Back Pain: బ్యాక్ పెయిన్ బాధిస్తోందా.. ప్రధాన కారణాలు ఏంటో తెలుసా? ఈ సూచనలు పాటించండి
ప్రస్తుతం కాలంలో చాలా మందిలో కనిపిస్తున్న సమస్య బ్యాక్ పెయిన్(Back Pain). మారుతున్న జీవనశైలి, పని ఒత్తిళ్లు ఈ సమస్య రావడం జరుగుతుంది.

Adopt these 5 key habits to reduce back pain
Back Pain: ప్రస్తుతం కాలంలో చాలా మందిలో కనిపిస్తున్న సమస్య బ్యాక్ పెయిన్. మారుతున్న జీవనశైలి, పని ఒత్తిళ్లు, తప్పులైన శరీర ధారణ, శారీరక శ్రమ లోపం వంటివి వాటివల్ల ఈ సమస్య రావడం జరుగుతుంది. అయితే, ఈ సమస్య తాత్కాలికంగా ఉండొచ్చు లేదా దీర్ఘకాలికంగా కూడా బాధించొచ్చు. దీనివల్ల శరీరంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. కానీ, చాలా మందికి ఈ సమస్య రావడానికి ప్రధాన కారణాలు పెద్దగా తెలియదు(Back Pain). దాని గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
Brain Health: మెదడు ఆరోగ్యం కోసం ఉదయం ఈ పనులు చేయండి.. జ్ఞానం, జ్ఞాపక శక్తి అద్భుతంగా పెరుగుతుంది
బ్యాక్ పెయిన్ రావడానికి ప్రధాన కారణాలు:
1.తప్పుడు శరీర ధారణ:
పని చేసే సమయంలో కుర్చీలో వంగి కూర్చోవడం, ఎక్కువసేపు మొబైల్/ లాప్‌టాప్ వాడటం వల్ల బ్యాక్ పెయిన్ రావడం జరుగుతుంది. కాబట్టి, కుర్చీలో కూర్చొనేటప్పుడు తగిన మద్దతు ఉండేలా చూసుకోవాలి. అలాగే పడుకునే విధానాన్ని బట్టి కూడా బ్యాక్ పెయిన్ వచ్చే ప్రమాదం ఉంది.
2.శారీరక శ్రమ లోపం:
ఈ మధ్య కాలంలో చాలా మంది శారీరక శ్రమకు దూరం అవుతుంది. రోజువారీ వ్యాయామం లేకపోవడం, ఎక్కువసేపు కూర్చొని ఉండే పనులు చేయడం వల్ల వెన్నెముక చుట్టూ ఉండే కండరాలు బలహీనపడి నొప్పికి దారితీస్తుంది.
3.భారీ బరువు మోయడం:
ఒకేసారి ఎక్కువ బరువులు ఎత్తడం వల్ల వెన్నెముకపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. దీని వల్ల బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది.
4.అధిక బరువు:
శ్రమ తగ్గడం వల్ల శరీర బరువు పెరగడం సహజమే. దీనివల్ల వెన్నెముకపై అదనపు ఒత్తిడి పడుతుంది. ఆ కారణంగా కూడా బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది.
బ్యాక్ పెయిన్ నివారణకు ముఖ్యమైన చర్యలు:
1.సరైన ధారణ పాటించండి:
కుర్చీలో కూర్చునేప్పుడు స్తంభంలా నిటారుగా కూర్చునే అలవాటు చేసుకోవాలి. లాప్‌టాప్ వాడేటప్పుడు ఐలెవెల్‌లో ఉండేలా చూసుకోవాలి. అలాగే పడుకునే సమయంలో సరైన దిండు వల్ల వెన్నెముకకు మద్దతు లభిస్తుంది.
2.నిత్య వ్యాయామం:
ప్రతీరోజు నడక, జాగింగ్, యోగా, స్విమ్మింగ్, బ్యాక్ స్ట్రెంచింగ్ ఎక్సర్సైజులు చేయడం అలవాటు చేసుకోవాలి. ఇవి చేయడం వల్ల వెన్నెముక చుట్టూ కండరాలు బలంగా తయారవుతాయి.
3.బరువు నియంత్రణ:
అధిక బరువు వెన్నెముకకు భారంగా మారుతుంది. కాబట్టి, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామంతో బరువు నియంత్రణలో ఉంటుంది.
4.బరువులు మోసేటప్పుడు జాగ్రత్త:
ఎప్పుడైనా బరువు ఎత్తేటప్పుడు మోకాళ్ళను వంచి మాత్రమే ఎత్తాలి. ఇలా ఎత్తడం వల్ల వెన్నెముకపై ప్రభావం తగ్గుతుంది.
5.మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి:
ప్రతీరోజు శరీరానికి అవసరమైన విశ్రాంతి అవసరం. మానసిక ఒత్తిడి కూడా బ్యాక్ పెయిన్‌కు కారణమవుతుంది. అందుకే ధ్యానం, ప్రాణాయామం వంటి వాటిని దినచర్యలో భాగం చేసుకోవాలి.