FSSAI Health Tips : ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో ఆయిల్ ఎంత తీసుకోవాలి?.. ఫుడ్ అథారిటీ చెబుతున్న చిట్కాలు ఇవే..

రుచి కోసం ఆహారంలో ఆయిల్ ఎక్కువగా వాడతారు. కానీ ఆయిల్ ఎక్కువ వాడితే ఎలాంటి అనార్ధాలకు దారి తీస్తుందో తెలుసా? అసలు వంటల్లో నూనె వాడకం తగ్గించుకోవాలి అంటే ఎలా? ఫుడ్ అథారిటీ చెబుతున్న చిట్కాలు తెలుసుకోండి.

FSSAI Health Tips : ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో ఆయిల్ ఎంత తీసుకోవాలి?.. ఫుడ్ అథారిటీ చెబుతున్న చిట్కాలు ఇవే..

FSSAI Health Tips

FSSAI Health Tips : తినే ఆహారంలో నూనె, నెయ్యి, వెన్న వంటివి ఎక్కువగా తీసుకుంటే పలు అనారోగ్యాలకు దారి తీస్తుంది. నూనె వాడకం ఎలా తగ్గించుకోవాలనే అంశంపై ఫుడ్ అథారిటీ (Food Safety and Standards Authority of India) కొన్ని సూచనలు చేస్తోంది. అవేంటో చదవండి.

Jaggery : చలికాలంలో బెల్లం తినడం ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?

మనం తినే ఆహార పదార్ధాల్లో నూనె వాడకం విషయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నూనె అతిగా వాడటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఫుడ్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నూనె వాడకం తగ్గించడానికి కొన్ని చిట్కాలను సూచిస్తోంది. చాలామంది వంటల్లో నూనె, నెయ్యి లేదా వెన్న వాడతారు. వీటిని అధికంగా తీసుకుంటే బరువు పెరగడం, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కొందరు బయట ఆహారాన్ని చాలా ఇష్టపడతారు. అయితే మొదట చేయాల్సిన పని ఇంట్లో వండిన ఆహారాన్ని తినడం.. ఇంట్లో వండిన వంటల్లో నూనెను తగ్గించడం ఎంతో మంచిది. ఇంటి వంటలో రుచి కోసం నెయ్యి లేదా వెన్న ఎక్కువగా వాడతారు. దీర్ఘకాలం ఇలా వండిన వాటిని తినడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాలు చూపిస్తుంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో షేర్ చేస్తూ నూనె వాడకం తగ్గించుకునేందుకు పలు చిట్కాలు సూచించింది.

రోజూ తీసుకునే ఆహారంలో కొవ్వు శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. కొవ్వు మూలాల నుండి రోజువారి తీసుకునే కేలరీలు 20-25% మాత్రమే ఉండాలి. ప్రతి నెల నిర్ణీత పరిమాణంలో నూనె, నెయ్యి, వెన్న మాత్రమే కొనేలా ప్లాన్ చేసుకోండి. దానినే నెలంతా వినియోగించేలా చూడండి. దీనివల్ల అధికంగా వాడటం తగ్గించగలుగుతారు. రోజు వండే వంటలో నూనెను తగ్గించండి. రోజూ మూడు టేబుల్ స్పూన్లు వాడుతుంటే రెండు టేబుల్ స్పూన్లకు మారండి. తక్కువ నూనె, నెయ్యి, వెన్నతో చేసే వంటకాలు కాకుండా వీటిని ఉపయోగించకుండా వాడే ప్రత్యామ్నాయ వంటకాలను కూడా ప్రయత్నించింది.

Tea Vs Coffee : మీ పంటి ఆరోగ్యానికి ఏది మంచిది? టీ.. లేదా కాఫీ?

చాలామంది నూనెను గరిటతో వాడుతుంటారు. బాటిల్‌తో ఎత్తి పోస్తుంటారు. అలా కాకుండా నూనెను వంటకాల్లో వాడేటపుడు స్పూన్ ఉపయోగించమని FSSAI సూచిస్తోంది. ఇది నూనె వాడకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. వేయించిన ఆహారం కోసం నూనె అధికంగా కావాల్సి ఉంటుంది. అలా కాకుండా అటువంటి ఆహారాన్ని పరిమితంగా తీసుకోండి. దానికి బదులు ఉడికించిన, స్టీమ్ చేసిన ఆహారాన్ని తినమని కూడా FSSAI చెబుతోంది. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవనానికి నూనె, మరియు కొవ్వు పదార్ధాల వినియోగం ఖచ్చితంగా తగ్గించాలి.

 

View this post on Instagram

 

A post shared by FSSAI (@fssai_safefood)