Bitter guard side effects
సాధారణంగా కాకరకాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్తారు. అది నిజం కూడా. ఇందులో మనిషి ఆరోగ్యానికి సంబందించిన ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. రుచికి చేదుగా ఉంటుంది కానీ, ఆరోగ్యానికి మేలు చేస్తుంది కాకరకాయ. ఇక షుగర్ సమస్య ఉన్నవారికి కాకరకాయ అనేది ఒక వరం అనే చెప్పాలి. దీనిని రోజువారీ ఆహరం చేర్చుకోవడం వల్ల ఎన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టొచ్చు. కానీ, ఎంత ఆరోగ్యవంతమైన కాకరకాయ అయినా కూడా దానిని ఎలా తినాలో అలానే తినాలి అంటున్నారు నిపుణులు. కాకరకాయతో అస్సలు కలపకూడని కొన్ని పదార్థాలు ఉన్నాయి. వాటిని కలిపి తినడం వల్ల అది విషపూరితంగా మారే అవకాశం ఉందట. దానివల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట. మరి కాకరకాయతో కలపకూడని ఆ పదార్థాలుం ఏంటి? ఎందుకు వాటిని కాకరకాయతో కలపకూడదు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. Also Read: వర్షాకాలం దోమలతో ఇబ్బందా.. ఇలా చేయండి.. ఒక్క దోమ కూడా ఇంట్లోకి రాదు
పాలు: కాకరకాయను పాలతో అస్సలు కలపకూడదు. ఎందుకంటే.. కాకరకాయలో ఉండే వివిధ రకాల సమ్మేళనాలు పాలలో ఉండే ప్రోటీన్లతో చర్య జరపగలవు. దానివల్ల అవి విషపూరితంగా మారె అవకాశం ఉంది. అలా కలిపి తినడంవల్ల కడుపునొప్పి, మలబద్ధకం, కడుపులో మంట వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, కాకరకాయను పాలతో కలపడం మంచిది కాదు.
పెరుగు: చాలా మందికి భోజనం చివరలో పెరుగుతో తినే అలవాటు ఉంటుంది. అలాగే కాకరకాయ తిన్నప్పుడు కూడా చివర్లో పెరుగు తింటూ ఉంటారు. కానీ, ఆలా చేయడం ప్రమాదం అని చెప్తున్నారు నిపుణులు. ఎందుకంటే పెరుగు, మజ్జిగలో లాక్టిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. వీటిని కాకరకాయతో కలిపి తినడం వల్ల చర్మంపై దద్దుర్లు, దురదక, మాట ఏర్పడే అవకాశం ఉంది.
బెండకాయ: బెండకాయ జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇటు కాకరకాయలో కూడా జీర్ణ సమస్యలను నయం చేసే గుణం ఉంది. కాబట్టి, ఈ రెండు కలిపి తినడం వల్ల అది కడుపుని ఇబ్బంది పెట్టవచ్చు. క్రమంగా అది కడుపు నొప్పి, విరేచనాల సమస్యకు కారణం అవ్వొచ్చు. కాబట్టి పొరపాటున కూడా ఈ రెండు కూరగాయలను కలిపి తినకండి.
మామిడి: పైన తెలిపిన మూడింటికంటే ఇది చాలా ప్రమాదం. మామిడికాయను ఎప్పుడూ కూడా కాకరకాయతో కలిపి తినకూడదు. ఇది మరింత విషపూరితంగా మారే అవకాశం ఉందట. వీటి కలయిక వల్ల వాంతులు, కడుపులో చికాకు, గ్యాస్ సమస్యలు వస్తాయట. Also Read: మీ మొహంలో వచ్చిన మార్పులు గమనించారా? అవి నోటి క్యాన్సర్ లక్షణాలే.. జాగ్రత్త?
కాబట్టి, కాకరకాయ ఎంత ఆరోగ్యదాయకమైన కూరగాయ అయినప్పటికీ అది వేరే వాటితో కలిసినప్పుడు విషపూరితంగా మారె అవకాశం ఉంది. కాబట్టి, కాకరకాయను తినే సమయంలో పైన తెలిపిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.