హెచ్‌ఐవీ-1ని నియంత్రించే ఔషధం

ప్రముఖ ఔషధ రంగ సంస్థ హెటిరో హెల్త్‌కేర్‌.. దేశీయ మార్కెట్లోకి హెచ్‌ఐవీ-1ను నియంత్రించే ఔషధాన్ని విడుదల చేసింది.

  • Publish Date - December 18, 2019 / 04:08 AM IST

ప్రముఖ ఔషధ రంగ సంస్థ హెటిరో హెల్త్‌కేర్‌.. దేశీయ మార్కెట్లోకి హెచ్‌ఐవీ-1ను నియంత్రించే ఔషధాన్ని విడుదల చేసింది.

ప్రముఖ ఔషధ రంగ సంస్థ హెటిరో హెల్త్‌కేర్‌.. దేశీయ మార్కెట్లోకి హెచ్‌ఐవీ-1ను నియంత్రించే ఔషధాన్ని విడుదల చేసింది. 3-ఇన్‌-వన్‌ కలిగిన ఈ మందును టాఫిక్‌ బ్రాండ్‌తో ప్రవేశ పెట్టింది. గిలేడ్‌ బిక్తార్వేకు జనరిక్‌ వెర్షన్‌గా ప్రవేశపెట్టిన ఈ ఉత్పత్తికి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి కూడా ఇచ్చింది. 

ఈ ఔషధాన్ని దేశీయ రిటైల్‌ మార్కెట్లో హెటిరో హెల్త్‌కేర్‌ విక్రయించడంతోపాటు డిస్ట్రిబ్యూట్‌ చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులకు దీన్ని అందించనుంది. హెచ్ ఐ వీ 1 వ్యాధి సోకిన వారు ఈ ట్యాబులెట్ లో నయం చేసుకోవచ్చు. 

హెచ్ ఐవీ ప్రాణాంతక వ్యాధి అని అందరికీ తెలిసిన విషయమే. హెచ్ ఐవీ1 వ్యాధి నియంత్రించేందుకు మందు రావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మందు రావడంతో హెచ్ ఐవీ 1 వ్యాధి సోకిన వారికి ఊరట కలిగింది. హెచ్ ఐవీ సోకిన ఎంతో మందిని కాపాడవచ్చని అంటున్నారు.