Cinnamon Water Benefits : ఉదయం టీ, కాఫీలకు బదులు ఈ నీరు తీసుకుంటే షుగర్ కంట్రోల్ లో ఉండటంతోపాటు, గుండె ఆరోగ్యంగా ఉంటుంది !

దాల్చిన చెక్క మెదడు పనితీరును మెరుగుపరుస్తుందని పరిశోధనల్లో తేలింది. జ్ఞాపకశక్తి, శ్రద్ధను పెంచటంతోపాటు, అల్జీమర్స్ వంటి న్యూరోడెజెనరేటివ్ డిజార్డర్స్ ప్రమాదాన్ని తగ్గించేందుకు దాల్చిన చెక్క నీరు తోడ్పడుతుంది.

Cinnamon Water Benefits : ఉదయం టీ, కాఫీలకు బదులు ఈ నీరు తీసుకుంటే షుగర్ కంట్రోల్ లో ఉండటంతోపాటు, గుండె ఆరోగ్యంగా ఉంటుంది !

Cinnamon Water Benefits

Cinnamon Water Benefits : ఉదయం నిద్రలేవగానే కాఫీ, టీలు సేవించటం చాలా మందికి అలవాటు. కెఫిన్ కలిగిన ఈ పానీయాలను తీసుకోవటం వల్ల పెద్ద కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏవీ ఉండవు. వీటికి బదులు మన ఇంట్లో లభించే మసాల దినుసులతో సులభంగా కొన్ని రకాల పానీయాలను తయారు చేసుకుని తీసుకోవచ్చు. అలాంటి వాటిలో దాల్చిన చెక్క నీరు కూడా ఒకటి. ఆయుర్వేదం ప్రకారం దాల్చిన చెక్క అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

దాల్చిన చెక్క కేవలం సువాసన కారకంగానే కాకుండా.. ఆరోగ్యానికి సంబంధించి వంటింటి నివారణల్లో ఒకటి. అనేక ఆరోగ్య ప్రయోజనాలను మనకు అందిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో బాగా పనిచేస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీటిని తీసుకోవడం ద్వారా షుగర్ రోగులు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంతో పాటు, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

దాల్చిన చెక్క నీటిని తాగటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది

దాల్చినచెక్కలో యాంటీఆక్సిడెంట్స్, యాంటీబయాటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీరంలో మంటను తగ్గించడంతోపాటుగా, దాల్చిన చెక్కను వేసి మరిగించిన నీటితో మధుమేహం నియంత్రణలో ఉంచుకోవచ్చు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

జీర్ణక్రియను, జీవక్రియను ప్రేరేపించటానికి

శరీర కొవ్వును తగ్గించడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణశక్తిని పెంచే సామర్థ్యాన్ని కలిగి, మలబద్ధకం, ఇతర జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దాల్చిన నీరు ఆకలిని తగ్గించటం ద్వారా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి బాగా సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచటానికి

దాల్చినచెక్కలో యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం ద్వారా దాల్చినచెక్క నీరు అంటువ్యాధులు, అనారోగ్య పరిస్ధితులను తగ్గించడంలో సహాయపడుతుంది. దాల్చినచెక్కలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కాంపౌండ్స్ శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను ఎదుర్కోవడంలో సహాయపడతాయి.

మెదడు పనితీరుకు

దాల్చిన చెక్క మెదడు పనితీరును మెరుగుపరుస్తుందని పరిశోధనల్లో తేలింది. జ్ఞాపకశక్తి, శ్రద్ధను పెంచటంతోపాటు, అల్జీమర్స్ వంటి న్యూరోడెజెనరేటివ్ డిజార్డర్స్ ప్రమాదాన్ని తగ్గించేందుకు దాల్చిన చెక్క నీరు తోడ్పడుతుంది. గుండె జబ్బులు, క్యాన్సర్, ఆర్థరైటిస్ వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా కాపాడుతుంది.

కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటంలో

దాల్చిన చెక్క ట్రైగ్లిజరైడ్, LDL (చెడు) కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు సహాయపడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచటంతోపాటు, వాపులను తగ్గిస్తుంది.

READ ALSO : ఒత్తైన, పట్టులాంటి జుట్టు కోసం…తమలపాకులను పేస్ట్ గా చేసి !

దాల్చిన చెక్క నీరు తయారీ విధానం

ఒక గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు నీరు పోయాలి. అందులో దాల్చిన చెక్క వేసి 5-10 నిమిషాలు మరిగించాలి. ఒక కప్పులో ఆ నీటిని వడకట్టుకోవాలి. రుచి కోసం అవసరమైతే అందులో తేనె, నిమ్మరసం కలుపుకోవచ్చు. ఈ నీటిని రోజు ఉదయం తాగితూ ఉంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలను మీసొంతం చేసుకోవచ్చు.

గమనిక: అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈసమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి తగిన సూచనలు, సలహాలు పొందటం మంచిది.