Tea Vs Coffee : మీ పంటి ఆరోగ్యానికి ఏది మంచిది? టీ.. లేదా కాఫీ?

టీ, కాఫీ రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే వీటిలో ఏది పంటి ఆరోగ్యానికి మంచిది అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? చదవండి.

Tea Vs Coffee : మీ పంటి ఆరోగ్యానికి ఏది మంచిది? టీ.. లేదా కాఫీ?

Tea Versus Coffee

Updated On : November 23, 2023 / 6:36 PM IST

Tea Versus Coffee : టీ లేదా కాఫీ ఇష్టపడని వారు ఉండరు. వీటిలో ఏదో ఒకటి తాగిన తర్వాతే చాలామందికి డే స్టార్ట్ అవుతుంది. నోటి ఆరోగ్యం విషయంలో మనం తాగే కాఫీ,టీలలో ఏది దంతాలకు మంచిది? అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? అసలు ఏది మంచిదో చదవండి.

టీ, కాఫీలు దంతాల రంగు మారుస్తాయి అని చాలామందిలో ఆందోళన ఉంటుంది. ఆ భయంతో కొందరు తాగరు. కాఫీ ఎక్కువగా తాగడం వల్ల దంతాల రంగు మారుతుంది. దీనిలో ఉండే టానిన్లు అని పిలువబడే వర్ణం కాలక్రమేణా పసుపు లేదా రంగు మారడానికి దారి తీస్తుంది. అటు టీలో సైతం టానిన్‌లు ఉంటాయి. కాఫీతో పోలిస్తే టీలో ఇవి అంత ప్రభావవంతంగా ఉండవు. ఈ టానిన్‌లు పంటి ఎనామిల్‌లోకి వెళ్లడంతో వికారమైన మరకలు ఏర్పడతాయి. వాస్తవానికి పళ్లు తెల్లబడటానికి చికిత్సలు ఉన్నాయి.

Health Benefits of Okra : గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కూరగాయ ఒక్కటి చాలు !

టీ, కాఫీ రెండు ఆమ్ల పానీయాలు. కాలక్రమేణా పంటి ఎనామెల్‌ను బలహీన పరుస్తాయి. కాఫీ టీ కంటే ఎక్కువ ఆమ్లంగా మారుతుంది. కాబట్టి ఎసిడిటి విషయానికి వస్తే టీ కొంచెం ఆమ్ల స్వభావాన్ని తక్కువగా కలిగి ఉంటుంది. టీ, లేదా కాఫీకి యాడ్ చేసే చక్కెర, ఆమ్ల రుచులు వల్ల అమ్లత స్ధాయి గణనీయంగా పెరిగిపోతుందని తెలుసుకోవడం చాలా అవసరం. దంత ఆరోగ్యం కాపాడుకోవాలంటే స్వీటెనర్లు, రుచులు యాడ్ చేయకుండా పానీయాలను తీసుకోవడం మంచిది.

కాఫీలో ఉండే కెఫిన్ దంతాలకు డైరెక్ట్‌గా హాని కలిగించనప్పటికీ నోటి ఆరోగ్యాన్ని పరోక్షంగా ప్రభావితం చేస్తుంది. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో లాలాజలం కీలక పాత్ర పోషిస్తుంది. లాలాజల ఉత్పత్తిని తగ్గించే పరిస్థితికి కెఫెన్ కూడా కారణమని తెలుసుకోవాలి. కాబట్టి అధిక కెఫిన్ వినియోగం నోటి ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. టీ, కాఫీ రెండూ స్టెయినింగ్, ఎసిడిటి సమస్యలు కలిగి ఉన్నప్పటికీ నోటి ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలను కూడా అందిస్తాయి. టీలో ఉండే కాటెచిన్స్ అని పిలువబడే యాంటీ ఆక్సిడెంట్లు నోటిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించడంలో సహాయపడతాయి. కాఫీలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అయితే టీతో పోలిస్తే తక్కువ పరిమాణంలో ఉంటాయి.

Cinnamon Water Benefits : ఉదయం టీ, కాఫీలకు బదులు ఈ నీరు తీసుకుంటే షుగర్ కంట్రోల్ లో ఉండటంతోపాటు, గుండె ఆరోగ్యంగా ఉంటుంది !

నిజానికి టీ, లేదా కాఫీలో ఏది మీ దంత ఆరోగ్యానికి మంచిది అనేది రోజువారి మీ దంత సంరక్షణపై కూడా ఆధారపడి ఉంటుంది. టీ, కాఫీలు మితంగా తాగడం మంచిది. తాగిన తర్వాత నోటిని శుభ్రం చేసుకోవాలి. ఏదైనా దంత సమస్య వచ్చినపుడు వైద్యుని తప్పకుండా కలవడం.. పరీక్ష చేయించుకోవడం మంచిది.