ఫాస్ట్‌ఫుడ్ అలవాట్లవల్లే ట్రంప్‌కి కరోనా తీవ్ర లక్షణాలు?

  • Publish Date - October 5, 2020 / 05:59 PM IST

Trump’s covid 19: అమెరికా అధ్యక్షడి చిరుతిళ్లే కొంపముంచాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఆయన తినేవన్నీ ఫాస్ట్ ఫుడ్స్. అదేమీ అరోగ్యకరంకాదు. అమెరికా ప్రెసిడెంట్‌కి కరోనా లక్షణాలు తీవ్రంగా కనిపించడానికి కారణాలు రెండు. ఒకటి ఫాస్ట్‌ఫుడ్. రెండోది ఒబిసిటీ.

నెలల తరబడి COVID-19 తీవ్రతను తక్కువగా అంచనావేస్తూ వచ్చిన ట్రంప్, క్వారంటైన్‌లోకి వెళ్లడానికి ముందు, ఈ మహమ్మారిని అంతం కనుచూపుమేరలోనే ఉందని ప్రకటించారు. ఆయన ఫ్యాన్స్ అందరూ ఆయన రెండోసారి ప్రెసిడెంట్ కావడం ఖాయమని అనుకొనేలోపే నాకు కరోనా అంటూ బాంబుపేల్చారు.



కరోనా బాడీ మీద ఎంతలా ప్రభావితం చేస్తుందో ఇప్పటికీ వైద్యనిపుణులకూ అంతుబట్టడంలేదు. ఒక్కవిషయం మాత్రం వాళ్లకు తెలుసు. హెల్తీ‌డైట్ ఉంటే కరోనా వచ్చినా బాడీ తట్టుకొంటుంది. కరోనా రికవరీలో డైట్ చాలాకీలకమని అందరూ అంటున్నారు.

బాడీ coronavirusను ఎదుర్కోవాలంటే ముందు inflammation హైలెల్స్ తట్టుకోవాలి. అదే సమయంలో micro-and macronutrients అంటే వైరస్‌ను తట్టుకొనే కావాల్సిన సూక్ష్మ పోషకాలు శరీరానికి కావాలి. రోగనిరోధక శక్తి తెగించి వైరస్‌తో పోరాటానికి కావాల్సిన ఆయుధాలను ఇచ్చేది డైటే.



Trump’s Fast-Food Diet: Trump’s diet అంత హెల్తీయేంకాదు. ఇదేమీ సీక్రెట్ కూడా కాదు. fried foods, red meatను చాలా ఇష్టంగా తింటారు. ఆయన తిండి అలవాట్లమీద చాలా విమర్శలున్నాయి. అగ్రరాజ్యానికి అధిపతి అయిఉండి ఇంత తిండేంటని కార్టూన్‌లొచ్చాయి.

ఆయన McDonald’s orderను కేలరీల్లో మార్చితే 2,390. ఒక మోడల్ వారంపాటు తినే తిండి. ఫ్రైడ్ చికెన్ తెగ తింటారు. అందుకే ట్రంప్‌కి కరోనా అనగానే అందరిలోనూ ఆందోళన.

నిరుడు, ట్రంప్ తన హెల్త్ రిపోర్ట్‌ను పబ్లిక్ చేశాడు. దాని ప్రకారం, హైట్ బట్టిచూస్తే ఆయన లావు కిందే లెక్క. అమెరికాలో హాస్పటల్ పాలువుతన్న ఎక్కువమందిలో మూడు అనారోగ్య లక్షణాలు కనిపిస్తున్నాయి. hypertension, obesity, type 2 diabetes. ట్రంప్ కూడా లావుతోనే హాస్పటల్ పాలయ్యారు.


ట్రెండింగ్ వార్తలు