Betel Leaves : అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం సమస్యలకు తమలపాకులు ఔషధంగా పనిచేస్తాయా?

తమలపాకులో కార్మినేటివ్, గ్యాస్ట్రో ప్రొటెక్టివ్ , యాంటీ కార్మినేటివ్ గుణాలు ఉన్నాయి. ఇవన్నీ మంచి జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. ఇది లాలాజలం విడుదలను ప్రేరేపిస్తుంది. తమలపాకులలో విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రైబోఫ్లావిన్ ,కెరోటిన్ వంటి విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

Betel Leaves : అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం సమస్యలకు తమలపాకులు ఔషధంగా పనిచేస్తాయా?

Betel Leaves

Updated On : August 5, 2022 / 4:53 PM IST

Betel Leaves : భోజనం తరువాత తమలపాకులతో కూడిన పాన్ తినటం అన్నది పురాతన కాలంగా భారత దేశంలోని ప్రజలు అనుసరిస్తున్న సాంప్రదాయం. తమలపాకులను తినటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు ఆయుర్వేదం చెబుతుంది. ఈ ఆకుల్లో అనేక ఔషధగుణాలు ఉన్నాయి.

తమలపాకులో కార్మినేటివ్, గ్యాస్ట్రో ప్రొటెక్టివ్ , యాంటీ కార్మినేటివ్ గుణాలు ఉన్నాయి. ఇవన్నీ జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. ఇది లాలాజలం విడుదలను ప్రేరేపిస్తుంది. తమలపాకులలో విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రైబోఫ్లావిన్ ,కెరోటిన్ వంటి విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. కాల్షియం మంచి మూలం. ఈ యాంటీ ఆక్సిడెంట్లు పొట్టలోని పిహెచ్ స్థాయిని నిర్వహించడానికి సహాయపడతాయి.

అజీర్ణం, మలబద్ధకం ,గ్యాస్ట్రిక్ సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం భోజనం తర్వాత పాన్ నమలడం వల్ల జీర్ణ రసాల స్రావం పెరుగుతుంది కాబట్టి జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. పేగు పరాన్నజీవులను నాశనం చేస్తుంది.

శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి. తమలపాకులను వేడిచేసి గాయాలు, వాపులపై పట్టుగా వేసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది. తమలపాకులకు తేనెను కలిపి నమిలితే దగ్గు తగ్గుతుంది. తమలపాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గుండె అపసవ్యంగా, అపక్రమంగా కొట్టుకుంటున్నప్పుడు తమలపాకు రసాన్ని టీ స్పూన్ మోతాదుగా తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది. తమలపాకు రసాన్ని టీ స్పూన్ మోతాదులో మూడుపూటలా మిరియం పొడి కలిపి తీసుకుంటుంటే జ్వరం తగ్గుతుంది.