అమెరికాలో న్యూయార్క్, న్యూజెర్సీలోనే కరోనా వ్యాప్తి 5 రెట్లు అత్యధికం

  • Publish Date - March 24, 2020 / 01:59 PM IST

అగ్రరాజ్యం అమెరికా కరోనా దెబ్బకు గజగజ వణికిపోతోంది. దేశంలో కరోనా సోకి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మందికి కరోనా సోకింది.  ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలోనే కరోనా కేసులు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. అలాంటి అమెరికాలో ఇతర ప్రాంతాల్లో కంటే న్యూయార్క్, న్యూజెర్సీలో కరోనా వ్యాప్తి 5 రెట్లు అత్యధికంగా ఉన్నట్టు యూఎస్ వైట్ హౌస్ ఇన్ ఛార్జ్ అధికారి ఒకరు వెల్లడించారు.

న్యూయార్క్ మెట్రో ప్రాంతమైన న్యూజెర్సీలో, న్యూయార్క్ సిటీతో పాటు ఇతర ద్వీపాల్లో కరోనా వైరస్ వ్యాప్తి వెయ్యి మందిలో ఒకరికి సోకినట్టు వైట్ హౌస్ కరోనా వైరస్ రెస్పాన్స్ కోఆర్డినేటర్, ఫిజిషియన్ డాక్టర్ Deborah Birx మీడియా ప్రకటనలో తెలిపారు. జనాభా శాతాన్ని బట్టి వ్యాధి తీవ్రత ఉంటుందన్నారు. తమ ప్రాంతంలో కొవిడ్-19 వైరస్ పాజిటీవ్ కేసులు సుమారుగా 28శాతంగా నమోదైనట్టు ఆమె తెలిపారు. 

దేశంలోని ఇతర ప్రాంతాల్లో 8 శాతం మందికి వైరస్ పాజిటీవ్ అని నిర్ధారించినట్టు చెప్పారు. ‘న్యూయార్క్ లోని నా తోటి ఉద్యోగులు, స్నేహితుల్లారా స్వీయ నిర్భందం, సామాజిక దూరం ఎంతో అవసరం.. తప్పక పాటించండి అంటూ ఆమె తన గ్రూపులో పోస్టు చేసింది. వారాల తరబడి వైరస్ అక్కడే ఉండే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దేశంలో ప్రస్తుతం న్యూయార్క్ అత్యధిక స్థాయిలో కరోనా వ్యాప్తిని ఎదుర్కోంటోంది.

న్యూజెర్సీ, కాలిఫోర్నియా, వాషింగ్టన్ స్టేట్లలో కంటే న్యూయార్క్ లోనే సమస్య అధికంగా ఉంది. రాష్ట్రంలో సోమవారం ఉదయానికి మొత్తం 20,875 కరోనా పాజిటీవ్ కేసులు ధ్రువీకరించగా, అందులో ఒక్క న్యూయార్క్ సిటీలోనే 12,305 కేసులు నమోదయినట్టు న్యూయార్క్ గవర్నమెంట్ ఆండ్ర్యూ క్యుమో వెల్లడించారు. అత్యవసరం కాని వ్యాపారాలను 100 శాతం తమ ఇంట్లోనే నిర్వహించుకోవాలని క్యుమో ఆదేశాలు జారీ చేశారు. న్యూయార్క్ వాసులపై కొత్త ఆంక్షలను విధించారు. 

రాష్ట్రంలో 19.4 మిలియన్ల కంటే ఎక్కువ మంది నివాసితులకు 80 శాతం వరకు కరోనా వైరస్ సోకే అవకాశం ఉందని క్యుమో అంచనా వేశారు. గతవారమే క్యుమో.. పదివేల సంఖ్యలో కొవిడ్-19 కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసినట్టు తెలిపారు. ఇంకా ఎంతమందికి వైరస్ సోకిందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. చాలామందికి కరోనా వైరస్ సోకిందని, వారిలో కొంతమందే ప్రాణపాయ స్థితిలో ఉన్నట్టు చెప్పారు. పిల్లల్లో ఈ వైరస్ వ్యాప్తి చాలా తక్కువ స్థాయిలో ఉందని బ్రిక్స్ వెల్లడించింది. 

యూరప్‌లో 15 లోపు పిల్లల్లో ఎవరికి ఈ వైరస్ సోకిన దాఖలాలు లేవన్నారు. యూరప్ లో వైరస్ సోకి 99 శాతం మంది మృతిచెందగా వారిలో 50 ఏళ్లు లేదా అప్పటికే దీర్ఘాకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కొన్ని అధ్యయనాల్లో వెల్లడించిన డేటా ప్రకారం ఆమె వెల్లడించారు. చైనాలో కేసుల దృష్ట్యా పిల్లల్లో వైరస్ ప్రభావం ఎంత ఉందో గతవారమే ఓ అధ్యయనం పేర్కొంది. చైనాలో 90 శాతం మంది పిల్లల్లో పెద్దగా లక్షణాలు కనిపించలేదని, స్వల్ప లేదా పర్యవేక్షణ కేసులు మాత్రమే నమోదయ్యాయి. వయోజనులతో 18.5శాతంతో పోలిస్తే పిల్లల్లో వైరస్ కేసులు 6శాతం మాత్రమే తీవ్రత లేదా విషమంగా ఉన్నట్టు అధ్యయనం పేర్కొంది. 

ట్రెండింగ్ వార్తలు