Betel Leaf for Hair Growth : ఒత్తైన, పట్టులాంటి జుట్టు కోసం…తమలపాకులను పేస్ట్ గా చేసి !

జుట్టు చిట్లడం, పల్చబడటం వంటి సమస్యలను నిరోధించటంలో తమలపాకులోని పోషకాలు దోహదాపడతాయి. జుట్టు పొడిబారకుండా రక్షించటంలో తమలపాకులోని అధికంగా ఉండే తేమ సహాయపడుతుంది.

Betel Leaf for Hair Growth : ఒత్తైన, పట్టులాంటి జుట్టు కోసం…తమలపాకులను పేస్ట్ గా చేసి !

betel leaves

Betel Leaf for Hair Growth : చిన్ని చిట్కాలతో ఇంట్లో అందుబాటులో దొరికే వాటితోనే చర్మాన్ని, హెయిర్‌ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. సులభమైన పద్ధతుల్లో ఆరోగ్యకరమైన చిట్కాలను అనుసరించటం పెద్ద కష్టమేమికాదు. కొంచెం ఓపికతో వ్యవహరించటమే ముఖ్యం. మహిళలంటే ప్రధానంగా జుట్టు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయితే ఎన్ని జాగ్రత్తలు పాటించినా జుట్టుకు సంబంధించిన సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. జుట్టు ఊడి పోవటం, కళావిహీనంగా మారంటం వంటి సమస్యలు చికాకు పెడుతుంటాయి. అలాంటి వారి కోసం ఇప్పుడు మేం చెప్పబోయే రెమిడీ సూపర్ గా ఉపయోగపడుతుంది. అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

READ ALSO : Betel Leaves : రోజుకు రెండు తమలపాకులు, పచ్చకర్పూరంతో కలిపి తీసుకుంటే కంటి సమస్యలు దరిచేరవా?

తమలపాకులు ;

ప్రతి ఇంట్లో శుభకార్యమంటే గుర్తుకు వచ్చేది తమలపాకులు. పూజలు, శుభకార్యాలకు, తమలపాకులు తప్పనిసరిగా ఉండాల్సిందే. తమలపాకును ఆధ్యాత్మికంగానే కాకుండా అనారోగ్య పరమైన చికిత్సలోనూ ఉపయోగించటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. ఆయుర్వేద వైద్యంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తమలపాకులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉండటమే దీనికి కారణం. తమలపాకులో పొటాషియం, నికోటినిక్ యాసిడ్, విటమిన్ A, విటమిన్ సి, విటమిన్ B2, విటమిన్‌ B1 వంటి పోషకాలు శరీర ఆరోగ్యానికే కాకుండా జుట్టు సంరక్షణకు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. తమలపాకులోని యాంటీమైక్రోబయాల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జుట్టు ఊడిపోవటాన్ని నిరోధిస్తాయి. అందుకు కారణమయ్యే బ్యాక్టీరియాను నిరోధిస్తాయి.

READ ALSO :  Betel Leaves : అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం సమస్యలకు తమలపాకులు ఔషధంగా పనిచేస్తాయా?

జుట్టు పోషణకు తమల పాకులు ;

జుట్టు చిట్లడం, పల్చబడటం వంటి సమస్యలను నిరోధించటంలో తమలపాకులోని పోషకాలు దోహదాపడతాయి. జుట్టు పొడిబారకుండా రక్షించటంలో తమలపాకులోని అధికంగా ఉండే తేమ సహాయపడుతుంది. దీనిలోని విటమిన్‌ సి జుట్టు పెరుగుదలకు సహాయపడటంతోపాటు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. దీనిలో ఉండే యాంటీ బాక్టీరియల్‌ గుణాలు.. స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణనిస్తుంది. చుండ్రు సమస్యను చెక్‌పెట్టి జుట్టు కండీషనర్‌లా పనిచేస్తుంది. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరిగేలా చేస్తుంది.​

READ ALSO : Thambulam : ముతైదువులకు ఇచ్చే తాంబూలంలో కచ్చితంగా ఉండాల్సినవి .. పాటించాల్సిన నియమాలు

జుట్టు రాలే సమస్య తగ్గాలంటే తమల పాకులతో ;

ఇరవై తమలపాకులని తీసుకుని శుభ్రంగా కడిగి పేస్టుగా చేసుకోవాలి. ఆ పేస్టులో టీస్పూను నెయ్యి వేసి కలపాలి. ఇలా తయారైన పేస్టును కుదుళ్ళ నుండి వెంట్రుకల చివర్ల వరకు పట్టించాలి. ఇలా గంట సేపు వదిలేయాలి. తరువాత నీటితో కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చేయటం వల్ల తమలపాకులోని పోషకాలు జుట్టుకు అందుతాయి. జుట్టు మరింత బలంగా మారి జుట్టురాలే సమస్య తగ్గుతుంది.

తమలపాకు పేస్ట్‌లో కొద్దిగా కొబ్బరి నూనె ఆముదం కలిపి జుట్టు కుదుళ్లకు మసాజ్‌ చేసినా మంచి ఫలితం ఉంటుంది. జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుంది. వారానికి ఒకసారి చొప్పున చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

READ ALSO : బరువు తగ్గించే తమలపాకుతో బోలెడు ప్రయోజనాలు

అలాగే పది తమలపాకులకు నీటిని కలిపి మిక్సీలో వేసి పేస్టు చేసుకోవాలి. ఆపేస్టుకు మూడు చెంచాల నెయ్యి, అరటీ స్పూను తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు, జుట్టుకు ప్యాక్‌లా వేసి అరగంట వదిలేయాలి. తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టు చివర్లు చిట్లడం తగ్గడంతోపాటు , జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. జుట్టును మృదువుగా, ఒత్తుగా చేయటంలో సహాయపడుతుంది.