Powerful food to eat in the morning for heart health
Heart Health: మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో గుండె (Heart Health) అతి ప్రధానమైనది. గుండె ఆరోగ్యం బాగుండాలి అంటే జీవనశైలి, ఆహారం, వ్యాయామం చాలా అవసరం. ముఖ్యంగా రోజును ప్రారంభించే ఉదయాన్నే తీసుకునే ఆహారం గుండె ఆరోగ్యంలో చాలా కీలకం. ఇది శరీరానికి మాత్రమే కాకుండా గుండెకు రక్షణ కూడా అందిస్తుంది. కాబట్టి, ఉదయాన్నే తీసుకోవటానికి గుండెకు ఎంతో మేలు చేసే 5 రకాల ఆహార పదార్థాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
Women Health: అబార్షన్ మనసును బాధిస్తోందా.. శారీరక శక్తి, మానసిక ప్రశాంతత కోసం ఇవి చేయండి
1.ఓట్స్:
మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో గుండె (Heart) అతి ప్రధానమైనది. గుండె ఆరోగ్యం బాగుండాలి అంటే జీవనశైలి, ఆహారం,ఓట్స్‌లో బీటా గ్లూకాన్ అనే ధాన్యం తంతువు ఉంటుంది. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించడంలో సహాయపడుతుంది. వేడి పాలు లేదా నీటిలో ఓట్స్ ఉడికించి తింటే మంచి ఫలితాలు అందుతాయి. వాటిలో కొద్దిగా తేనె, డ్రై ఫ్రూట్స్ కూడా చేర్చుకోవచ్చు.
2.బేరీలు:
బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్బెర్రీలు వంటి బేరీలు యాంటీ ఆక్సిడెంట్లు, పాలిఫినాల్స్ తో నిండివుంటాయి. ఇవి గుండె నాళాల్లో రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. కాబట్టి వీటిని దోస, ఓట్స్, దహితో కలిపి తీసుకోవచ్చు. తాజా ఫ్రూట్ బౌల్‌లలో, సలాడ్స్ లో కూడా కలిపి తినవచ్చు.
3.అవోకాడో:
అవోకాడోలో మోనోసాచ్యురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెకు మంచి కొవ్వులుగా పనిచేస్తాయి. ఇందులో పొటాషియం, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. బ్రెడ్ టోస్ట్‌లో వేసుకొని తినవచ్చు. స్మూతీగా లేదా సలాడ్‌గా కలిపి తీసుకోవచ్చు.
4.చిక్కుడు వర్గపు మొలకలు:
మొలకలలో ఉండే ప్రోటీన్, ఐరన్, ఫైబర్, మాగ్నీషియం, పోటాషియం వంటివి హృదయ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మొలుకలలో తేనె, నిమ్మరసం చల్లి తింటే మంచి ఫలితాలు అందుతాయి. లేదా ఉడికించి సలాడ్ గా కూడా తినవచ్చు.
5.వాల్‌నట్ లేదా బాదం:
వీటిలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ E, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెకు చాలా ప్రయోజనకరం. ఉదయాన్నే 4 నుంచి 5 బాదం లేదా 2 నుంచి 3 వాల్‌నట్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.