Mouth Cancer: మీ మొహంలో వచ్చిన మార్పులు గమనించారా? అవి నోటి క్యాన్సర్ లక్షణాలే.. జాగ్రత్త?
Mouth Cancer: టి క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం పొగాకు, గుట్కా నమలడం. అందులోను దోమపానం చేసేవారిలో ఈ మరణాలు ఎక్కువతున్నాయి.

Mouth Cancer Symptoms
ఈ మధ్య కాలంలో నోటి క్యాన్సర్ సమస్యతో చాలా మంది చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పోలిస్తే ఇండియాలోనే ఈ మరణాల సంఖ్యా ఎక్కువగా ఉండటం గమనార్హం. అందులోనే యువత ఈ సమస్యతో చనిపోతుండటం కలవరపెడుతోంది. ఈ నోటి క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం పొగాకు, గుట్కా నమలడం. అందులోను దోమపానం చేసేవారిలో ఈ మరణాలు ఎక్కువతున్నాయి. అయినా సరే, ధూమపానం ఎంత హానికరమో ప్రకటనల ద్వారా చెప్తున్నప్పటికీ ఈ అలవాటు ఉన్నవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. కానీ, ఈ సమస్యను ముందుగానే గ్రహించి తగిన చికిత్స అందిస్తే నోటి క్యాన్సర్ సమస్యను అరికట్టవచ్చని నిపుణులు చెప్తున్నారు. అయితే. ఈ నోటి క్యాన్సర్ సమస్య వచ్చే ముందు మొహం, నోటి ప్రాంతాలలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయట. మరి ఆ అలవాట్లు ఏంటి అనేది ఇప్పడు తెలుసుకుందాం.
నోటి క్యాన్సర్ వల్ల మొహంపై కనిపించే లక్షణాలు:
నోటి క్యాన్సర్ ప్రధాన లక్షణం అంటే నోటిలో పుండ్లు అవడం అనే చెప్పాలి. ఇది ఒకరకమైన క్యాన్సర్ సంకేతమే. ఒకవేళ ఆ పుండ్లు రెండు వారాలు దాటినా నయం కాకపోతే అది ఖచ్చితంగా క్యాన్సర్ లక్షణమే అని గ్రహించండి.
నోటిలోపల చిగుళ్ళు, నాలుక, చెంప లోపలి భాగంలో తెల్లటి పూతలా ఫుడ్లు అవడం, ఎరుపు రంగు మచ్చలు అవడం, నమలడంలో, మింగడంలో లేదా నాలుకను కదిలించడంలో కూడా క్యాన్సర్ గా చెప్పుకోవచ్చు..
చిగుళ్లు కూడా బలహీనంగా తయారై పళ్ళు వదులుగా మారుతాయి. ఇది కూడా నోటి క్యాన్సర్ గా కారణంగా చెప్తారు.
పైన తెలిపిన లక్షణాలు సాధారణంగా అనిపిస్తున్నాయి. కానీ, నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.