Lose Weight In Winter : చలికాలంలో తొందరగా బరువు తగ్గాలంటే మీ డైట్‌లో ఇవి ఉండాల్సిందే..!

Lose Weight In Winter : శీతాకాలంలో ఎలా బరువు తగ్గాలా? అని ఆలోచిస్తున్నారా? అనేక వ్యాయామాలు చేసినా ఆశించిన ఫలితం రావడం లేదా? అయితే, మీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోండి. థర్మోజెనిక్ ఆహారాల జాబితాను ఓసారి ప్రయత్నించండి.

How To Lose Weight In Winter Season, These Thermogenic Foods To Your Diet Must

Lose Weight In Winter : శీతాకాలంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది. మీ భోజనంలో పోషకమైన ఆహారాన్ని చేర్చుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, థర్మోజెనిక్ ఆహారాలను చేర్చవచ్చు. శారీరకంగా చురుకుగా ఉండటం, ఇండోర్ వ్యాయామాలను చేయొచ్చు లేదా క్రీడలలో పాల్గొనడం వంటివి కూడా ఈ సీజన్‌లో బరువు తగ్గించడంలో సాయపడతాయి. అయితే, చలి వాతావరణంలో శారీరక శ్రమ పెద్దగా ఉండదు.

Read Also : Gut Health Tips : చలికాలంలో మలబద్ధకాన్ని నివారించే అద్భుతమైన 8 ఆహారాలివే.. తప్పక తెలుసుకోండి !

వివిధ కారణాల వల్ల శీతాకాలంలో బరువు తగ్గడం సవాలుగా మారుతుంది. కానీ, కొన్ని మార్గాల్లో ఈ సీజన్‌లో బరువు చాలా సులభంగా తగ్గవచ్చునని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. థర్మోజెనిక్ ఆహారాలతో శరీరంలో జీవక్రియను పెంచి వేడిని ఉత్పత్తి చేయగలవు. శరీరం ప్రధాన ఉష్ణోగ్రతను పెంచుతాయి. కొవ్వును కరిగించడంలో సాయపడతాయి. చలికాంలో బరువు తగ్గడానికి మీ ఆహారంలో చేర్చగల థర్మోజెనిక్ ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. గ్రీన్ టీ వాడకం :
గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ టీలో కాటెచిన్స్ ఉంటాయి. తద్వారా జీవక్రియను పెంచుతుంది. కొవ్వు ఆక్సీకరణను మెరుగుపరుస్తుంది. తొందరగా బరువు తగ్గడంలో సాయపడుతుంది. మీరు ఆహారం తీసుకునే ముందు గ్రీన్ టీ ఆకులను వేడి నీటిలో కొన్ని నిమిషాలు మరిగించి టీ మాదిరిగా తీసుకుంటుండాలి.

2. అల్లంతో బరువు తగ్గొచ్చు :
అల్లం బరువును తగ్గించడంలో అద్భుతంగా సాయపడుతుంది. ఎందుకంటే.. అల్లంలో థర్మోజెనిక్ లక్షణాలు ఉంటాయి. శరీరంలో పేరుకుపోయిన కేలరీలను బర్న్ చేయడంలో సాయపడుతుంది. అంతేకాదు.. ఆకలిని కూడా తగ్గిస్తుంది. తురిమిన అల్లంను తీసుకుని వంటలలో వాడుతుండాలి. అల్లం టీ తాగుతుండాలి. లేదంటే స్మూతీస్‌లో కూడా అల్లంను ఉపయోగించడం వల్ల అద్భుత ప్రయోజనాలను పొందవచ్చు.

3. దాల్చిన చెక్క వాడకం :
ప్రతి వంటిగదిలో దాల్చినచెక్క తప్పనిసరిగా ఉంటుంది. దీన్ని వంటల్లో ఎక్కువగా వాడుతుంటారు. దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించగలదు. అంతేకాదు.. అదనపు కొవ్వు నిల్వలను కూడా తగ్గించడంలో సాయపడుతుంది. ఓట్ మీల్, స్మూతీస్‌లో దాల్చినచెక్కను చేర్చుకోవచ్చు లేదంటే తినే పండ్లపైన చల్లుకోవచ్చు.

4. కాఫీ అలవాటు మంచిదే :
కాఫీలో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. కాఫీ తాగడం వల్ల జీవక్రియను కూడా పెంచుతుంది. ఫలితంగా కొవ్వును తొందరగా కరిగించడంలో సాయపడుతుంది. అయినప్పటికీ, కాఫీని మితంగా తీసుకోవాలని మర్చిపోవద్దు. కాఫీలో అధిక మొత్తంలోచక్కెర వాడకం మంచిది కాదు.. ఏదైనా క్రీమ్ కూడా ఉపయోగించరాదు.

5. కొబ్బరి నూనె :
కొబ్బరి నూనె ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీవక్రియను బాగా పెంచుతుంది. ఆకలిని మరింత తగ్గిస్తుంది. కొవ్వును కరిగించడంలో సాయపడుతుంది. అయినప్పటికీ, కొబ్బరినూనెలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కొబ్బరినూనెను వంటల్లో కూడా వాడవచ్చు. ఏదైనా మితంగా తీసుకోవడం అన్నివిధాలా మంచిదని గుర్తుంచుకోండి.

Read Also : Kiwis Health Benefits : కివీస్ పండ్లను తీసుకోవడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలివే!

ట్రెండింగ్ వార్తలు