Common Myths Green Tea : గ్రీన్ టీ తాగే విషయంలో 3 అపోహలివే.. అసలు నమ్మొద్దంటున్న ఆరోగ్య నిపుణులు..!

Common Myths Green Tea : గ్రీన్ టీ తాగితే మంచిదేనా? ప్రతిరోజూ గ్రీన్ టీ తాగడం ద్వారా తొందరగా బరువు తగ్గుతారా? ఈ గ్రీన్ టీ తాగేవారిలో ఉన్న అపోహాలపై పోషకాహార నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

Nutritionist Busts 3 Common Myths About Green Tea That You Should Stop Believing

Common Myths on Green Tea : బరువు తగ్గడానికి గ్రీన్ టీ తాగుతున్నారా? సాధారణ టీ లేదా కాఫీ కన్నా గ్రీన్ టీలో కెఫిన్ ఉండదా? ప్రతిరోజు గ్రీన్ టీ తీసుకోవడం ఆరోగ్యకరమైనదని మీరు నమ్ముతున్నారా? ప్రతిఒక్కరిలో గ్రీన్ టీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే అద్భుతమైన పానీయం. గ్రీన్ టీ మేజిక్‌తో కొద్దిరోజుల్లోనే కిలోల కొద్ది బరువు తగ్గుతారని అందరూ నమ్ముతారు. తొందరగా బరువు తగ్గేందుకు చాలా మంది దీనిని అధికంగా తీసుకుంటారు. అయితే, ఏ ఒక్క పానీయం బరువును తగ్గించలేదని గమనించాలి. గ్రీన్ టీ గురించి మరిన్ని అపోహలను ఓసారి పరిశీలిద్దాం.

Read Also : FSSAI Health Tips : ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో ఆయిల్ ఎంత తీసుకోవాలి?.. ఫుడ్ అథారిటీ చెబుతున్న చిట్కాలు ఇవే..

గ్రీన్ టీ గురించి పోషకాహార నిపుణులు ఏమన్నారంటే? :
గ్రీన్ టీ గురించి టాప్ 3 అపోహలను పోషకాహార నిపుణురాలు న్మామి అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా పంచుకున్నారు. గ్రీన్ టీ ఆరోగ్య ప్రయోజనాల కోసం తాగుతుంటారు. అయితే ఏ ఒక్క పానీయం పూర్తిస్థాయిలో ఫలితాలను ఇవ్వలేదని గుర్తించడం చాలా అవసరమని ఆమె వీడియోలో తెలిపారు. అలాంటి సాధారణ అపోహల గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. గ్రీన్ టీ ఎంత తాగితే అంత మంచిది :
చాలా మంది బరువు తగ్గడం కోసం రోజంతా అనేక కప్పుల గ్రీన్ టీ తాగేస్తుంటారు. గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులోని యాసిడ్ స్థాయిలకు భంగం వాటిల్లుతుందని, ఎసిడిటీకి కారణమవుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అధ్యయనాలు, నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక రోజులో 4 కప్పుల కన్నా ఎక్కువ గ్రీన్ టీ తీసుకోకూడదు.

2. కెఫీన్ అసలు ఉండదు :
సాధారణ టీ, కాఫీ కన్నా గ్రీన్ టీలో కెఫిన్ చాలా తక్కువగా ఉంటుంది లేదా అసలు ఉండదు అని అందరూ నమ్ముతారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది అపోహ మాత్రమే.. గ్రీన్ టీలో కెఫిన్ కచ్చితంగా ఉంటుంది. అదేపనిగా తాగడం ద్వారా పెద్ద పరిమాణంలో కడుపులో ఆమ్లత్వాన్ని కలిగిస్తుంది.

3 Common Myths About Green Tea

3. గ్రీన్ టీ తాగితే బరువు తగ్గుతారు? :
గ్రీన్ టీ రాత్రిపూట తాగడం ద్వారా బరువు తగ్గించడంలో సాయపడదని అందరూ తెలుసుకోవాలి. గ్రీన్ టీ కొవ్వును కరిగించదు. ఇది తాగితే బరువు కూడా తగ్గరు. ఇది ఒక పానీయం లాంటిది మాత్రమే. కానీ, కచ్చితంగా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుందని పోషక నిపుణురాలు (Nmami Agarwal) తెలిపారు.

అసలు గ్రీన్ టీకి ఎందుకంత ప్రాముఖ్యత అంటే.. ఇందులో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్ కంటెంట్ ఉంటుంది. ముఖ్యంగా కాటెచిన్స్. అయితే, బ్లాక్ లేదా హెర్బల్ టీలు వంటి ఇతర టీలు, పానీయాలు కూడా ప్రత్యేకమైన ఆరోగ్య ప్రోత్సాహకాలను అందిస్తాయని షోషక నిపుణురాలు వీడియోలో తెలిపారు. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న కొన్నింటిని పోషక నిపుణులు సూచించారు. మీరు వీటిని ఎప్పుడైనా తీసుకోవచ్చు.

  • దాల్చిన చెక్క, సోంపు
  • తులసి, అల్లం టీ
  • పసుపు, నల్ల మిరియాలు టీ

అయితే, గ్రీన్ టీలో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అధిక యాంటీఆక్సిడెంట్ కంటెంట్ సెల్యులార్ డ్యామేజ్‌ని నిరోధించడంలో సాయపడుతుంది. అంతేకాదు.. గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో కూడా సాయపడుతుంది.

Read Also : Vitamin D Levels : శీతాకాలంలో మీ విటమిన్ డి స్థాయిలను పెంచడానికి అద్భుతమైన డైట్ ఇదిగో..!