Health Tips: This type of fish should not be eaten at all.
Health Tips: చేపలు అనేవి మనిషి ఆరోగ్యానికి పోషకాలు అందించడంలో ఎంతగానో సహాయపడతాయి. ఎందుకంటే, చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి హృదయానికి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. అయితే, అన్ని చేపలు ఆరోగ్యానికి మేలు చేయవు. కొన్ని రకాల చేపలు కాలుష్యానికి గురై పాక్షికంగా విషపూరితంగా మారే అవకాశం ఉంది. కొన్నిసార్లు చేపలను పెంచే విధానాల వల్ల వాటిలో హానికరమైన రసాయనాలు(Health Tips) లేదా హార్మోన్లు చేరి, అవి తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం కావచ్చు. కాబట్టి, అలాంటి చేపలు ఏంటి? అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
Health Tips: చెప్పుల వాడకంలో జాగ్రత్త.. ప్రమాదంలో నడుము, వెన్నెముక, మెడ.. వీటి గురించి తెలుసుకోండి
1.పంగాసియస్ (బాసా చేప):
ఈ రకమైన చేపలు ఇండియా, బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాల్లో ఎక్కువగా పెంచబడుతుంది. వీటి పెంపకంలో అధికంగా రసాయనిక క్షారాల కలిసిన నీటిని వాడతారు. అలాగే కొన్ని పంగాసియస్ చెరువుల్లో పారిశ్రామిక వ్యర్థాలను కూడా కలుపుతున్నారు. కాబట్టి, ఇలాంటి చేపలను తినడం వల్ల లివర్ డ్యామేజ్, హార్మోన్ అసమతుల్యత, దీర్ఘకాలికంగా క్యాన్సర్ ముప్పు కావచ్చు.
2.కింగ్ మాకరెల్ (వొన చేప):
సముద్ర ప్రాంతాల్లో, ముఖ్యంగా బంగాళాఖాతంలో ఈ రకమైన చేపలు ఎక్కువగా లభిస్తాయి. ఈ చేపలో మెర్క్యురీ మోతాదు అధికంగా ఉంటుంది. మెర్క్యురీ ఒక న్యూరోటాక్సిన్. ఇది మానవ మెదడుపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి, ఈ రకమైన చెప్పాను తినడం వల్ల మతిస్థిమిత లోపాలు, గర్భిణీ స్త్రీలకు భ్రూణ వికాసంలో ఆటంకం, కిడ్నీ డ్యామేజ్ వంటి సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది.
3.పఫర్ ఫిష్:
ఈ రకమైన చేపలు జపాన్, కొరియా, కొన్నిసార్లు ఇండియా తీరప్రాంతాల్లో అధికంగా దొరుకుతాయి. వీటిలో టెట్రోడోటాక్సిన్ అనే ప్రమాదకరమైన విషపదార్థం ఉంటుంది. కాబట్టి, ఈ చేపలను అధికంగా తినడం వల్ల ప్రాణాంతకమయ్యే అవకాశం ఉంది. ఇంకా కమ్మిన ఫీలింగ్, శ్వాసకోశ నిష్క్రియ, గుండె ఆగిపోవడం వంటి సమస్యలు కూడా రావచ్చు.
4.డాల్ఫిన్ చేప:
ఇది మనకు తెలిసిన డాల్పిన్ చేప కాదు. కానీ, అదే డాల్ఫిన్ రకాలకు చెందినవి. ఈ రకమైన చేపలు కలుషిత సముద్రంలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, వీటిలో మైక్రోప్లాస్టిక్స్, హేవీ మెటల్స్ ఉండే అవకాశం ఉంది. ఈ చేపలను తినడం వల్ల జీర్ణ సమస్యలు, హార్మోన్ సమస్యలు, లివర్, కిడ్నీ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
5.టైల్ ఫిష్:
అమెరికా తీరప్రాంతాలు, కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో ఈ చేప ఎక్కువగా లభిస్తుంది. ఈ చేపల్లో మెర్క్యురీ ఎక్కువగా ఉంటుంది. FDA ప్రకటన ప్రకారం ఈ చేపను గర్భిణీ స్త్రీలు తినవద్దు. ఒకవేళ తింటే నరాలు సమస్య, గర్భంలో శిశువు అభివృద్ధి సమస్య, కిడ్నీ, మెదడు ఫంక్షన్లపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది.