Magnesium Deficiency : మెగ్నీషియం లోపిస్తే?.. అనారోగ్య సంకేతాలు ఇవే..

శరీరంలోని అన్ని జీవరసాయన క్రియలు సక్రమంగా జరగాలంటే మెగ్నీషియం చాలా అవసరం. అది లోపిస్తే రకరకాల అనారోగ్య సమస్యలతో సంకేతాలను సూచిస్తుంది. అలాంటి సమయంలో మెగ్నీషియం అధికంగా ఉండే ఆహార పదార్ధాలను తినడంతోపాటు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.

Magnesium Deficiency : కండరాలు సరిగా పనిచేయాలన్నా.. శరీరంలో జీవరసాయన ప్రక్రియలు సరిగా సాగలన్నా అవసరమైన ఖనిజం మెగ్నీషియం. ఎముకలు బలంగా ఉంచడంలో శరీరంలో రోగ నిరోధన వ్యవస్థ సరిగా పనిచేయడంలో ఇది చాలా కీలకం. కొన్ని అనారోగ్య సమస్యల ద్వారా మెగ్నీషియం లోపించిందని గ్రహించవచ్చును. అవేంటంటే?

Magnesium : మెగ్నీషియం సమృద్ధిగా ఉండే అల్పాహారం వంటకాలు ఇవిగో!

శరీరంలో మెగ్నీషియం లోపం ఏర్పడితే రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే అవి ఎలాంటి సంకేతాలు ఇస్తాయి అనేది ముందుగానే గ్రహించుకోవాలి. కండరాలు సరిగా పనిచేయాలంటే మెగ్నీషియం చాలా అవసరం. అది లోపిస్తే కండరాలు తిమ్మిరిగా ఉండటం అనే లక్షణం బయటపడుతుంది.

 

బాగా అలసిపోయినట్లు ఉన్నా.. నిస్సత్తువ ఆవరిస్తున్నా మెగ్నీషియం లోపం కూడా కావచ్చు. మెగ్నీషియం శరీరానికి కావాల్సిన శక్తి ఇవ్వడంలో పార్టిసిపేట్ చేస్తుంది. తగిన మెగ్నీషియం లేకపోతే శక్తి ఉత్పత్తి అవ్వదు. దాంతో అలసట, బలహీనంగా ఉండటం అనే లక్షణాలు బయటపడతాయి. ఇక నిద్రపట్టకపోవడం లేదా విపరీతంగా నిద్రపోవడం ఇలాంటి పరిస్థితి కూడా మెగ్నీషియం లోపం వల్ల జరుగుతుందట.

Magnesium : శరీరానికి మెగ్నీషియం ఎంత అవసరమో తెలుసా?..

మెగ్నీషియం నాడీ వ్యవస్థను కంట్రోల్ చేస్తుంది. మానసిక స్థితిని కంట్రోల్‌లో ఉంచే న్యూరోట్రాన్స్మీటర్ల ఉత్పత్తిలో కూడా పాల్గొంటుంది. ఎప్పుడైతే మెగ్నీషియం లోపం ఏర్పడతుందో నియంత్రణ లేక ఆందోళన, నిరాశ వంటి వాటికి దారి తీస్తుంది. బీపీని కంట్రోల్‌లో ఉంచడంలో కూడా మెగ్నీషియం సహాయపడుతుంది. దీని లోపం వల్ల రక్తపోటు కంట్రోల్ తప్పుతుంది. హృదయ స్పందనను నియంత్రించడంలో కూడా మెగ్నీషియం పాత్ర ఉంటుంది. ఇది లోపిస్తే హృదయ స్పందనలు కంట్రోల్ తప్పుతాయి.

 

ఎముకల ఆరోగ్యానికి మెగ్నీషియం చాలా అవసరం. ఇది లోపిస్తే బోలు ఎముకల వ్యాధి లేదా ఇతర ఎముకల వ్యాధులకు దారి తీస్తుంది. ఇక మైగ్రేన్ తలనొప్పికి మెగ్నీషియం లోపం కూడా కారణం కావచ్చట. చేతులు, కాళ్లలో తిమ్మిరి, జలదరింపు కూడా మెగ్నీషియం లోపం వల్ల ఏర్పడతాయట. ఇన్సులిన్ ఉత్పత్తి, గ్లూకోజ్ జీవక్రియలో మెగ్నీషియం చాలా అవసరం.. దీని లోపం టైప్-2 డయాబెటీస్‌కి దారి తీస్తుందట. మలబద్ధకం కూడా మెగ్నీషియం లోపం కారణం కావచ్చట. మెగ్నీషియం లోపిస్తే శరీరంపై ఎంతటి దుష్ప్రభావాన్ని చూపిస్తుందో అర్ధమవుతోంది కదా.. ఈ లోపం ఉన్నవారు మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారపదార్ధాలను తీసుకోవడంతో పాటు నిర్ధారించుకునేందుకు ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాలి.

ట్రెండింగ్ వార్తలు