అరటి పండుతో ఈ ఆహారం జత చేసి తింటున్నారా? ఎంత ప్రమాదకరమో తెలుసా…

అరటి పండ్లు ఏ సీజన్‌లో అయినా దొరుకుతాయి. జీర్ణక్రియకు ఎంతగానో ఉపకరించే ఈ పండుని కొన్ని ఆహారపదార్ధాలతో జోడించి తినొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Harmful Food Combinations : అరటి పండుని చాలామంది ఇష్టపడి తింటారు. వీటిలో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే అనేక పోషకాలు ఉంటాయి. అయితే కొన్ని ఆహార పదార్ధాలతో అరటి పండు కలిపి తినడం వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.

అరటి పండ్లకి సీజన్ అంటూ ఉండదు. ఏడాది పొడవునా దొరుకుతాయి. పచ్చిగా ఉన్నప్పుడు కూరల్లో కూడా వినియోగిస్తారు. వీటిలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఫైబర్, ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. జలుబు, దగ్గుతో ఇబ్బంది పడేవారు.. మధుమేహం ఉన్నవారు ఈ పండుకి దూరంగా ఉండాలని చెబుతారు. అయితే అరటి పండ్లను కొన్ని ఆహార పదార్ధాలకు జత కలిపి తినొద్దని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?

Also Read: అరటి పండును ఏ సమయంలో తినకూడదో తెలుసా?

అరటి పండులో ఆమ్ల స్వభావం ఉంటుంది. పాలు తియ్యగా ఉంటాయి. ఈ రెండు కలిస్తే జీర్ణ సమస్యలకు దారి తీస్తుందట. జలుబు, దగ్గు వంటి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉందట. అలాగే రెడ్ మీట్‌లో ప్యూరిన్ ఉంటుంది. ఇది సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అయితే రెడ్ మీట్‌లో ఉండే అధిక ప్రొటీన్లు జీర్ణక్రియను నెమ్మది చేస్తాయి. విరుద్ధమైన స్వభావం ఉన్న రెండు ఆహార పదార్ధాలను తిన్నప్పుడు అవి జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు కలిగిస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.

కొంతమంది రొట్టెలతో పాటు అరటి పండ్లను తింటారు. ఇది అనారోగ్యకరమైన పని అంటున్నారు నిపుణులు. రొట్టె లేదా కాల్చిన వస్తువులలో ప్రాసెస్ చేయబడిన పిండి పదార్ధాలు ఉంటాయి. అవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అరటి పండ్లు జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. ఈ రెండు కలిపి తింటే పలు అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందట. నిమ్మ, దానిమ్మ, స్ట్రాబెర్రీ మొదలైన ఆమ్ల స్వభావం ఉన్న పండ్లను అరటి పండుతో తినడం మంచిది కాదట. అరటిపండు తీయని స్వభావాన్ని కలిగి ఉండటంతో రెండు కలిపి తింటే వికారం, తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

Also Read: అరటి పండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు

అరటి పండుతో ఈ ఆహార పదార్ధాలను జోడించకుండా తింటే వాటి ప్రయోజనాలను పూర్తిగా ఆస్వాదించగలుగుతారు. ఇక ఫుడ్ విషయంలో మరింతగా ప్లాన్ చేసుకోవాలంటే ఎక్స్‌పర్ట్స్‌ సలహా తీసుకోవడం మరింత మంచిది.

ట్రెండింగ్ వార్తలు