటున్నవారు మాత్రమే చేయాలి
- అధిక బరువు తగ్గించాలనుకునే వారు
- యువత, మధ్య వయస్కులు చేయాలి
- మోకాళ్ల సమస్యలు లేనివారు
ఉదయం పూట ఏది మంచిది?
ఉదయం మన శరీరం కొత్త రోజును ప్రారంభిస్తున్న సమయం కాబట్టి ఆరోగ్య స్థితిని బట్టి ఎంపిక జరగాలి. తొలిదశలో వాకింగ్ మొదలుపెట్టి క్రమంగా జాగింగ్‌కి మారాలి. నిద్రలేచిన వెంటనే కాకుండా కొంత సమయం తర్వాత వ్యాయామం మొదలుపెట్టాలి. తేలికపాటి నీరు తాగిన తర్వాత చేయడం వల్ల మంచి ఫలితాలు అందుతాయి.
జాగ్రత్తలు:
- మంచి షూ తప్పనిసరి
- మైదానాలు, పార్కులాంటి మృదువైన నేలపై మాత్రమే చేయాలి
- ఉదయం గాలి శుభ్రాంగా ఉన్న సమయాన్ని ఎంచుకోవాలి.