Health Tips: చెప్పుల వాడకంలో జాగ్రత్త.. ప్రమాదంలో నడుము, వెన్నెముక, మెడ.. వీటి గురించి తెలుసుకోండి
మనిషి ఆరోగ్యంలో పాదాల రక్షణ అనేది(Health Tips) చాలా అవసరం. ఎందుకంటే.. పాదాలు రోజంతా శరీర బరువును మోయడమే కాకుండా

Health Tips: What kind of sandals are good for proper health?
Health Tips: మనిషి ఆరోగ్యంలో పాదాల రక్షణ అనేది చాలా అవసరం. ఎందుకంటే.. పాదాలు రోజంతా శరీర బరువును మోయడమే కాకుండా, కదలికలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే, వాటి రక్షణ అనేది చాలా అవసరం. వాటికీ సరైన చెప్పులు లేకపోతే కేవలం పాదాలకే(Health Tips) కాకుండా మోకాల్లు, వెన్నెముక, మెడ వంటి భాగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే ఆరోగ్యపరంగా చెప్పుల ఎంపిక అనేది చాలా ముఖ్యం. కాబట్టి, ఆరోగ్యానికి మంచి చెప్పులు ఎలా ఉండాలి? చెప్పులు వాడకం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? అనే విషయాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
సరైన చెప్పులు వాడకపోతే వచ్చే సమస్యలు:
- పాదం నొప్పి
- పాదం అడుగు భాగంలో నొప్పి
- మోకాలి నొప్పులు
- వెన్నెముక నొప్పి
- పాదాల పగుళ్లు, గాయాలు
ఆరోగ్యానికి మంచిన చెప్పుల లక్షణాలు:
1. ఆర్చ్ సపోర్ట్ ఉన్న చెప్పులు:
మన పాదానికి సహజంగా ఉండే వక్రత (arch) ను బలంగా సపోర్ట్ ఇవ్వాలి. ఇది పాదం శ్రమను తగ్గించి, నడకను సాఫీగా సాగేలా చేస్తుంది.
2.సౌకర్యవంతమైన కుషన్:
అడుగు భాగానికి మృదుత్వాన్ని కలిగించే పదార్థం ఉండేలా చూసుకోవాలి. ఇది షాక్ అబ్జార్బర్ లాగా పనిచేసి, మోకాలుపై ఒత్తిడి కలగకుండా చేస్తుంది.
3.మంచి గ్రిప్:
నేలపై తడిగా ఉన్నా జారకుండా ఉండే చెప్పులు వాడాలి. అందుకోసం చెప్పుల అడుగున మంచి గ్రిప్ అవసరం. వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ఈ లక్షణం ఉన్న చెప్పులను మాత్రమే వాడాలి.
4.గాలి ఆడే పదార్థం:
మనం వాడే చెప్పులు లోపల గాలి ఆడే విధంగా ఉండాలి. లేదంటే చెమట వల్ల పాదాల సమస్యలు రావచ్చు. మైక్రోఫైబర్, మెష్, లెదర్ వంటి పదార్థాలతో చేసిన చెప్పులు మంచివి.
5.సరిపోయే కొలత:
చెప్పులు కాలికి బిగుతుగా ఉండకూడదు, అలా అని లూజ్‌గా కూడా ఉండకూడదు. కలిగే సరిపడా సైజ్ ఉండాలి.
ఆరోగ్యానికి మంచి చెప్పుల రకాలేంటి?
ఆర్థోపెడిక్ చెప్పులు: పాద సమస్యలు ఉన్నవారికి ప్రత్యేకంగా రూపొందించబడి చెప్పులు ఇవి.
స్నీకర్స్: వ్యాయామం, రోజువారి నడకకు అనుకూలంగా మృదువైన సపోర్ట్ తో ఉంటాయి
సాండల్స్: ఇవి గాలి ఆడేలా ఉండి, కాలికి తగిన మద్దతును ఇస్తాయి
ఈ రకం చెప్పులు అస్సలు వాడకూడదు:
- ఫ్లాట్ గా ఉండే చెప్పులు
- హై హీల్స్
- ప్లాస్టిక్ చెప్పులు.