Health Tips: Health problems caused by using a rice cooker
Health Tips: ఇప్పటి వేగవంతమైన జీవితశైలిలో రైస్ కుక్కర్ అనేది ఒక అవసరమైన పరికరంగా మారిపోయింది. టైమ్ సేవింగ్, తేలికైన వంట విధానం, దానికదే ఆఫ్ చేసుకోవడం వంటి లాభాల వల్ల చాలా మందిలో దీనికి అలవాటుపడుతున్నారు. కానీ దీన్ని పదేపదే వాడటం వల్ల, లేదా తగిన జాగ్రత్తలు పాటించకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తున్నారు. మరి ఆ సమస్యలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది (Health Tips)ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
Colon Cancer: కోలన్ క్యాన్సర్ అంటే ఏమిటి.. ప్రమాద స్థాయి ఎంత.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
1.ప్లాస్టిక్ భాగాల నుండి విషపూరిత వాయువులు:
చాలా రైస్ కుక్కర్ల లోపల ఉన్న భాగాలు లేదా బయటి భాగాలు ప్లాస్టిక్ తో తయారవుతాయి. అధిక ఉష్ణోగత వద్ద అవి బిస్‌ఫెనాల్-A (BPA), డయోక్సిన్ వంటి విషపూరిత రసాయనాలు విడుదల చేసే అవకాశం ఉంది. దీనివల్ల హార్మోన్ బాలన్స్ తప్పడం, లివర్, కిడ్నీ పనితీరుపై ప్రభావం, చిన్న పిల్లలలో మానసిక అభివృద్ధికి ఆటంకం వంటి సమస్యలు కలగవచ్చు.
2.ఎక్కువగా తెల్ల బియ్యాన్ని వాడటం:
రైస్ కుక్కర్ ఎక్కువగా తెల్ల బియ్యాన్ని త్వరగా ఉడికించడానికి ఉపయోగిస్తారు. కానీ తెల్ల బియ్యంలో ఫైబర్, విటమిన్లు తగ్గిపోయి, కేవలం శక్తి మాత్రమే మిగిలిపోతుంది. దీని వల్ల బరువు పెరగడం, బ్లడ్ షుగర్ స్థాయి పెరగడం, డయాబెటిస్‌కు దారితీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
3. నాన్ స్టిక్ కోటింగ్ వల్ల ప్రమాదం:
కొన్ని రైస్ కుక్కర్లను నాన్-స్టిక్ పాన్ తో వస్తాయి. దీని పైన ఉండే టెఫ్లాన్ కోటింగ్ అధిక ఉష్ణోగతలో వదులిపోతే పారాశానిక అనారోగ్య సమస్యలు కలిగించవచ్చు. దీనివల్ల శ్వాసకోశ సమస్యలు, లివర్ సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
కొన్ని సూచనలు: